ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ

 


హన్మకొండ ;

కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అన్ని మతాలవారు దర్గా ఉత్సవాల్లో పాల్గొనడం మతసామరస్యానికి  ప్రతిక అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ప్రపంచంలోనే అతి విశిష్టమైన దర్గా మనది అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని పండగలను భక్తి శ్రద్ధలతో   జరుపుకోవడం జరుగుతుందన్నారు. హనుమకొండ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశానికి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్యఅతిథిగా హాజరై  మాట్లాడుతూ దర్గా ఉత్సవాలకు  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి గిలాప్, చాదర్ సమర్పించి, ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్య మంత్రి కే సి ఆర్ నాయకత్వంలో ఒకవైపు సంక్షేమం, మరొకవైపు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూన్నాయని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాలకు,అన్ని పండుగలకు గౌరవిస్తూ, ప్రజలందరూ కూడా సుఖసంతోషాలతో జీవించేలా చూస్తోందని తెలిపారు. ప్రతి పండుగను కూడా  ప్రభుత్వమే అధికారికంగా జరుపుతోందని అన్నారు.

బతుకమ్మ పండుగ మొదలుకొని క్రిస్మస్ పండగ, రంజాన్ చాలా పండుగలను అధికారికంగా నిర్వహించడం తో పాటు కానుకలను సైతం అందజేస్తోందని వివరించారు.

ఆ శక్తులకు తెలంగాణాలో చోటు లేదు

ఇతర రాష్ట్రాలను చూస్తే మతాల మధ్య మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ,  అనేక కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. కానీ తెలంగాణాలో ఆ శక్తులకు తెలంగాణాలో చోటు లేదని తెలిపారు. అనేక సంక్షేమ పథకాలతోని ఈ ప్రభుత్వం అన్ని మతాలకు సంబంధించినటువంటి ఔన్నత్యాన్ని చాటుతుందని తెలిపారు.గిలాప్, చాదర్ సమర్పించి,  ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

కాజీపేటలోని  ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దర్గాకు క్యాంపు కార్యాలయం నుండి గిలాప్, చాదర్ ను సమర్పించారు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: