ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

సరైన పోషణతో ఆరోగ్యవంతమైన సమాజం  నిర్మాణం జరుగుతుందని జిల్లా సంక్షేమ అధికారి 

కే మధురిమ  అన్నారు. పోషణ మాసం చివరి రోజు సందర్భంగా  శనివారం రోజున కీర్తి స్థూపం దగ్గర పోషణ మాసం ముగింపు  రోజున  నిర్వహించిన కార్యక్రమంలో  మాట్లాడుతూ సెప్టెంబర్  1 నుంచి  30 వరకు పోషణ మాసం కార్యక్రమాలు జిల్లాలోని మూడు ప్రాజెక్ట్ పరిధి, మండలాలలో, గ్రామాలలోని అంగన్వాడి  కేంద్రాలలో అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందని అన్నారు.

 6 నెలల లోపు పిల్లలకు పూర్తిగా తల్లిపాలే ఇవ్వాలని, పిల్లలు  (0-5) ఇందు నిమిత్తం సంబంధిత శాఖ అధికారులు తల్లి పాల ప్రాముఖ్యత పై అవగాహన కల్పించాలని, యుక్త వయస్సు బాలికలు , గర్భిణీలు మరియు బాలింతలు సమతుల ఆహారం తీసుకోవాలని గురించి తెలియచేయాలని  కోరినారు.  ప్రత్యేక పెరుగుదల పర్యవేక్షణ డ్రైవ్ అన్ని అంగన్ వాడి కేంద్రాలలో నిర్వహించి, పిల్లలందరి ఎత్తు , బరువు తూచి వారి పెరుగుదల వివరాలు పోషణ్ ట్రాక్ లో అప్ డేట్ చేసి, తక్కువ, అతి తక్కువ బరువున్న పిల్లల తల్లులకు కౌన్సిలింగ్ నిర్వహించి, వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. పోషణ మాసం సందర్భంగా సమీక్ష అనుకుకున్న ప్రణాళికా ప్రకారం సమావేశాలు, అవగాహన సదస్సుల ద్వారా జిల్లా అధికారులు మరియు మండల అధికారుల ద్వారా ప్రజల వద్దకు సమాచారం చేరేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. పిల్లలు , తల్లులు , బాలింతలు అందరూ సమతుల ఆహరం తీసుకోవాలని సూచించారు. పోషణ మాసంలో భాగంగా జిల్లా పరిధిలో అతి తక్కువ బరువున్న పిల్లలకు న్యూట్రిషినల్ రీహబిలిటేషన్ సెంటర్ కి రిఫర్ చేసి వారి పోషణ స్థాయి పెరిగే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. గవర్నమెంట్ హాస్పిటల్ లో అప్పుడే పుట్టిన పిల్లల తల్లులకు అవగాహన కార్యక్రమాల ద్వారా తల్లిపాల ప్రాముఖ్యత గురించి తెలియచేయడం జరిగిందని అన్నారు.

 జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ హరి ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై క్షేత్ర స్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి పోషణ అభియాన్ కార్యక్రమం ఉద్దేశాలను వివరించడం ఒక ఎత్తైతే పోషక ఆహారంపై  ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొదించుకోవాలని అన్నారు. 

18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ యువకుడు ఓటర్ నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు ఆయువు పట్టు లాంటిదని, 18 సంవత్సరాలు పైబడి ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్,   ఐసిడిఎస్ సూపర్వైజర్లు వంచ రాజ్యలక్ష్మి, డీ రాజ్యలక్ష్మి, వనజ, డీ కవిత, రమ, జ్యోతి, పోషణ అభియాన్ బ్లాక్ కో ఆర్డినేటర్ డి ప్రీతి,

అంగన్వాడి టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

కాగా ఈ సందర్భంగా ప్రభుత్వ కాలేజ్ ఎట్ హోం, రీచ్ బాలికల సంరక్షణ కేంద్రం బాలికలు పోషణ మాసం, ఓటు హక్కు వినియోగంపై ప్రదర్శించిన ఫ్లాష్ మాబ్ ఆకట్టుకుంది.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: