ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రజల రక్షణ, పోలీసుల ధ్యేయంగా జిల్లా పోలీసులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీసు వార్షిక నేర నివేదిక రిపోర్టును విడుదల చేశారు. సంవత్సర కాలంగా జిల్లా పోలీసుల విజయాలు, సేవలు, నమోదైన కేసుల గణాంకాలను ఎస్పి తెలిపారు. ప్రాణహిత పుష్కరాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని, అలాగే గోదావరి వరదల సమయంలో పోలీసు అధికారులు, సిబ్బంది అహర్నిశలు పనిచేశారని పేర్కొన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా పలిమెల మండలంలో గోదావరి వరద పరివాహ ప్రాంతాలకు అండగా నిలిచామని అన్నారు. అంతేకాకుండా జిల్లాలో మావోయిస్టులు ఎలాంటి హింసాత్మక సంఘటనలకు దిగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్టు ఎస్పీ వెల్లడించారు.
Post A Comment: