ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

జాతియ సమైక్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌  సిక్త పట్నాయక్ అన్నారు.

జాతీయ సమైక్య దినోత్సవ వేడుకల నిర్వహణపై గురువారం కలెక్టర్ కలెక్టరేట్ సమావేశ మందిరం లో  సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ  ఎప్పటిలాగే పోలీస్ పేరేడ్ గ్రౌండ్ లో నిర్వహించాలని నిర్ణయించామని ఇందుకు పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్ ను సిద్ధం  చేయాలి అని సూచించారు. సాంస్కృతి కార్యక్రమాలను పర్యవేక్షణ చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారి,  ఆదేశించారు. వేడుకలు హాజరయ్యే విద్యార్థులకు ప్రజలకు తాగునీరు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. విద్యుత్ అంతరాయము లేకుండా చూడాలి అని అన్నారు.   స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న వీ.ఐ.పీలు, అధికారులు, మీడియాకు సీటింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తం ఏర్పాట్లను పూర్తి స్థాయి పర్యవేక్షణలో కట్టుదిట్టంగా ఉండాలి అని అన్నారు . ముఖ్య అతిథి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ సందేశాన్ని రూపొందించాలని డీపీఆర్వోకు సూచించారు.వేడుకలకు విచ్చేసే ముఖ్య అతిథికి పోలీసు గౌరవ వందనంతో పాటు వేడుకలలో పోలీసు బందోబస్తు, తదితర ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు.విద్యుత్ అలంకరణ చేపట్టాలని అన్నారు.

ఈ సమావేశం లో అడిషనల్ కలెక్టర్  మహేందర్ జీ, ట్రయిని కలెక్టర్ శ్రద్ద శుక్ల, డీసీపీ బారి, సిపిఓ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: