ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;సమస్యాత్మక , క్లిష్టమైన పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి సారించాలి అని సీపీ రంగనాధ్ పేర్కొన్నారు.
బుధవారం నాడు సీపీ రంగనాధ్, హనుమకొండ కలెక్టర్ సిక్త పట్నాయక్, వరంగల్ కలెక్టర్ ప్రవీణ్యా, అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ లతో కలసి
ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిపేందుకు కీలకమైన భద్రతా మాడ్యూళ్లపై, ఎన్నికల నిబంధనల నియమావళి, పోలీస్ శాఖ తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి సీపీ మాట్లాడుతూ హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాలలో రాబోవు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన మార్గదర్శకమైన అనుసరిస్తూ పని చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ దాఖల నుండి ప్రచారం పోలింగ్ రోజు నిర్వహణ తదితర అంశాలపై చేపట్టే ప్రణాళికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమస్యత్మక సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద ఎలా శాంతి భద్రతను పర్యవేక్షించాలి, ఎన్నికల నిర్వహణలో ప్రత్యేక చర్యలను వివరించారు . అన్ని పోలింగ్ బూతులపై అవగాహన కలిగి ఉండడంతో పాటు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో నగదు,మద్యం అక్రమ రవాణా కోసం అనుమానిత వాహనాల తనిఖీలు చేపట్టాలన్నారు. పోలింగ్ స్టేషన్ల నిర్వహణ, భద్రత సంబంధిత అంశాలపై పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంతవరకు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు.
Post A Comment: