మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ముఖ్యమంత్రి కెసిఆర్ నిరుపేద అనారోగ్య బాధితులకు సిఎంఆర్ఎఫ్ ద్వారా సహాయనిధులను అందజేస్తూ.. వారికి కొండంత అండగా నిలుస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 20 డివిజన్ కు చెందిన దండుగుల హరిప్రియ అనే చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుందని వారికి సహయం అందించాలని స్థానిక కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్ ఎమ్మేల్యే చందర్ ను కోరడం జరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే చందర్ సీఎంఆర్ఎఫ్ ద్వారా చిన్నారి వైద్యచికిత్స నిమిత్తం రూ. 2,50,000ల ఎల్ ఓ సి ని చిన్నారి తండ్రి శ్రీనివాస్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ.. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని నిరుపేద అనారోగ్య బాధితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా కోట్లాది రూపాయలను మంజూరు చేయుంచినట్లు తెలిపారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే సంకల్పంతో సీఎం కేసిఆర్ గారు సిఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసాను కల్పిస్తున్నారన్నారు. రామగుండం నిరుపేద ప్రజానీకానికి తాను ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే కోరుకొండ చందర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కన్నూరి సతీష్ కుమార్, కల్వచర్ల కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: