ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ప్రపంచ పర్యాటక దినోత్సవాల సందర్భంగా శుక్రవారం నాడు కాజీపేట బొడగుట్టలో ట్రెక్కింగ్, భద్రకాళి బండ్ వద్ద బోటింగ్ యూనిట్ ను టూరిజం మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటలకు కాజీపేట సమీపం లోని బొడ గుట్టలో నిపుణుల సమక్షంలో ట్రెక్కింగ్ ను మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ ప్రారంభిస్తారు.అనంతరం ఉదయం 11 గంటలకు భద్రకాళి బండ్ మీద బోటింగ్ యూనిట్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల్లో పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,టూరిజం కార్పొరేషన్ యండీ మనోహర్ రావు,చైర్మన్ గెల్లు శ్రీనివాస్ ,చీఫ్ విప్ పశ్చిమ ఎంఎల్ ఏ దాస్యం వినయ్ భాస్కర్,ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంఎల్సి బండా ప్రకాష్, ఎం పి దయాకెర్ హనుమకొండ జిల్లా కలెక్టర్ శిక్త పట్నాయక్, మునిసిపల్ కమిషనర్ రీజ్వాన్ బాషా తదితరులు పాల్గొంటారు అని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.
Post A Comment: