ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;హనుమకొండ, వరంగల్ జిల్లాలో రాష్ట్ర ఐటి, పురపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టి విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు.
శనివారం ఆయన మేయర్ గుండు సుధారాణి,కూడ కాన్ఫరెన్స్ హాల్లో కూడ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్, కమిషనర్ రిజవాన్ బాషా తో కలిసి అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల ఆరవ తేదీన మంత్రి కేటీ ఆర్ హైదరాబాద్ నుండి నేరుగా చాఫర్ లో కెఎంసీ కి చేరుకుంటారు అని అన్నారు. అనంతరం ఎంజీఎం సమీపంలో పోలీస్ భరోసా కేంద్ర ప్రారంభోత్సవం తో జిల్లా పర్యటన ప్రారంభం కానున్నదని ఆయన అన్నారు. స్మార్ట్ సిటీ పనులు, డిజిటల్ లైబ్రరీ,ఐటి టవర్స్,ఆరు జంక్షన్ ప్రారంభోత్సవాలు,వివిధ రకాల శంఖుస్థాపనల ప్రదేశాల్లో అన్ని సిద్ధం చేయాలని, అధికారులు తమకు కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆయన తెలిపారు. రూట్ మ్యాప్ పై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 58, 59, 76 మొదలగు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, లబ్ధిదారులకు సీటింగ్ అరేంజ్మెంట్ ప్రత్యేకంగా చేయాలని ఆయన సూచించారు.
మంత్రి పర్యటన నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.అధికారులు వారి వారి శాఖల పరిధిలో చేపట్టే పనులు సజావుగా జరిగే విధంగా పర్యవేక్షించాలని ఆయన తెలిపారు. మంత్రి పర్యటన నేపథ్యంలో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమం లో అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ, డీసీపీ బారి, ట్రైనీ కలెక్టర్ శ్రద్ద శుక్ల, డిఆర్డిఏ పిడి శ్రీనివాస్ కుమార్, డిఈఓ అబ్దుల్ హై, జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు..
Post A Comment: