ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
డిసెంబర్ 31 వేడుకలు జరుపుకునే వారు ప్రమాదాలకు దూరంగా ఉంటూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి యుతమైన ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి జె. సురేందర్ రెడ్డి శుక్రవారం కోరారు. జిల్లా ప్రజలందరికీ ముందస్తుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలను ఎస్పి తెలియజేశారు. 2023 సంవత్సరం లో అందరికీ శుభం కలగాలని అన్నారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆకతాయి పనులకు పాల్పడకుండా, యువత వేడుకలు జరుపుకోవాలని కోరారు.
మద్యం దుకాణాలు, వైన్ షాప్స్, బార్స్, రెస్టారెంట్స్ ప్రభుత్వo అనుమతించిన సమయపాలన పాటించాలని,31వ తేది న స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తామనీ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించ రాదని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిని అదుపులొకి తీసుకుని చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ట్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్, హెల్మెట్ లేకుండ వాహనం నడిపితే చట్ట పరమైన చర్యలు తప్పవన్నారు. ప్రజలు, యువత రక్షణ కోసమే భద్రత చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎస్పి పేర్కొన్నారు. మహిళలను వేధిoపులకు గురి చేస్తూ, ఇబ్బందులను పెట్టే వారిపై ఎప్పడికప్పుడు పర్యవేక్షణ చేయడం జరుగుతుందనీ, డి.జే లను ఉపయోగించడం, మరియు నిబంధనలు అతిక్రమిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవనీ,
ముఖ్యంగా యువత పై కేసు నమాదైతే భవిషత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు, విదేశాలకు వెళ్ళేటప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.
ప్రజలు, యువత పోలీసుల సూచనలు పాటిస్తూ, సహకరించాలనీ ఎస్పి కోరారు.
Post A Comment: