మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్:తెలంగాణ టెన్త్ పరీక్షలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. పరీక్షల్లో వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుందని,సూక్ష్మరూప ప్రశ్నలకు ఛాయిస్ లేదని వెల్లడించారు.త్వరలో వెబ్సైటులో మోడల్ ప్రశ్న పత్రాలు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.పదవ తరగతి విద్యార్థులకు సెలవు రోజుల్లోనూ ప్రత్యేకంగా క్లాసులు చెప్పాలి.ఏదైనా సబ్జెక్టుల్లో వెనుకబడిన వారిని గుర్తించి ప్రత్యేకంగా బోధన చేయాలని సూచించారు. ఫిబ్రవరి,మార్చిలో ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని అన్నారు.ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా,ఉత్తీర్ణత శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Post A Comment: