ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;
 రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని తెలంగాణ, ఛత్తీస్గడ్, మహారాష్ట్ర పోలీసు అధికారులు నిర్ణయించారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జెన్కో కాన్ఫరెన్స్ హాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  పుల్లా కరుణాకర్  ఆధ్వర్యంలో మహారాష్ట్ర, ఛత్తీస్గడ్, తెలంగాణ  పోలీసు ఉన్నతాధికారుల (గడ్చిరోలి, బీజాపూర్ తెలంగాణ వివిధ జిల్లాల పోలీసు అధికారులు) సమన్వయ సమావేశం, మరియు అంతర్ జిల్లా పోలీసు ఉన్నతాధికారుల మీటింగ్ నిర్వహించారు.  ఈ సందర్భంగా మావోయిస్టుల కదలికలు,  ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. ముఖ్యంగా మావోయిస్టుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి సంబంధిత సమాచారాన్ని  పరస్పరం చేరవేర్చుకోవాలని నిర్ణయించారు. ఫలితంగా మావోయిస్టులను కట్టడి చేయడం సులభతరమవుతుందని ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో  నిర్వహించవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్బంగా డిఐజి, రామగుండం సిపి  రెమో రాజేశ్వరి  మూడు రాష్ర్టాల పోలీసు అధికారులను ఉద్దేశించి  మాట్లాడుతూ
త్వరలో తెలంగాణ  రాష్ట్రం లో జరుగబోయే  ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర ల సరిహద్దులో   చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయటం తో పాటు మద్యం, డబ్బు ఇతర ఇల్లీగల్ కు సంబంధించి అక్రమ రవాణా జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.
  రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టేలా చర్యలతో పాటు, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల రవాణా నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పనిచేయాలని, అలాగే మూడు రాష్ట్రల పోలీసులు పరస్పరం సమాచార వ్యవస్థను సమన్వయం చేసుకొంటూ సాఫీగా ఎన్నికలు సాగేలా చూడాలని అన్నారు.
 తెలంగాణ తో పాటు ఇతర రాష్ట్రాల తో సరిహద్దులో వున్న సమస్యాత్మకమైన గ్రామల పై ప్రత్యేక దృష్టి సారించాలని,  ఎన్ బి  డబ్ల్యు వారెంట్స్ ల విషయం లోమూడు రాష్ట్రాల పోలీసులు  ఒకరి ఒకరు సహకరించుకోవాలని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని డీఐజి, రామగుండం సిపి రాజేశ్వరి  కోరారు.   ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ  పుల్లా కరుణాకర్ , ములుగు ఎస్పీ  గౌస్ ఆలం, ఐపీఎస్, కొమురం భీం ఆసిఫాబాద్ ఎస్పీ కే సురేష్ కుమార్, ఐపీఎస్, వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి పి రవీందర్, మంచిర్యాల్ సుధీర్, సుధీర్ ఆర్ కేకెన్ ఐపీఎస్  , ములుగు ఓఎస్డి  అశోక్ కుమార్, ఐపీఎస్, బీజాపూర్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు,  గడ్చిరోలి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, ఏసీపి హుజరాబాద్  జీవన్ రెడ్డి, భూపాలపల్లి కాటారం డిఎస్పీలు ఏ రాములు, జి రామ్మోహన్ రెడ్డి , మరియు మూడు రాష్ట్రాలకు చెందిన డీఎస్పీలు,  సిఐలు పాల్గొన్నారు.
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: