September 2023
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

మంత్రి కేటీఆర్  వరంగల్ తూర్పు నియోజకవర్గ పర్యటన సందర్భంగా ఓసిటీలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షులు, ఇంచార్జ్ లతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గారి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, సంక్షేమ సభ నిర్వహణ ఏర్పాట్లపై ఎమ్మెల్యే నరేందర్ వారందరికి దిశానిర్దేశం చేశారు.

కేసీఆర్ సంక్షేమ ఫలాలు పొందే లబ్ధిదారులతో ఏర్పాటు చేయనున్న ఈ సమావేశానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నాయకులు ఏర్పాట్లలో నిమగ్నమవాలని ఎమ్మెల్యే సూచించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ రిజ్వానా షమిమ్ మసూద్ తో పాటు నియోజకవర్గ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఇంచార్జ్ లు,ముఖ్య నాయకులు హాజరయ్యారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

మారుమూల గ్రామ ప్రజలకు సైతం కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు మరింత సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని ఎంపీ, దిశ కమిటీ  చైర్మన్   పసునూరి దయాకర్ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టర్ భవన సమావేశ మందిరంలో కేంద్రం నుంచి జిల్లాకు మంజూరయ్యే పథకాలు, నిధులుపై జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ (దిశ) కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి కృషి యోజన పథకం, గ్రామీణ స్వచ్ఛ భారత్, ప్రధానమంత్రి సడక్ యోజన, జాతీయ ఆరోగ్యమిషన్‌తో పాటు వివిధ పథకాల అమలు తీరుపై చైర్మన్ సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే పథకాలు సక్రమంగా అమలు జరిగేలా దిశా కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. అలాగే అధికారులు పథకాలు సక్రమంగా అమలయ్యేలా కృషి చేయాలని, క్షేత్రస్థాయిలో పథకాల అమలు తీరులో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు. కేంద్రస్థాయి పథకాలు అనేకం ఉన్నాయని, జిల్లావ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని పథకాలు విజయవంతంగా నిర్వహించ బడుతున్నాయని, మిగతా పథకాలు కూడా అదేస్థాయిలో అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

 పథకం ఉద్దేశం, అమలు విధానంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనులను పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని స్పష్టం చేసారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

సరైన పోషణతో ఆరోగ్యవంతమైన సమాజం  నిర్మాణం జరుగుతుందని జిల్లా సంక్షేమ అధికారి 

కే మధురిమ  అన్నారు. పోషణ మాసం చివరి రోజు సందర్భంగా  శనివారం రోజున కీర్తి స్థూపం దగ్గర పోషణ మాసం ముగింపు  రోజున  నిర్వహించిన కార్యక్రమంలో  మాట్లాడుతూ సెప్టెంబర్  1 నుంచి  30 వరకు పోషణ మాసం కార్యక్రమాలు జిల్లాలోని మూడు ప్రాజెక్ట్ పరిధి, మండలాలలో, గ్రామాలలోని అంగన్వాడి  కేంద్రాలలో అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందని అన్నారు.

 6 నెలల లోపు పిల్లలకు పూర్తిగా తల్లిపాలే ఇవ్వాలని, పిల్లలు  (0-5) ఇందు నిమిత్తం సంబంధిత శాఖ అధికారులు తల్లి పాల ప్రాముఖ్యత పై అవగాహన కల్పించాలని, యుక్త వయస్సు బాలికలు , గర్భిణీలు మరియు బాలింతలు సమతుల ఆహారం తీసుకోవాలని గురించి తెలియచేయాలని  కోరినారు.  ప్రత్యేక పెరుగుదల పర్యవేక్షణ డ్రైవ్ అన్ని అంగన్ వాడి కేంద్రాలలో నిర్వహించి, పిల్లలందరి ఎత్తు , బరువు తూచి వారి పెరుగుదల వివరాలు పోషణ్ ట్రాక్ లో అప్ డేట్ చేసి, తక్కువ, అతి తక్కువ బరువున్న పిల్లల తల్లులకు కౌన్సిలింగ్ నిర్వహించి, వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. పోషణ మాసం సందర్భంగా సమీక్ష అనుకుకున్న ప్రణాళికా ప్రకారం సమావేశాలు, అవగాహన సదస్సుల ద్వారా జిల్లా అధికారులు మరియు మండల అధికారుల ద్వారా ప్రజల వద్దకు సమాచారం చేరేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. పిల్లలు , తల్లులు , బాలింతలు అందరూ సమతుల ఆహరం తీసుకోవాలని సూచించారు. పోషణ మాసంలో భాగంగా జిల్లా పరిధిలో అతి తక్కువ బరువున్న పిల్లలకు న్యూట్రిషినల్ రీహబిలిటేషన్ సెంటర్ కి రిఫర్ చేసి వారి పోషణ స్థాయి పెరిగే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. గవర్నమెంట్ హాస్పిటల్ లో అప్పుడే పుట్టిన పిల్లల తల్లులకు అవగాహన కార్యక్రమాల ద్వారా తల్లిపాల ప్రాముఖ్యత గురించి తెలియచేయడం జరిగిందని అన్నారు.

 జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ హరి ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై క్షేత్ర స్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి పోషణ అభియాన్ కార్యక్రమం ఉద్దేశాలను వివరించడం ఒక ఎత్తైతే పోషక ఆహారంపై  ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొదించుకోవాలని అన్నారు. 

18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకుడు ఓటర్ నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు ఆయువు పట్టు లాంటిదని, 18 సంవత్సరాలు పైబడి ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్,   ఐసిడిఎస్ సూపర్వైజర్లు వంచ రాజ్యలక్ష్మి, డీ రాజ్యలక్ష్మి, వనజ, డీ కవిత, రమ, జ్యోతి, పోషణ అభియాన్ బ్లాక్ కో ఆర్డినేటర్ డి ప్రీతి,

అంగన్వాడి టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

కాగా ఈ సందర్భంగా ప్రభుత్వ కాలేజ్ ఎట్ హోం, రీచ్ బాలికల సంరక్షణ కేంద్రం బాలికలు పోషణ మాసం, ఓటు హక్కు వినియోగంపై ప్రదర్శించిన ఫ్లాష్ మాబ్ ఆకట్టుకుంది.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

హనుమకొండ, వరంగల్ జిల్లాలో రాష్ట్ర ఐటి, పురపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టి విజయవంతం చేయాలని  రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్  అన్నారు.

శనివారం ఆయన మేయర్ గుండు సుధారాణి,కూడ కాన్ఫరెన్స్ హాల్లో కూడ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్, కమిషనర్ రిజవాన్ బాషా తో కలిసి అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  వచ్చే నెల ఆరవ తేదీన మంత్రి కేటీ ఆర్ హైదరాబాద్ నుండి నేరుగా చాఫర్ లో కెఎంసీ  కి చేరుకుంటారు అని అన్నారు. అనంతరం ఎంజీఎం  సమీపంలో పోలీస్ భరోసా కేంద్ర ప్రారంభోత్సవం తో జిల్లా పర్యటన ప్రారంభం కానున్నదని ఆయన అన్నారు.  స్మార్ట్ సిటీ పనులు, డిజిటల్ లైబ్రరీ,ఐటి టవర్స్,ఆరు జంక్షన్ ప్రారంభోత్సవాలు,వివిధ రకాల శంఖుస్థాపనల ప్రదేశాల్లో అన్ని సిద్ధం చేయాలని, అధికారులు తమకు కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆయన తెలిపారు. రూట్ మ్యాప్ పై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 58, 59, 76 మొదలగు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, లబ్ధిదారులకు సీటింగ్ అరేంజ్మెంట్ ప్రత్యేకంగా చేయాలని ఆయన సూచించారు.

మంత్రి పర్యటన నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.అధికారులు వారి వారి శాఖల పరిధిలో చేపట్టే పనులు సజావుగా జరిగే విధంగా పర్యవేక్షించాలని ఆయన తెలిపారు. మంత్రి పర్యటన నేపథ్యంలో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయాలని  ఆయన అధికారులను ఆదేశించారు.

 ఈ కార్యక్రమం లో అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ, డీసీపీ బారి, ట్రైనీ కలెక్టర్ శ్రద్ద శుక్ల, డిఆర్డిఏ పిడి  శ్రీనివాస్ కుమార్, డిఈఓ  అబ్దుల్ హై, జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు.. 

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

ప్రపంచ పర్యాటక దినోత్సవాల సందర్భంగా శుక్రవారం నాడు కాజీపేట బొడగుట్టలో ట్రెక్కింగ్, భద్రకాళి బండ్ వద్ద బోటింగ్ యూనిట్ ను టూరిజం మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటలకు కాజీపేట సమీపం లోని బొడ గుట్టలో నిపుణుల సమక్షంలో ట్రెక్కింగ్ ను మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ ప్రారంభిస్తారు.అనంతరం ఉదయం 11 గంటలకు భద్రకాళి బండ్ మీద బోటింగ్ యూనిట్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల్లో పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,టూరిజం కార్పొరేషన్ యండీ మనోహర్ రావు,చైర్మన్ గెల్లు శ్రీనివాస్ ,చీఫ్ విప్ పశ్చిమ ఎంఎల్ ఏ దాస్యం వినయ్ భాస్కర్,ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంఎల్సి బండా ప్రకాష్, ఎం పి దయాకెర్ హనుమకొండ జిల్లా కలెక్టర్ శిక్త పట్నాయక్, మునిసిపల్ కమిషనర్ రీజ్వాన్ బాషా తదితరులు పాల్గొంటారు అని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

సమస్యాత్మక , క్లిష్టమైన పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి సారించాలి అని సీపీ రంగనాధ్ పేర్కొన్నారు.

బుధవారం నాడు సీపీ రంగనాధ్, హనుమకొండ కలెక్టర్ సిక్త పట్నాయక్, వరంగల్ కలెక్టర్ ప్రవీణ్యా, అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ లతో కలసి 

ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిపేందుకు కీలకమైన భద్రతా మాడ్యూళ్లపై, ఎన్నికల నిబంధనల నియమావళి, పోలీస్ శాఖ తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి సీపీ మాట్లాడుతూ హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాలలో రాబోవు  ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన మార్గదర్శకమైన అనుసరిస్తూ పని చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ దాఖల నుండి ప్రచారం పోలింగ్ రోజు నిర్వహణ తదితర అంశాలపై చేపట్టే ప్రణాళికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమస్యత్మక సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద ఎలా శాంతి భద్రతను పర్యవేక్షించాలి, ఎన్నికల నిర్వహణలో ప్రత్యేక చర్యలను వివరించారు . అన్ని పోలింగ్ బూతులపై అవగాహన కలిగి ఉండడంతో పాటు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో నగదు,మద్యం అక్రమ రవాణా కోసం అనుమానిత వాహనాల తనిఖీలు చేపట్టాలన్నారు. పోలింగ్ స్టేషన్ల నిర్వహణ, భద్రత సంబంధిత అంశాలపై పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంతవరకు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీ లేని పోరాటాన్ని నడిపిన కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని,  ఆయన బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా  నిలిచారని,  జయశంకర్  భూపాలపల్లి జిల్లా ఎస్పి పుల్లా కరుణాకర్ అన్నారు. బుధవారం 

జిల్లా  పోలీసు కార్యాలయములో  కొండా లక్ష్మణ్ బాపూజీ  జయంతి వేడుకలను ఘనoగా నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి  కొండ లక్ష్మణ్ బాపూజీ  చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి కరుణాకర్  మాట్లాడుతూ కొండా లక్ష్మణ్  బాపూజీ బడుగు బలహీనర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించారని, తెలంగాణ తొలి తరం, మలి దశ, ఉద్యమంలో కీలకపాత్ర  పోషించారని అన్నారు. ఈ కార్యక్రమంలో     ఏ.ఆర్ అదనపు ఎస్పి  వి శ్రీనివాస్,  భూపాలపల్లి డిఎస్పీ ఏ. రాములు, జిల్లా పోలీసు కార్యాలయ ఏఓ వసిం ఫర్హానా, భూపాలపల్లి సీఐ రామ్ నర్సింహరెడ్డి, పోలిసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

కొండాలక్ష్మన్ బాపూజీ 108 జయంతి సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కొత్తవాడ జంక్షన్ వద్దనున్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి కలెక్టర్ ప్రావీణ్య, మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ బాషా,మాజీ జెడ్పిచేర్మెన్ సాంబారి సమ్మారావు తో కలిసి పూలమాల వేసి  ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ 

తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటం నాటి తరానికి ఎంత స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్  కొండా లక్ష్మణ్ బాపూజీ  జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం మనకందరికీ గర్వకారణమని ఎమ్మెల్యే అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఏనలేని పాత్ర పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ గుర్తుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జలవిహార్లో వారి క్యాంస విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని

తెలంగాణ ఉద్యమంలో బాపూజీ కార్యాలయాన్ని ఉద్యమం కోసం అందించారని అలాంటి గొప్ప వ్యక్తిని గౌరవించుకోవడం మన బాధ్యత అన్నారు

బాపూజీ ఒక ప్రాంతానికి కులానికి సంబంధించిన వ్యక్తి కాదని యావత్తు తెలంగాణణకు ఆదర్శప్రాయుడని ఎమ్మెల్యే అన్నారు.

తెలంగాణ కోసం రాజకీయాలను పక్కనపెట్టి తనకున్న పదవులు తృణపాయంగా వదిలేసి తెలంగాణ కోసం పోరాడిన మహనీయుడన్నారు.

రాబోయే కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిలోపు కనీ విని ఎరుగని రీతిలో నియోజకవర్గంలోని మెయిన్ సెంటర్లో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం ఏర్పాటు చేస్తామని వారి త్యాగాలను వారు చేసిన సేవలను చిరస్మరణీయంగా నిలిపే విధంగా తాము కృషి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు చేసిన చోట ఒక పార్కు మరియు కమ్యూనిటీ హాల్ సైతం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ యేలుగం లీలావతి సత్యనారాయణ,ఆర్టిఏ మెంబర్ గోరంట్ల మనోహర్,బిఆర్ఎస్ నాయకులు చిప్ప వెంకటేశ్వర్లు,బొల్లు సతీష్,మదనయ్య

పాక సుధాకర్,బెతి అశోక్ ,పద్మశాలి పెద్దలు, ముఖ్య నాయకులు,డివిజన్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

అంగరంగ వైభవంగా నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరే సమయం ఆసన్నమైన సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ దంపతులు ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా దేశాయిపేటలోని చిన్న వడ్డేపల్లి చెరువులో మొదటి గణనాధుని నిమజ్జనం చేసి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ

నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుడుని గత పది సంవత్సరాలుగా ఆనవాయితీగా తాను ఈ చిన్న వడ్డేపల్లి చెరువులో మొదట నిమజ్జనం చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

నవరాత్రులు భక్తిశ్రద్ధలతో ప్రజలు పూజలు చేసి గణనాథుడు నిమజ్జనం చేసి ఆ గణపయ్య ఆశీస్సులు పొందుతారని 

ఈ నిమజ్జనం ఏర్పాట్లలో భాగంగా నేడు ఏలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్,ట్రాఫిక్, విద్యుత్తు,జిడబ్ల్యూఎంసి మరియు అన్ని శాఖల అధికారులను సమన్వయ పరుస్తూ నిమజ్జన ఏర్పాట్లు చూడడం జరుగుతుందన్నారు

నియోజకవర్గంలో సుమారు 800 పైచిలుకు గణనాథులు కొలువు తీరాయని నగరంలోని యువత,పిల్లలు పెద్ద ఎత్తున ఈ ఏడాది గణనాథులను ఏర్పాటు చేయడం జరిగిందని వారందరూ నేడు భక్తిశ్రద్ధలతో ఆ గణపయ్యను నిమజ్జనం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

తాను ప్రతి సంవత్సరంలాగే నియోజకవర్గంలో కొలువుదీరిన గణనాథుని మండపాలకు తన వంతు భక్తిగా చందాను అందించానని ఎమ్మెల్యే తెలిపారు

ఆ గణపయ్య ఆశీస్సులతో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ నాయకత్వన వరంగల్ తూర్పు నియోజకవర్గం మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోతామని రాష్ట్ర మరియు నియోజకవర్గ ప్రజలపై ఆ గణనాధుని ఆశీర్వాదాలు మెండుగా ఉండి ప్రజలందరూ సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ గణనాధునిని ఎమ్మెల్యే కోరుకున్నట్టు తెలిపారు

ఈ సందర్భంగా కార్పొరేటర్ సురేష్ జోషి డివిజన్ అధ్యక్షుడు సోళ రాజు, స్థానిక పెద్దలు అధికారులు ముఖ్య నాయకులు కార్యకర్తలు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

 శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ 24 న్యూస్ తెలుగు ఛానల్ లోగో ను  ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆవిష్కరించారు.  ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 24న్యూస్ తెలుగు ఛానల్ అంచెలు అంచెలుగా ఎదుగుతూ ప్రజలు మన్నలును పొందుతు ఛానల్ ప్రజల పక్షాన పని చేయాలని ఆశించారు. 

ఈ కార్యక్రమంలో సీఈఓ కలకొట్ల కళ్యాణ్, అరేల్లి కృష్ణ ప్రసాద్, కంజర్ల భాస్కర్. తదితరులు రిపోర్టర్లు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

ముఖ్య సంచాలక్ అనపర్తి సాయితేజ 

వినాయకుడి నవరాత్రి ఉత్సవాల భాగంగా దంతాలపల్లి గ్రామంలో మరియు శ్రీనివాస్ కాలనీ బొప్పారం ప్రతాపగిరి గ్రామాలలో ప్రతి  కాలనీలో ఉన్నటువంటి వినాయకుడి దగ్గరికి వెళ్లి దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యూత్ సీనియర్ నాయకులు బీరెల్లి రజిని కుమార్ మరియు టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు బండమ్ రాజు రెడ్డి గారు మరియు నేతకాని యూత్ నాయకులు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామ పెద్దలు వినాయకుడి నవరాత్రి ఉత్సవాల కమిటీ సభ్యులు భక్తులు యువకులు, పాల్గొనడం జరిగింది

1. దంతాలపల్లి గ్రామం బీసీ కాలనీ వినాయకుని నవరాత్రి ఉత్సవాల భాగంగా 3016/-ఇవ్వడం జరిగింది 

2.దంతాలపల్లి ఓడేటి మరియు ఎస్టీ కాలనీ గణపతి నవరాత్రి ఉత్సవాలు భాగంగా 2016/- లు చందా ఇవ్వడం జరిగింది 

3.శ్రీనివాస్ కాలనీ గణపతి నవరాత్రి చాలా భాగంగా 2016/- చందా ఇవ్వడం జరిగింది 

4.బొప్పారం ఎస్సీ కాలనీ గణపతి నవరాత్రుల భాగంగా 2016/- చందా ఇవ్వడం జరిగింది 


5.బొప్పారం బీసీ కాలనీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా  1016/-చందా ఇవ్వడం జరిగింది 

6.బొప్పారం గ్రామంలో నేతకాని కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భాగంగా 2016/-లో చందా ఇవ్వడం జరిగింది.

7.ప్రతాపగిరి గ్రామపంచాయతీ పరిధిలో గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా 1116/-చందా ఇవ్వడం జరిగింది....



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ వచ్చే నెల ఆరవ తేదీన హనుమకొండ లో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అధికారులను ఆదేశించారు.

 మంగళవారం  కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు మంత్రి పర్యటన విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ కేటీఆర్‌ హనుమకొండ వరంగల్ పట్టణంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు. ఆయన శాఖల అధికారులు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు పరిశీలించి ప్రారంభోత్సవం శంకుస్థాపనలకు సిద్ధం చేయాలన్నారు.

ఇటీవల వరద నష్టం కు ప్రభుత్వం కేటాయించిన నిధులతో చేపట్టిన పనులు, స్మార్ట్ సిటీ పనులు, కూడ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు, జిడబ్ల్యు ఎంసి  పరిధిలో చేపట్టిన పనులు ప్రరోంభంత్సవాలు, సంక్షేమ కార్యక్రమాల లో లబ్ధిదారులతో సమావేశం ఉంటుంది అని అన్నారు. బందోబస్త్ పక్కాగా చేపట్టాలని అన్నారు.పలు ప్రారంభోత్సవాలు చేపట్టనున్నట్లు తెలిపారు. హెలిపాడ్, సభా స్తలి పై ప్రత్యేక ద్రుష్టి సరించాలని అన్నారు.

ఈ సమావేశం కుడ చైర్మన్ సౌందర్ రాజన్,లో సీపీ రంగనాధ్, కలెక్టర్ సిక్త పట్నాయక్, జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

 జిల్లాలో  గణేష్ నిమజ్జన శోభాయాత్ర  ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ పుల్లా కరుణాకర్  అన్నారు. సోమవారం వినాయక నిమజ్జన ఏర్పాట్లు, నిర్వాహకులు పాటించాల్సిన నియమనిబంధనల గురించి పత్రికా ప్రకటనలో తెలిపారు. వినాయక నిమజ్జనం చేసే చెరువులు, కుంటలు, నదుల వద్ద ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పి  పేర్కొన్నారు. గణేష్  ఊరేగింపు సమయంలో గ్రామాల్లో విద్యుత్ తీగలు తగిలి  ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అప్రమత్తతగా వ్యవహరించాలని అన్నారు. మంచి కండిషన్లో ఉన్న వాహనాలను మాత్రమే గణేష్ శోభయాత్ర వినియోగించాలని సూచించారు.  ప్రధానంగా వినాయక ప్రతిమలను ఊరేగించే వాహన డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. విగ్రహాలు తీసుకొని నీటి లోతు వరకు  ఎవరూ వెళ్లకూడదని, అందులోనూ ఈతరాని  వారు ఎట్టి పరిస్థితుల్లో నీళ్లలో దిగకూడదని ఎస్పి కరుణాకర్  సూచించారు. నిమజ్జనం రోజున వాహనాలపై డీజేతో కూడిన మ్యూజిక్ సిస్టమును ఉపయోగించడం నిషేధించడం జరిగిందని వెల్లడించారు. ఇతర మతాలకు గాని ఇతర వర్గాలకు చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని ఏలాంటి రెచ్చగొట్టే పనులు చేయవద్దని పేర్కొన్నారు.  చిన్నారులను నిమజ్జనం  ప్రాంతాలకు తీసుకురావద్దు మండపాల నిర్వాహకులు,  తల్లిదండ్రులు చిన్నారులను నిమజ్జన ప్రాంతాలకు తీసుకురావద్దని ఎస్పి  సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు.  జిల్లాలో ప్రశాంతంగా శోభయాత్ర నిర్వహణ కోసం  ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉత్సవ కమిటీ సభ్యులు, శాంతి కమిటీ సభ్యులలతో పోలిసు అధికారులు  సమావేశం నిర్వహించారని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని,  ఏదైనా సంఘటన జరిగితే నిర్వాహకులు వెంటనే పోలీసులు తెలియజేయాలని,  ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఏలాంటి వదంతులు, పుకార్లను నమ్మరాదని, ఏమైనా సమస్యలు ఉంటే దగ్గర్లోని పోలీస్ స్టేషన్ గాని, డయల్-100 కు గాని సమాచారం అందించాలని ఎస్పి కరుణాకర్   కోరారు. ప్రశాంత వినాయక గణేష్ నిమజ్జనమే జిల్లా పోలిసు శాఖ అభిమతమని, శాంతియుత, ప్రశాంత వినాయక నిమజ్జోత్సవాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పి  కోరారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న

                             


  పెద్దపల్లి:గోదావరిఖని:9:21:23:రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గత కొన్ని

సం॥లుగా వైద్య వృత్తిలో గవర్నమెంట్ హాస్పిటల్ లో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ రాజశేఖర్ రెడ్డి,కరోనా సమయంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా డాక్టర్ వృత్తిలో సేవలందించిన

డా॥ రాజశేఖర్ రెడ్డికి హైదరాబాదులో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా,ఉత్తమ వైద్యుడిగా హెల్త్ కేర్ పురస్కారం అందుకున్న రాజశేఖర్ రెడ్డిని,రామగుండం ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం యూనియన్ సభ్యులు పుష్పగుచ్చం శాలువాతో ఘనంగా సన్మానించారు,ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గట్ల కుమార్,ప్రధాన కార్యదర్శి లంక సదయ్య,కోశాధికారి మేకల తిరుపతి,ఉపాధ్యక్షులు గుమ్మడి శ్రీనివాస్,జాయింట్ సెక్రెటరీ ప్రదీప్,తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

రైతుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిన లక్ష రూపాయల లోపు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు పథకం ఫలాలు అందేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.

బుధవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో రుణమాఫీ, జి. ఓ. 58, 59, గృహలక్ష్మి, ఆసరా పెన్షన్, నివాస స్థలాల పట్టాల పంపిణీ, గ్రామపంచాయతీ కార్యాలయ భవన నిర్మాణం, తెలంగాణకు హరితహారం తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రుణమాఫీ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.

కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ , హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో లక్ష రూపాయల లోపు రుణమాఫీ పథకం సంబంధించి నిధులు బ్యాంకులలో జమ చేయడం జరిగిందని, అర్హత గల రైతుల ఖాతాల వివరాలు అందించని వారి వివరాలు సేకరించి పోర్టల్ బ్యాంకుల వారీగా నమోదు చేసేందుకు చర్యలు చేపట్టడంతో పాటు వ్యవసాయ సాగుకు అవసరమైన ఎరువుల నిల్వలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ భూములలో నివాసం ఏర్పాటు చేసుకున్న అర్హులైన వారి భూముల క్రమబద్ధీకరణ కొరకు ప్రభుత్వం జి. ఓ. నం. 58, 59 ద్వారా అవకాశం కల్పించి లబ్ధిదారులకు పట్టాలు అందించడం జరిగిందని, go 59 క్రింద దరఖాస్తు చేసుకున్న వారికి నోటీసులు అందించడం జరిగిందని తెలిపారు , జి ఓ నిబంధనల మేరకు ప్రభుత్వ రుసుము చెల్లించిన వారి భూముల క్రమబద్ధీకరణకు చర్యలు తెలిపారు. ఇంటి నివాస స్థలం కలిగిన అర్హులైన వారికి ప్రభుత్వం గృహలక్ష్మి పథకం కింద అందిస్తున్న ఆర్థిక సహాయం కొరకు దరఖాస్తు చేసుకున్న వారి సంబంధిత వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ఆసరా పెన్షన్ పొందుతూ మరణించిన పెన్షన్ దారు స్థానంలో కుటుంబ సభ్యులలో అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములలో నివాస స్థలాలకు పట్టాలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యాలను పూర్తి చేసి మరింత సాగు విస్తీర్ణం పెంచే విధంగా రైతులను ప్రోత్సహిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ హరితహారం పథకం కింద జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు చేపట్టడంతో పాటు సంపద వనాల క్రింద మొక్కలు నాటేందుకు ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్సు లో  అదనపు కలెక్టర్ మహేందర్ జీ ట్రైనీ కలెక్టర్ శ్రద్ద శుక్ల డిఆర్డిఏ పిడి  శ్రీనివాస్ కుమార్ వ్యవసాయ, ఉద్యానవన, గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులు, వివిధ బ్యాంకుల అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ముఖ్య సంచాలక్ అనపర్తి సాయి తేజ

సెప్టెంబర్ 17 విమోచన దినం సందర్భంగా  తిమ్మాజీపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ  మండలాధ్యక్షుడు ముద్దం  యశ్వంత్   ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మరియు మన ప్రధానమంత్రి మోడీ గారి జన్మదిన వేడుకలో భాగంగా కేక్ కట్ చేయడం జరిగింది అలాగే అంగన్వాడీ ఉద్యోగులకు మద్దతు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాల్ రెడ్డి  శ్రీనివాస్ రెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ ఫుల్ టైమర్ వినయ్ కుమార్ అసెంబ్లీ దళిత మోర్చా  మాజీ కన్వీనర్ లింగని వెంకటయ్య ఓబీసీ మోర్చా మండల ప్రెసిడెంట్ శివ యాదవ్ బీజేవైఎం జిల్లా కార్యదర్శి పసునూరి ఆనంద్ చారి మండల ప్రధాన కార్యదర్శి శావుకుల శివకుమార్ కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి సుందరయ్య బీజేవైఎం కార్యవర్గ సభ్యులు బాలకృష్ణారెడ్డి సోషల్ మీడియా  అభిమన్యు రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో ప్రజలు జరుపుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ పుల్లా కరుణాకర్ శనివారం తెలిపారు. జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలకు పటిష్ఠమైన పోలీసు భద్రత ఉంటుందని ఎస్పి పేర్కొన్నారు. మండపాల నిర్వాహకులు నియమ నిబంధనలు పాటించాలని, మండపాల వద్ద డిజెలకు అనుమతి లేదని, ఉత్సవాలు భక్తి భావంతో జరుపుకోవాలని అన్నారు. సోదరభావం అనేది తెలంగాణ రక్తంలోనే వుందని ఎస్పీ కరుణాకర్ పేర్కొన్నారు. గణేష్ మండపాలు రోడ్డు మధ్యలో ఏర్పాటు చేయవద్దని, వాహనాలకు దారి వదలాలని ఎస్పీ కోరారు.

గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్బంగా గణేష్ మండపాల ఏర్పాటుకు, విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలని, 

 అన్లైన్ అనుమతి కోసం https://policeportal.tspolice.gov.in/index.htm కింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. 

పోలీసు శాఖ సూచించిన కొన్ని నియమాలు పాటించాలి

●మండపాలు ఏర్పాటు చేసే స్థలం పబ్లిక్ స్థలం అయితే సంబంధిత గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీ అనుమతి పత్రం తప్పనిసరిగా తీసుకోవాలి.

● ప్రవేట్ వ్యక్తుల స్థలం అయితే స్థలం యొక్క యజమాని అనుమతి పత్రం తీసుకోవాలి. 

● ఉత్సవాలు ముగిసే వరకు ఉత్సవ కమిటీ సభ్యులు 24 గంటలు మండపాల వద్ద అందుబాటులో ఉండాలి.

● భక్తులు వచ్చిపోయే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి.

● ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దు.

● విద్యుత్ శాఖ అనుమతి ఉండాలి.

● వివాదాస్పద స్థలాల్లో గణేష్ మండపాలు ఏర్పాటు చేయొద్దు.

● ఇతరులను రెచ్చగొట్టే విధంగా, వివాదాస్పదంగా మండపాల వద్ద ప్రసంగాలు చేయద్దు.

● మండపాల వద్ద భక్తి సంబంధిత పాటలు మాత్రమే ప్రసారం చేయాలి.

● నిర్ణీత సమయంలో మాత్రమే మైక్ లు పెట్టాలి 

● ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దు.

                                       ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మవద్దని, అత్యవసర సమయంలో స్థానిక పోలీసులకు గానీ, డయల్ 100 కు ఫోన్ చేయాలని ఎస్పి కరుణాకర్ కోరారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 కాటారం మండల్ ప్రతినిధి / జాగిరి నరేష్ గౌడ్

కాటారం మండలం బయ్యారం వద్ద ఈ నెల 10న నారాయణ సింగ్ హత్య కేసులో నిందితుడు పసుల ముండెను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 10న రాత్రి 11 గంటల సమయంలో నారాయణ సింగ్ ఇంటికి వెళ్లి ఇరువురు మద్యం తాగారు. నారాయణ సింగ్ నిద్రలోకి జారుకోగా.. మొండయ్య అక్కడే ఉన్న రేకు కత్తితో నారాయణ సింగ్ మెడ ఎడమ వైపు పొడవడంతో తీవ్ర రక్తస్రావమై మరణించాడని, మృతుడిపై ఉన్న ఆభరణాల కోసం మొండయ్య హత్య చేసినట్లు తెలిపారు.



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

కాజీపేట దర్గా ముగింపు ఉత్సవాలలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.ఈ  సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ఈ చారిత్రాత్మక నగరంలో ఈ చారిత్రాత్మక దర్గాలో మూడు రోజులపాటు ఘనంగా పూజలు నిర్వహించడం జరిగిందని,  ఉత్సవాలు ఘనంగా నిర్వహించారని అన్నారు. మొన్న సంగల్, నిన్న ఉర్సు, నేడు బద్వాల్ తోని దర్గా ఉత్సవాలు ముగిశాయని తెలిపారు. దర్గా పీఠాధిపతి అయిన  కుశ్రు పాషా గారి నేతృత్వంలో భక్తులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చారని, ప్రపంచంలోనే ఇది రెండవ దర్గా అని, మొదటిది ఇరాన్ లో ఉంటే రెండోది భారతదేశంలోని మన దగ్గర ఉందని తెలిపారు.  వస్తున్నటువంటి భక్తులను దృష్టిలో పెట్టుకొని గతి గత పది రోజుల్లో కిందటి నుంచి కార్పొరేషన్ లోని అన్ని విభాగాల నుంచి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశామని అన్నారు.  గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశంతో పాటు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో పీఠాధిపతి సమన్వయంతోని  వచ్చినటువంటి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు రాబోయే రోజులలో కూడా మరింత  అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తామని తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

దేశంలో ఏ రాష్ట్రంలోలేని విధంగా అద్బుతాలకు కేరాఫ్‌గా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ వైద్య క‌ళాశాల త‌ర‌గ‌తులను సీఎం కేసిఆర్ వర్చువల్ గా ప్రారంభించారు.ఈ సందర్బంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత ర్యాలీలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, జడ్పీ చైర్‌ పర్సన్‌లు జక్కు శ్రీ హర్షిణీ రాకేష్‌, గండ్ర జ్యోతి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసు దేవారెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో భూపాలపల్లిని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని కోరితే అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తోసిపుచ్చారన్నారు. కానీ ఈనాడు సీఎం కేసీఆర్‌ ఒక మంచి ఉద్దేశ్యంలో భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారని, దీంతో ఈ ప్రాంత ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయని అన్నారు. మంథని ప్రాంతానికి 52కిలో మీటర్ల దూరంలో ఉన్న భూపాలపల్లిని పట్టించుకునే వారు కాదని, ఈనాడు ఇక్కడ ఒక ప్లాట్‌ లేక ఏదో ఒక ఆశ్రయం ఉండేలా ఆలోచన చేస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపుతో ఈనాడు అనేక ప్రాంతాలకు అభివృధ్దిబాటలు పడుతున్నాయని ఆయన గుర్తు చేశారు. అయితే అనేక ఏండ్లు దేశాన్నిపరిపాలన చేసిన కాంగ్రెస్‌, బీజేపీలు ఏం చేసిండ్లో, ఏం చేస్తరో చెప్పని పరిస్థితులు ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. స్వాతంత్య్రం వచ్చిన 76ఏండ్లలో 55ఏండ్లు పాలన చేసిన కాంగ్రెస్‌ ఏమీ చేయలేదని, చెప్పేవాళ్లకు వినేవాళ్లు లోకువ అన్నట్లుగా అనేక మాటలు చెప్తున్నారని ఆయన విమర్శించారు.అంతేకాకుండా దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చామని చెప్పుకునే కాంగ్రెస్‌ ఈనాడు అదే స్వాతంత్య్రాన్నిఅపహస్యం చేస్తున్నారని ఆయన వాపోయారు. ఏమీ చేసిండ్లో, ఏం చేస్తరో చెప్పకుండానే మళ్లా ఓట్ల కోసం అధికారం కోసం ఆరాటపడుతున్నారని ఆయన అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆనాడు గొప్పగా ఆలోచన చేసి మనకు ఓటు హక్కు కల్పిస్తే ఆ ఓటును వినియోగించుకునే ముందు ఆలోచన చేయకపోవడం మూలంగానే అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాడు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వంద పడుకల ఆస్పత్రి, వంద సీట్ల మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ముందు చూపుకు పని చేసి చూపించే సత్తా కేవలం బీఆర్‌ఎస్‌పార్టీ సీఎం కేసీఆర్‌కే ఉందని ఆయన గర్వంగా చెప్పారు. పని చేయని పార్టీలకు ఓట్లు వేయవద్దని, ఓటు విలువ ప్రజలకు తెలియదనే అహంకారం ఆ పార్టీల నాయకుల్లో ఉందని, అలాంటి నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. భవిష్యత్‌ తరాల గురించి ఆలోచన చేసే వాళ్లు కేవలం బీఆర్‌ఎస్‌పార్టీలోనే ఉంటారని ఆయన అన్నారు. అనేక ఏండ్లు తండాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదని, కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటుచేశారని, దీంతో తండాల ప్రజల కష్టాలు తీరాయని ఆయన అన్నారు. అధికారం, పదవులు, ఓట్ల కోసం ఆనాడు నియోజకవర్గంలో రింగ్‌రోడ్డును మొదలు పెట్టి పూర్తి చేయకుండా వదిలివేశారని, తాను ఎమ్మెల్యేగా అయిన తర్వాతనే సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రింగ్‌ రోడ్డును పూర్తి చేసిన చరిత్ర తనదేనని అన్నారు. ప్రజల్లో ఆలోచన శక్తి లేకపోవడం మూలంగానే ఈనాడు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఓట్ల కోసం గ్రామాలకు వచ్చి మాయమాటలు చెప్పుతున్నారని, ప్రజలు చైతన్యవంతులు కావాలని, ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకుని మన కోసం పనిచేస్తూ మన ఆకలి తీర్చే నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. అభివృద్ది చేయాలనే తపన ఆరాటం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా నిలువాలని, బీఆర్‌ఎస్‌పార్టీకి పట్టం కట్టాలని ఆయన ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

జిల్లా కేంద్రంలో శుక్రవారం టెట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ తెలిపారు.

శుక్రవారం హంటర్ రోడ్ లో గల షైన్ స్కూల్, జేఎస్ ఎం హై స్కూల్ పరీక్ష కేంద్రాలను ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్,పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంత మంది అభ్యర్థులు హాజరయ్యారు, ఎంత మంది అబ్సేంట్ అయ్యారు, చీఫ్ సూపరింటెండెంట్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్ష నిర్వహణ , బందోబస్తు తదితర వాటిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుంగా పరీక్షలు సజవుగ జరిగాయని తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాల తయారీలో కృత్రిమ రంగులు మరియు రసాయనాల వినియోగం వల్ల జల వనరులు కాలుష్యానికి గురవుచున్నాయి. అందుచే కృత్రిమ రంగులు మరియు రసాయనాలతో చేసిన విగ్రహాలను మానివేసి మట్టితో చేసిన విగ్రహాలను పూజించి చెరువులను కలుషితం కాకుండా కాపాడుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్  తెలిపారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్  మాట్లాడుతూ ప్రజల్ని చైతన్యపరిచే విధంగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వారి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆర్ సునీత, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం, వరంగల్  మాట్లాడుతూ ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి వినాయకులను పూజించి పర్యావరణ పరిరక్షించాలని తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతి జిల్లాకు 2000 వేల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కావున మట్టి విగ్రహాలను పూజించి చెరువులను కలుషితం కాకుండా కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి జిల్లా అధికారి ఆర్. సునీత, డిఆర్ఓ, జిఎం -డిఐసి , డిస్ట్రిక్ట్ బిసి  వెల్ఫేర్ ఆఫీసర్, ఏఈఈ  ,ఏఎస్, టిఎస్ పిసిబి  పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

పరువు నష్టం దావా కేసులో భాగంగా శుక్రవారం  అదాలత్ లోని హన్మకొండ జిల్లా కోర్టుకు హాజరై   రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ 

వాంగ్మూలం ఇచ్చారు. 

ఈ సందర్భంగా చీఫ్ విప్  మాట్లాడుతూ

హనుమకొండ నయింనగర్ లోని పెద్ద నాలా పై చైతన్య డిగ్రీ కళాశాల యాజమాన్యం అక్రమ నిర్మాణం చేసినది. 

 2016 సెప్టెంబర్ లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా అక్రమంగా కట్టిన ఈ నిర్మాణాల వలన ప్రవహించే నీరు అంతా నయీమ్ నగర్ లో లోతట్టు ప్రాంతాలలోనీ ఇళ్లలో చేరాయి. కళాశాల నాలాల పైన అక్రమ నిర్మాణాలు కట్టడం వల్ల పక్కనే ఉన్నటువంటి ఇండ్లలోకి మురుగునీరు చేరి వారు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు  నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను తొలగించి నీరు నాలాల గుండా ప్రవహించే విధంగా చూడాలని అధికారులకు మరియు ప్రజా ప్రతినిధులకు ఆదేశాలు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా అధికారులు అందరితో కలిసి నాలాల పర్యవేక్షణకు వెళ్లడం జరిగింది. ఆ సమయంలో చైతన్య డిగ్రీ కాలేజ్ యజమాని పురుషోత్తం రెడ్డి  ఉద్దేశపూర్వకంగా నాపై తప్పుడు ఆరోపణలు చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై మరియు నాపై దుర్బషలాడారని అన్నారు.

 న్యాయస్థానంపై పూర్తి నమ్మకంతో ఈ తప్పుడు ఆరోపణలపై పురుషోత్తం రెడ్డి  పై ఆ రోజున పరువు నష్టం దావా వేయడం జరిగింది.

శుక్రవారం  హన్మకొండ జిల్లా కోర్టులో జడ్జ్ కి సాక్షాధారాలు అందించడం జరిగింది. ఈనెల 20వ తారీఖున మళ్లీ కోర్టుకి హాజరుకావాలని జడ్జ్  సూచించడం జరిగింది. అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారే ఇలా నాలాంటి ప్రజా ప్రజాప్రతినిధుల పై తప్పుడు ఆరోపణలు చేయడం చాలా బాధాకరమని అన్నారు. ప్రజల కోసం పోరాడేటువంటి నన్ను ఇలా అనడం భావ్యం కాదని అన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;
 రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని తెలంగాణ, ఛత్తీస్గడ్, మహారాష్ట్ర పోలీసు అధికారులు నిర్ణయించారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జెన్కో కాన్ఫరెన్స్ హాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  పుల్లా కరుణాకర్  ఆధ్వర్యంలో మహారాష్ట్ర, ఛత్తీస్గడ్, తెలంగాణ  పోలీసు ఉన్నతాధికారుల (గడ్చిరోలి, బీజాపూర్ తెలంగాణ వివిధ జిల్లాల పోలీసు అధికారులు) సమన్వయ సమావేశం, మరియు అంతర్ జిల్లా పోలీసు ఉన్నతాధికారుల మీటింగ్ నిర్వహించారు.  ఈ సందర్భంగా మావోయిస్టుల కదలికలు,  ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. ముఖ్యంగా మావోయిస్టుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి సంబంధిత సమాచారాన్ని  పరస్పరం చేరవేర్చుకోవాలని నిర్ణయించారు. ఫలితంగా మావోయిస్టులను కట్టడి చేయడం సులభతరమవుతుందని ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో  నిర్వహించవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్బంగా డిఐజి, రామగుండం సిపి  రెమో రాజేశ్వరి  మూడు రాష్ర్టాల పోలీసు అధికారులను ఉద్దేశించి  మాట్లాడుతూ
త్వరలో తెలంగాణ  రాష్ట్రం లో జరుగబోయే  ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర ల సరిహద్దులో   చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయటం తో పాటు మద్యం, డబ్బు ఇతర ఇల్లీగల్ కు సంబంధించి అక్రమ రవాణా జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.
  రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టేలా చర్యలతో పాటు, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల రవాణా నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పనిచేయాలని, అలాగే మూడు రాష్ట్రల పోలీసులు పరస్పరం సమాచార వ్యవస్థను సమన్వయం చేసుకొంటూ సాఫీగా ఎన్నికలు సాగేలా చూడాలని అన్నారు.
 తెలంగాణ తో పాటు ఇతర రాష్ట్రాల తో సరిహద్దులో వున్న సమస్యాత్మకమైన గ్రామల పై ప్రత్యేక దృష్టి సారించాలని,  ఎన్ బి  డబ్ల్యు వారెంట్స్ ల విషయం లోమూడు రాష్ట్రాల పోలీసులు  ఒకరి ఒకరు సహకరించుకోవాలని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని డీఐజి, రామగుండం సిపి రాజేశ్వరి  కోరారు.   ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ  పుల్లా కరుణాకర్ , ములుగు ఎస్పీ  గౌస్ ఆలం, ఐపీఎస్, కొమురం భీం ఆసిఫాబాద్ ఎస్పీ కే సురేష్ కుమార్, ఐపీఎస్, వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి పి రవీందర్, మంచిర్యాల్ సుధీర్, సుధీర్ ఆర్ కేకెన్ ఐపీఎస్  , ములుగు ఓఎస్డి  అశోక్ కుమార్, ఐపీఎస్, బీజాపూర్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు,  గడ్చిరోలి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, ఏసీపి హుజరాబాద్  జీవన్ రెడ్డి, భూపాలపల్లి కాటారం డిఎస్పీలు ఏ రాములు, జి రామ్మోహన్ రెడ్డి , మరియు మూడు రాష్ట్రాలకు చెందిన డీఎస్పీలు,  సిఐలు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

జాతియ సమైక్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌  సిక్త పట్నాయక్ అన్నారు.

జాతీయ సమైక్య దినోత్సవ వేడుకల నిర్వహణపై గురువారం కలెక్టర్ కలెక్టరేట్ సమావేశ మందిరం లో  సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ  ఎప్పటిలాగే పోలీస్ పేరేడ్ గ్రౌండ్ లో నిర్వహించాలని నిర్ణయించామని ఇందుకు పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్ ను సిద్ధం  చేయాలి అని సూచించారు. సాంస్కృతి కార్యక్రమాలను పర్యవేక్షణ చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారి,  ఆదేశించారు. వేడుకలు హాజరయ్యే విద్యార్థులకు ప్రజలకు తాగునీరు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. విద్యుత్ అంతరాయము లేకుండా చూడాలి అని అన్నారు.   స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న వీ.ఐ.పీలు, అధికారులు, మీడియాకు సీటింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తం ఏర్పాట్లను పూర్తి స్థాయి పర్యవేక్షణలో కట్టుదిట్టంగా ఉండాలి అని అన్నారు . ముఖ్య అతిథి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ సందేశాన్ని రూపొందించాలని డీపీఆర్వోకు సూచించారు.వేడుకలకు విచ్చేసే ముఖ్య అతిథికి పోలీసు గౌరవ వందనంతో పాటు వేడుకలలో పోలీసు బందోబస్తు, తదితర ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు.విద్యుత్ అలంకరణ చేపట్టాలని అన్నారు.

ఈ సమావేశం లో అడిషనల్ కలెక్టర్  మహేందర్ జీ, ట్రయిని కలెక్టర్ శ్రద్ద శుక్ల, డీసీపీ బారి, సిపిఓ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ

 


హన్మకొండ ;

కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అన్ని మతాలవారు దర్గా ఉత్సవాల్లో పాల్గొనడం మతసామరస్యానికి  ప్రతిక అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ప్రపంచంలోనే అతి విశిష్టమైన దర్గా మనది అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని పండగలను భక్తి శ్రద్ధలతో   జరుపుకోవడం జరుగుతుందన్నారు. హనుమకొండ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశానికి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్యఅతిథిగా హాజరై  మాట్లాడుతూ దర్గా ఉత్సవాలకు  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి గిలాప్, చాదర్ సమర్పించి, ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్య మంత్రి కే సి ఆర్ నాయకత్వంలో ఒకవైపు సంక్షేమం, మరొకవైపు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూన్నాయని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాలకు,అన్ని పండుగలకు గౌరవిస్తూ, ప్రజలందరూ కూడా సుఖసంతోషాలతో జీవించేలా చూస్తోందని తెలిపారు. ప్రతి పండుగను కూడా  ప్రభుత్వమే అధికారికంగా జరుపుతోందని అన్నారు.

బతుకమ్మ పండుగ మొదలుకొని క్రిస్మస్ పండగ, రంజాన్ చాలా పండుగలను అధికారికంగా నిర్వహించడం తో పాటు కానుకలను సైతం అందజేస్తోందని వివరించారు.

ఆ శక్తులకు తెలంగాణాలో చోటు లేదు

ఇతర రాష్ట్రాలను చూస్తే మతాల మధ్య మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ,  అనేక కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. కానీ తెలంగాణాలో ఆ శక్తులకు తెలంగాణాలో చోటు లేదని తెలిపారు. అనేక సంక్షేమ పథకాలతోని ఈ ప్రభుత్వం అన్ని మతాలకు సంబంధించినటువంటి ఔన్నత్యాన్ని చాటుతుందని తెలిపారు.గిలాప్, చాదర్ సమర్పించి,  ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

కాజీపేటలోని  ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దర్గాకు క్యాంపు కార్యాలయం నుండి గిలాప్, చాదర్ ను సమర్పించారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 ముఖ్య సంచాలక్ అనపర్తి సాయితేజ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా గ్రామీణ అభివృధి సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్  అవార్డుల పంపిణీ కార్యక్రమంలో చిదినేపల్లి గ్రామానికి జిల్లా స్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు లభించింది.భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా 2022-2023 సంవత్సరానికి గాను స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ పురస్కారం  అందుకున్నారు.గ్రామ కార్యదర్శి దేవేందరుకు కూడా అవార్డు దక్కింది.2వేల జనాభా పైగా గల గ్రామాల విభాగంలో జిల్లా స్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు  దక్కించుకోవడం గర్వంగా ఉందని సర్పంచ్ శ్రీ అంతర్గo రాజమౌళి అన్నారు.ఈ కార్యక్రమంలో   ఎంపీఓ ఉపేంద్రయ్య,  ఎంపీడీఓ, శంకర్ గారు ఏపిఓ రాజయ్య  తదతరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;
జిల్లాలో శాంతియుత వాతావరణంలో వినాయక చవితి పండుగ జరుపుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలి అని కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు. బుధవారం కలెక్టర్ సీపీ రంగ నాథ్, వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య మున్సిపల్ కమిషనర్ రిజవాన్ బాషా తో కలిసి కార్యాలయంలో   వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్, పంచాయతి రాజ్, మున్సిపల్ ఇతర శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో   సమావేశం నిర్వహించారు. 
ఈ సందర్భంగా జిల్లా  కలెక్టర్ మాట్లాడుతూ గత అనుభవాల దృష్టిలో పెట్టుకుని గణేష్ ఉత్సవాలను, పండుగను ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకావాలని అన్నారు. పోలీస్ అధికారులు ఇతర శాఖల అధికారుల సమన్వయంతో ఉత్సవ కమిటీ సభ్యులు నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాలన్నారు. హనుమకొండ లో 12 చెరువు లలో నిమజ్జనం చేస్తున్నట్లు తెలిపారు. శ్రామికులకు సరిపడా టీ షర్ట్లు, మంచి నీరు, భోజనాలు విధిగా అందించాలని అన్నారు. నిమజ్జన చెరువు లలో సిల్ట్, నాచు, గుర్రపు డెక్క తీసి విగ్రహ నిమజ్జనం కు అనుకూలం గా చేయాలి అని అన్నారు. అన్ని గణేష్ మండపాలను తప్పని సరిగా రిజిస్ట్రేషన్  చేసుకోవాలని చెప్పారు.  వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ముందస్తుగా గణేష్ మండలి నిర్వాహకులు పూర్తి వివరాలు అందించాలని,  ఇది ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.  జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ, మండల స్థాయిలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై పోలీస్, రెవెన్యూ, పంచాయితీ ఇతర శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు మొదటి రోజు నుండి నిమజ్జనం శోభాయాత్ర వరకు ప్రశాంతవంతమైన వాతావరణంలో  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా  నిర్వహించాలని చెప్పారు.  మండపాలకు విద్యుత్ ఏర్పాటుకు తప్పని సరిగా విద్యుత్ శాఖ నుండి అనుమతి తీసుకోవాలని చెప్పారు.  ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలుపై విద్యుత్ అధికారులు మండపాల్లో ఆడిట్ నిర్వహించాలని చెప్పారు.  విద్యుత్ తీగలకు తగల కుండా ఎత్తు తక్కువ ఉండే విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. మండపాల్లో మైక్ ఏర్పాటుకు పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలని చెప్పారు.  నిమజ్జనానికి వచ్చే విగ్రహాలు  యంత్రాంగం సూచించిన ప్రాంతాల్లో మాత్రమే అత్యంత భద్రత మధ్య నిమజ్జన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు.  గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకోవాలని, గణేష్ విగ్రహం నిమజ్జనం చేసుకునేందుకు అవసరమైన రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని చెప్పారు. నిమజ్జనం రూట్ లో అవసరమైన రోడ్డు మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టి పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వినాయక నిమజ్జనానికి వినియోగించే వాహనాలను ముందస్తుగా రవాణా శాఖ అధికారి నుండి ధ్రువీకరణ తీసుకోవాలని చెప్పారు.  పర్యావరణ పరిరక్షణకు  మట్టి గణపతులను పూజించాలని,  రసాయనాలు, ప్లాసర్ ఆఫ్ పారిస్ తో చేసే విగ్రహాలు పర్యావణానికి హానికలిగిస్తాయన్నారు.  మట్టితో తయారు చేసిన విగ్రహాలను ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.   మట్టి విగ్రహలను ప్రజలు కు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు. వ్యర్థాలు వేసేందుకు డస్ట్ బిన్స్ ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా చెత్త సేకరణ సజావుగా చేయవచ్చని అన్నారు.నిమజ్జనం అనంతరం కూడ పరిశుభ్రత పై ద్రుష్టి సరించాలని అన్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా అవసరమైన క్రేన్లు ఏర్పాటు చేయాలని వినియోగించాలని,  గణేష్ నిమజ్జనం జరిగే ప్రదేశాలలో గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు.  కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సహకారంతో కలిసికట్టుగా  పండుగను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించాలని చెప్పారు.  
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ గణేష్ మండపం వద్ద అవసరమైన, గణేష్ నిమజ్జనం సజావుగా జరిగే విధంగా కట్టు దిట్టమైన భద్రత వ్యవస్థ ఏర్పాట్లు చేయాలి అని అన్నారు.సీసీ కెమెరా లను ఏర్పాటు చేయాలి అని అన్నారు. తగినంతమంది గజ ఈతగాళ్ల ను అందుబాటులో ఉంచాలి అని అన్నారు. అన్ని గణేష్ మండలి వద్ద పోలీసు పెట్రోలింగ్ పకడ్బందీగా అమలు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వినాయకుల నిమజ్జనానికి సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారులు ప్రణాళికాబద్ధంగా చేయాలని తెలిపారు. నిమజ్జనం పూర్తి అయ్యే వరకు పర్యవేక్షించాలని అన్నారు.  ఉత్సవ కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని, గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని  కోరారు.
ఈ సమావేశంలో  అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ఆర్డీవోలు,రమేష్ డీసీపీ బారి డిఆర్డిఏ  పిడి  శ్రీనివాస్ కుమార్ , మున్సిపల్ కమిషనర్స్, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, వివిధ ప్రాంతాల ఉత్సవ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం మండల్ ప్రతినిధి/ జాగిరి నరేష్ గౌడ్



దారుణ హాత్య...

జయశంకర్ భూపాలపల్లి జిల్లా.కాటారం మండలం. బయ్యారం గ్రామ పంచాయితీ పరిధిలో వ్యక్తి దారుణ హత్య..బయ్యారం గ్రామ పంచాయితీ పరిధిలోని HP పెట్రోల్ బంక్ ముందు నివసిస్తున్న కొత్తపల్లి గ్రామానికి చెందిన అజ్మీరా నారాయణ సింగ్ ను రాత్రి సమయం లో నిద్రిస్తున్న సింగ్ మీద గుర్తు తెలియని దుండగులు కత్తుల తో దాడి చేసి హత్య చేశారు..సమాచారం అందుకున్న కాటారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని హత్య కు గల వివరాలు తెలుసుకొని దర్యాఫ్తు చేస్తున్నాం అని పోలీసులు తెలిపారు.హత్య చేసిన నిందితులను అతి త్వరలో పట్టుకుంటాం అని పోలీసులు తెలిపారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 ముఖ్య సంచాలక్ అనపర్తి సాయి తేజ

 

బిజేపి రాష్ట్ర కార్యాలయం లో సూర్యాపేట జిల్లా బీజేపీ కోదాడ ఎమ్మెల్యే అభ్యర్ధి గా ధరకాస్తు ఇచ్చిన బూర శకుంతల గౌడ్ సదా మీ సేవలో,,,, బడుగు బలహీన వర్గాలకు అందు బాటలో ఉండి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజల అభిర్వద్ది కీ తోడుపడతనాని, కోదాడ పట్టణ,మండల కేంద్రము లో బీజేపి కేంద్ర నిధుల తో డెవలప్ మెంట్ చేసుకోవాలని సూచించారు, బీజేపి మహిళ మోర్చ జిల్లా అధ్యక్షురాలు బూర శకుంతల గౌడ్ మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ లు రాజకీయ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కలిసి బీజేపి పార్టి అభ్యర్ధి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. 


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 ముఖ్య సంచాలక్ అనపర్తి సాయి తేజ

AP: విజయవాడ వస్తున్న క్రమంలో జనసేన చీఫ్ పవన్ను పోలీసులు అడ్డుకొని కదలినివ్వకుండా చేయడం దారుణమని టీడీపీ నేత లోకేశ్ మండిపడ్డారు. రాజకీయ నేతలను నిర్బంధించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ కంటే ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. పోలీసుల తీరుతో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని లోకేశ్ ఫైర్ అయ్యారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 ముఖ్య సంచాలక్ అనపర్తి సాయి తేజ


పెద్దపల్లి బిజెపి ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న కందుల సదానందం ముదిరాజ్,ఈ సందర్భంగా కందుల సదానందం ముదిరాజ్ మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా పార్టీకి ఒక ఫుల్ టైమర్ లాగా కష్టపడుతున్న సందర్భాన్ని గుర్తుచేస్తూ ఏబీవీపీ నుండి కష్టపడుతూ బిజెపి నుండి పెద్దపల్లి మండలానికి జడ్పిటిసి గా పోటీ చేసి ఎన్నో గ్రామాల నుండి యువకులను పెద్ద ఎత్తున బిజెపిలో జాయినింగ్ చేపించనని, ZPTC  తరువాత వచ్చిన కౌన్సిలర్ ఎలక్షన్స్ లలో ప్రతి ఒక్కరికి పనిచేశానని, అప్పటినుండి గత మూడు సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామ గ్రామాన తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నానని, రాష్ట్ర ప్రభుత్వ వైకల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగడుతున్న సందర్భంలో నాపై కేసు కూడా పెట్టారని ఇప్పటికీ కోర్టుల చుట్టూ పేషీలకి తిరుగుతున్న సందర్భాన్ని తన గుర్తు చేస్తూ పెద్దపెల్లి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశానని కందుల సదానందం ముదిరాజ్  తెలియజేశారు, పెద్దపల్లి నియోజకవర్గ పరిస్థితి గురించి ఇక్కడున్న వనరులను దుర్వినియోగం చేస్తున్న పరిస్థితి అక్రమంగా మట్టిని ఇసుకను అమ్ముకుంటున్న పరిస్థితి ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి పెద్దపెల్లి నియోజకవర్గంలో  ఉన్న అనేక సమస్యల గురించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని కలిసి నియోజవర్గ పరిస్థితి గురించి వివరించానని కందుల సదానందం ముదిరాజ్ తెలియజేశారు.. 

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 ముఖ్య సంచాలక్ అనపర్తి సాయితేజ

పీ.ఎచ్.డీ సీట్లను అమ్ముకున్న వీసీ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్  అవినీతికి పాల్పడుతున్న వీసీ పై విచారణ కమిటీ వేసి వెంటనే తొలగించాలి. కాకతీయ యూనివర్సిటీలో పీ.ఎచ్.డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని ధర్నా చేస్తున్న విద్యార్ధి నాయకులను  టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెష్టు చేసి కొట్టడాన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర గవర్నర్ ను విద్యార్ధి నాయకులు కలిసి వీసీ పై, పోలీస్ కమీషనర్ పై ఫిర్యాదు చేసినట్లు విద్యార్ధి నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు.


ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రెటరీ మాచర్ల రాంబాబు,  మాట్లాడుతూ, కస్టడీ లో వున్న విద్యార్థులపై పోలీసులు కొట్టడం దారుణం అని, ఎం.జీ.ఎం నుండి కోర్టు కు తీసుకరావడానికి ఐదు గంటల సమయం పోలీసులు తీసుకున్నారని, డాక్టర్లను బెదిరించి పోలీసులకు అనుగుణంగా రిపోర్ట్ రాయించే ప్రయత్నం చేసారని ఫిర్యాదులో పేర్కొన్నారు. యూనివర్సిటీలో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించినందుకే వీసీ అక్రమంగా కేసులు పెట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కోర్టు జడ్జిమెంట్ లను అమలు చేయకుండా ధిక్కరించినందుకు వీసీ మరియు రిజిస్ట్రార్ పై కేయూ పోలీస్ స్టేషన్ లో ఎఫ్.ఐ.ఆర్ అయిందని, ఒక కోర్టు ధిక్కరణ కేసు వున్నవీసీ, సీపీ తో కలిసి ఆ ఎఫ్.ఐ.ఆర్ ను తీసేసి ప్రయత్నం చేయిస్తున్నాడని, ఒక ఎఫ్.ఐ.ఆర్ కేసు వున్న వ్యక్తితో సీపీ పక్కన కూర్చోపెట్టుకొని ప్రెస్స్ మీట్ పెట్టీ అబద్ధాలు చెప్పించడం దేనికి సంకేతం అని ఫిర్యాదులో తెలిపారు. ఈ సందర్భంగా కేయూ లో వీసీ ప్రో.తాటికొండ రమేష్ చేస్తున్న అవినీతిని గవర్నర్ కు వివరంగా విద్యార్థులు వివరించారు. 

పీ.ఎచ్.డీ కేటగిరీ-1 లో అక్రమాలు


పీ.ఎచ్.డీ కేటగిరీ -1 లో కేవలం ఫెలోషిప్, నెట్, సెట్ అర్హత వున్న ఫుల్ టైం రీసెర్చి స్కాలర్లకు రావాల్సిన అడ్మిషన్లకు ఇంటర్వూలు పెట్టీ ఆ తర్వాత డబ్బులు చేతులు మారాక యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా దీన్స్ లతో రూల్సు మార్పించి వాటిపై బలవంతంగా సంతకాలు చేయించి పార్ట్ టైం పీ. ఎచ్. డీ లు ఇచ్చారని, పీ.ఎచ్.డీ కేటగిరీ -1 అడ్మిషన్లు అక్రమం అని మళ్లీ అడ్మిషన్లు జరపవద్దని హై కోర్టు స్టే ఇచ్చినా కూడా కోర్టు దిక్కరణకు పాల్పడి అడ్మిషన్లు జరిపారని, రిజిస్ట్రార్ వెంకట్ రామ్ రెడ్డిను కోర్టు ధిక్కరణ నేరం కింద హైకోర్టు కోర్టుకు రమ్మందని పేర్కొన్నారు. పీ.ఎచ్.డీ కేటగిరీ -1 లో భర్తీ కాని సీట్లు కేటగిరీ – 2 కు మార్చి నింపాలని యూనివర్సిటీ విడుదల చేసిన పీ.ఎచ్.డీ నిబంధనల్లో వుందని, వారి నిబంధనలను వారే పాటించలేదని అన్నారు.


పీ.ఎచ్.డీ. కేటగిరీ -2 లో జరిగిన అవకతవకలు


పీ.ఎచ్.డీ కేటగిరీ -2 పరీక్షా పత్రం యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ లతో సంబంధం లేకుండా తయారు చేయించి ప్రతి విభాగంలో పదుల సంఖ్యలో ప్రశ్నలు తప్పుగా ముద్రించించారని, అటువంటి పరీక్షల ఫలితాలు విద్యార్థులకు అంటగట్టి మెరిట్ విద్యార్థులకు సీట్లు రాకుండా చేసారని, పీ.ఎచ్.డీ కేటగిరీ -2 ప్రశ్నా పత్రంలో దొర్లిన తప్పుల గురుంచి విద్యార్థి నాయకులు మాట్లాడితే కేసులు పెట్టించారని, వారికి సీట్లు రావద్దని ఇంటర్వ్యూ కమిటీలు వారికి అనుగుణంగా వేసుకొని పీ.ఎచ్.డీ నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్వ్యూలు జరిపారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు.


*భూకబ్జా దారుడు అశోక బాబు ను కాపాడుతున్న వీసీ*


కేయూ భూముల కబ్జాదారుల పై ల్యాండ్ కమిటీ రిపోర్టు సబ్మిట్ చేసినా కూడా భూకబ్జా దారులయిన పెండ్లి అశోక బాబు మరో పన్నెండు మందితో కుమ్ముక్కయి ల్యాండ్ కమిటీ రిపోర్టును పాలక మండలి ఆమోదానికి పెట్టకుండా రాజకీయ నాయకులతో పాలక మండలిని సభ్యులకు ఫోన్ చేయించి వారిని మచ్చిక చేసుకొని ల్యాండ్ కమిటీ రిపోర్టును మార్చే ప్రయత్నం చేస్తూ కబ్జాదారులను ప్రోత్సహిస్తున్నారని పేర్కొనారు.


అర్హత లేని అసమర్థ వీసీ


19-07-2010 లో ప్రొఫెసర్ అయి తేదీ 23.07.2019 (వీసీ గా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ) నాటికి 10 సంవత్సరాలు నిండకుండానే వీసీ కొరకు అప్లై చేసుకొని రాజకీయ నాయకుల అండతో అక్రమంగా వీసీ గా చార్జి తీసుకొని విద్యార్థుల జీవితాలతో చేలగాటడం ద్రోహం అని, హైకోర్టులో కేసు వున్నా, కేసు జడ్జిమెంట్ వచ్చేంత వరకు వీసీ గా తప్పుకునే నిజాయితీ వుండాలని, అదిలేకే జడ్జిమెంట్ వచ్చే లోపల ఈ అవినీతికి పాల్పడుతున్నారని అందులో పేర్కొన్నారు. యూనివర్సిటీ చట్టం సెక్షన్ 15.1 నిబంధనలకు తూట్లు పొడిచి ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ ను రిజిస్ట్రార్ గా నియమించి, ఆయన్నే కీలక ఇతర పదవుల్లో పెట్టీ అవినీతికి ఆయనతో సంతకాలు చేయిస్తూ పాలన కొనసాగిస్తున్నాడని అన్నారు. మహిళా పీజీ కళాశాలలో విద్యార్థుల దగ్గరి నుండి డబ్బులు తీసుకొని చాలన్లు కడతామని లక్షల కుంభకోణం చేసిన అన్వేషిని అప్పటి కేయూ రిజిస్ట్రార్ త్రీ మెన్ కమిటీ వేసి ఉద్యోగం నుండి తొలగిస్తే మళ్లీ ఆ అద్యోగిని పరీక్షల విభాగంలో నియమించి అవినీతి కు పాల్పడ్డారని అన్నారు.


*రూ నెలకు 8 లక్షలు వృధా*


16 మంది రిరైర్డ్ ప్రొఫెసర్లను యూజీసీ నిబంధనలకు, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా అనుబంద అధ్యాపకులుగా నియమించి కోటి రూపాయల అవినీతికి పాల్పడింది నిజం కాదా అని ప్రశ్నిచారు. నేర చరిత్ర వున్న వాళ్ళను, వేరే యూనివర్సిటీలో రిజిస్ట్రార్ గా వున్న వాళ్ళను నియమించి నెలకు రూ.ఎనిమిది లక్షలు ప్రజా ధనం దుర్వినియోగపరుస్తున్నారని తెలిపారు. కొత్తగూడెం ఇంజనీరింగ్ కళాశాల నుండి సీనియర్ ప్రాతిపాదికన కాకుండా ఒక జూనియర్ టీచర్ అయిన ప్రో.సదానందం ను అక్కడి నుండి కేయూ కు బదిలీ చేసుకొని ఆయనను అవినీతిలో భాగస్వామ్యం చేస్తున్నారని, పీ.ఎచ్.డీ ఇంటర్వ్యూ కమిటీల్లో ఆయన్ను పెట్టీ విధ్యార్థి నాయకులకు సీట్లు రాకుండా మార్కులు వేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. యూనివర్సిటీ చట్టానికి విరుద్ధంగా వీసీ కి ఇష్టం వచ్చిన వాళ్ళని డిపార్ట్ మెంట్ హెడ్ లుగా నియమించుకుని విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని, సోశాలజీ విభాగం, గణితం, ఫిజిక్స్, బాటనీ లలో సీనియారిటీ ప్రకారం రావాల్సిన హెడ్ షిప్ ను కాలదన్ని ఇంటర్వ్యూలో వీసీ కు అనుకూలంగా వున్న వాళ్ళను పెట్టుకొని పీ.ఎచ్.డీ సీట్లు విద్యార్థి నాయకులకు రాకుండా చేస్తున్నారని అన్నారు. ఒక గణితం విభాగంలో నియామకం అయిన ప్రో.మల్లారెడ్డి ని యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఇంజనీరింగ్ కాలేజీ కి ప్రిన్సిపాల్ గా నియమించి ఆయనతో అవినీతికి ఆజ్యం పోస్తున్నారని అన్నారు. 


*ఫార్మసీ లో అవినీతి*


ఫార్మసీ లో డీన్ పదవీ కాలం అయిపోయినా కూడా మరొక ప్రొఫెసర్ కు డీన్ ఇవ్వకుండా ఆయన్నే ఇంటర్వ్యూ కమిటీల్లో పెట్టీ అక్రమాలకు పాల్పడడం, ఇన్స్పెక్షన్ పేరు మీద ఎటువంటి ఇన్స్పెక్షన్ చేయకుండానే కొన్ని ఫార్మసీ కాలేజీ లకు సీట్లు తగ్గించి, డబ్బులు చేతులు మారాక ఇన్స్పెక్షన్ చేసి సీట్లు ఇస్తున్నారని, అకస్మాత్తుగా ఫార్మసీ ప్రిన్సిపాల్ ను తీసివేసి పీ.ఎచ్.డీ అడ్మిషన్లు, ప్రైవేటు ఫార్మసీ కాలేజీల కోసం తమకు అనుగుణంగా వున్న వారిని ప్రిన్సిపాల్ గా నియమించుకొని వీసీ అవకతవకలు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. యూనివర్సిటీ ను అభివృద్ధి చేసి చెప్పుకోవాల్సింది పోయి అవినీతి చేసి తప్పుడు డాటా న్యాక్ కు సమర్పించి పేపర్లలో యూనివర్సిటీ పరువు తీసారని అన్నారు.


ఇటువంటి అవినీతిని ప్రశ్నిస్తున్న విద్యార్థి నాయకులను టార్గెట్ చేసి పోలీసులతో అక్రమ కేసులు బనాయించి పైశాచిక ఆనందం పొందుతూ ఉద్యమాలను నీరు గార్చెందుకు విద్యార్తులకు ఆకస్మిక సెలవులు ఇస్తూ విద్యా వ్యవస్థను భ్రాష్టు పట్టిస్తున్న వీసీ పై గవర్నర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు.

గవర్నర్ ను కలిసిన వారిలో ఏబీవీపీ కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జ్ నిమ్మల రాజేష్ , స్టేట్ జాయింట్ సెక్రెటరీ, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ జీవన్ లు వున్నారు



Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 ముఖ్య సంచాలక్ అనపర్తి సాయి తేజ

 


జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో కృష్ణాష్టమి వేడుకలు విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరుగగా పలువురు చిన్నారులు కృష్ణుడు గోపికల వేషధారణలతో సందడి చేశారు. స్థానిక రామాలయం నుండి కొబ్బరికాయ కొట్టి ఎస్సై రాజకుమార్ శోభాయాత్రను ప్రారంభించగా మహాదేవపూర్ పురవీధుల్లో డీజే పాటలతో భజనలు చేస్తూ తిరిగారు. ఈ వేడుకల్లో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బెంబిరి దేవరావు, జిల్లా సహా కార్యదర్శి అంకిరెడ్డి, భజరంగ్ దళ్ ప్రఖండ ప్రముఖ్, చీలం మధుకర్, బజరంగ్ దళ్ కార్యకర్తలు పోత మనోజ్, చెక్కల రాకేష్ ఠాకూర్, అరవింద్ సింగ్, శీలం పవన్ చిన్నారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ముఖ్య సంచాలక్ అనపర్తి సాయి తేజ

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ముదిరాజ్లకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్పై మండిపడ్డారు. దాదాపు 40 నియోజకవర్గాల్లో గెలుపోటములను ముదిరాజు శాసిస్తారని పేర్కొన్నారు. గజ్వేల్లో ముదిరాజ్ల ఓట్లతో గెలిచిన కేసీఆర్.. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని మండిపడ్డారు. కేసీఆర్ను గద్దె దించేందుకు ముదిరాజ్ బిడ్డలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 

రిపోర్టర్స్ డే సందర్భంగా సీనియర్ విలేకరి వేముల బోర్రాజు గారికి కాటారం మండల్ ఎంపీపీ పంతకాని సమ్మయ్య కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సీమల సందీప్ ఎంపిటిసి జాడి మహేశ్వరి కాంగ్రెస్ కార్యకర్త పసుల లక్ష్మణ్ శంకరంపల్లి సర్పంచ్ అశోక్ గంగారం తిరుపతిరెడ్డి కొత్తపెళ్లి సర్పంచ్ రఘురాం కుంభం రమేష్ రెడ్డి చీమల వెంకటస్వామి చీమల రాజు తోపాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రిపోర్టర్స్ డే సందర్భంగా సీనియర్ విలేకరి వేముల బోర్రాజు గారికి కాటారం మండల్ పరిషత్ అధ్యక్షులు పంతకాని సమ్మయ్య కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సీమల సందీప్,ఎంపిటిసి జాడి మహేశ్వరి , కొట్టే ప్రభాకర్,కాంగ్రెస్ కార్యకర్తలు పసుల లక్ష్మణ్ ,శంకరంపల్లి సర్పంచ్ అశోక్,గంగారం తిరుపతిరెడ్డి, కొత్తపెళ్లి సర్పంచ్ రఘురాం, కుంభం రమేష్ రెడ్డి, చీమల వెంకటస్వామి, కొట్టే శ్రీహరి,చీమల రాజు తోపాటు  రిపోర్టర్స్ డే సందర్భంగా కాటారం విలేకరులను సన్మానించారు.