ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ ఆటో యూనియన్ అడ్డా ను తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రారంభించారు .
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే ఎజెండాగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. తాను కార్మికుని కొడుకునేనని వారి కష్టాలు నాకు తెలుసున్నారు. ఆటో కార్మికుల అందరికి ప్రతి కష్టం లోను అండగా ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమం లో డివిజన్ కార్పోరేటర్ గందె కల్పన -నవీన్, కార్పోరేటర్ చింతాకుల అనిల్, కార్పోరేటర్ సురేష్ జోషి,కార్పొరేటర్ వస్కుల బాబు,సునీల్, మాజీ మార్కెట్ చైర్మన్ టి. రమేష్ బాబు, మాజీ కార్పొరేటర్ జారతి రమేష్, బీఆర్ఎస్ నాయకులు,కార్మికులు పాల్గొన్నారు.
Post A Comment: