మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఇంటర్నేషనల్ అండర్ 14 క్రికెట్ క్రీడా విభాగంలో రామగుండం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు తాజ్ భాయ్ గారి కుమారులైనటువంటి తౌఫిక్ నేపాల్ లో జరిగినటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొని నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయగా కేవలం 13 రన్నులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కైవసం చేసుకున్నాడు అదేవిధంగా వీళ్లు ఆడిన ఈ జట్టు రన్నర్ గా నిలబడి సిల్వర్ పథకాన్ని కైవసం చేసుకున్నారు రామగుండం పట్టడంలో పుట్టి ఇంతటి ఘన కీర్తిని చిన్న వయసులోనే రామగుండం ప్రాంతానికి తెచ్చిపెట్టిన తౌఫిక్కు కాంగ్రెస్ పార్టీ రామగుండం పట్టణ కమిటీ పక్షాన రామగుండం రైల్వే స్టేషన్లో పూలమాలలతో శాలువాలు కప్పి ఘన స్వాగతం తెలియజేయడం జరిగింది చిరంజీవి తౌఫిక్ భవిష్యత్తులో ఇలాంటి విజయాలు మరెన్నో సొంతం చేసుకోవాలని పుట్టిన ఊరు కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేస్తూ అభినందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చాంద్ పాషా, జబ్బార్, గజ్జల నాగరాజు, కాంపెల్లి సంతోష్, ఎండి యాసిన్, ఎండి మోయిన్ పప్పీ, అనిత చౌదరి, తార. తదితరులు పాల్గొన్నారు
Post A Comment: