ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రస్తుత వరంగల్ బస్ స్టాండ్ ప్రాంతంలో స్మార్ట్ బస్ స్టేషన్ నిర్మాణ పనులు త్వరలో మొదలుపెడతామని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
తెలిపారు. కొత్త బస్ స్టేషన్ నిర్మాణంతో జిల్లా ప్రజలకు మెరుగైన సౌకర్యం అందుతుందని
నూతన బస్టాండ్ లో 32 ఫ్లాట్ ఫామ్స్ ఏర్పాటు చేస్తామన్నారు.
అత్యంత సుందరంగా అన్ని హంగులతో నూతన బస్టాండ్ ఉండబోతుందని అన్నారు.
అతిత్వరలో మున్సిపల్,ఐటి శాఖ మంత్రి కేటీఆర్ తో శంకుస్థాపన జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
నూతన బస్ స్టేషన్ నిర్మాణానికి జీవో జారీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్,రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే.టీ.ఆర్ కు మరియు జిల్లా మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు,రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కృతజ్ఞతలు తెలియజేశారు.
Post A Comment: