ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ నగరం లోని రాధాకృష్ణ (మహేశ్వరీ) గార్డెన్స్ లో జరగనున్న త్యాగరాయ వార్షికోత్సవాల ను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ స్టేషన్ రోడ్ లోని మహేశ్వరీ గార్డెన్స్ లో జరిగిన ప్రెస్ మీట్ కి ముఖ్య అతిధి గా వరంగల్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ప్రొఫెసర్ పాండు రంగారావు, భద్రకాళి శేషయ్య, తదితరులు హాజరై మాట్లాడారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వరంగల్ కేంద్రం గా మొదటిసారి గా జనవరి 11,12,13 తేది లలో త్యాగరాజ సంకీర్తనలు నిర్వహించబోతున్నాం.
రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు, భద్రకాళి అమ్మవారి ప్రధాన పూజారి శేషయ్య లాంటి పెద్దల సహకారం తో విజయవంతానికి కృషి చేస్తా.
త్యాగరాజ కీర్తనలు మనిషిలో మంచిని ప్రేరేపించి సన్మార్గం లో నడిచేవిధంగా ఉపయోగపడుతాయి.
త్యాగరాజ కీర్తనలలో కవులు, కళాకారులు, మేధావులు, పెద్దలు హాజరై విజయవంతం చేయాలి.వరంగల్ ప్రజలు అధిక సంఖ్య లో వేలాది పాల్గొని జయప్రదం చేయాలి, ప్రజలు సహకరించాలి.
త్యాగరాజ సంకీర్తనల కోసం వచ్చే ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం.
వరంగల్ లో వెంపటి కుటుంబం వారు ఏండ్ల తరబడి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అటువంటి వారి ని మరింత ప్రోత్సాహించాలి, కళారంగాన్ని కాపాడుకోవాలి.
ఉర్సు గుట్ట వద్ద 1 ఎకరం లో కళాక్షేత్రం ఏర్పాటు చేసుకోబోతున్నాం. కళ లను కాపాడుకుంటాం.
గతంలో వరంగల్ కేంద్రం గా జరిగిన అనేక బహిరంగ సభలు, ప్రముఖుల రాక సందర్బంగా ఏర్పాట్లు చేసిన అనుభవాలు తో మరింత పాటిష్టంగా ఏర్పాట్లు చేస్తాం.
ఉమ్మడి రాష్ట్రం లో గత పాలకుల హయాంలో అభవృద్ధికి నోచుకోని వరంగల్, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది రాబోయే కాలం లో మరింత అభివృద్ధి చెందుతుంది, మరిన్ని వేడుకలు నిర్వహించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
కార్యక్రమం లో స్థానిక కార్పొరేటర్ గందె కల్పనా-నవీన్, వివిధ డివిజన్ ల కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: