ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;మారుమూల గ్రామ ప్రజలకు సైతం కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు మరింత సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ పసునూరి దయాకర్ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టర్ భవన సమావేశ మందిరంలో కేంద్రం నుంచి జిల్లాకు మంజూరయ్యే పథకాలు, నిధులుపై జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ (దిశ) కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి కృషి యోజన పథకం, గ్రామీణ స్వచ్ఛ భారత్, ప్రధానమంత్రి సడక్ యోజన, జాతీయ ఆరోగ్యమిషన్‌తో పాటు వివిధ పథకాల అమలు తీరుపై చైర్మన్ సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే పథకాలు సక్రమంగా అమలు జరిగేలా దిశా కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. అలాగే అధికారులు పథకాలు సక్రమంగా అమలయ్యేలా కృషి చేయాలని, క్షేత్రస్థాయిలో పథకాల అమలు తీరులో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు. కేంద్రస్థాయి పథకాలు అనేకం ఉన్నాయని, జిల్లావ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని పథకాలు విజయవంతంగా నిర్వహించ బడుతున్నాయని, మిగతా పథకాలు కూడా అదేస్థాయిలో అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
పథకం ఉద్దేశం, అమలు విధానంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనులను పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని స్పష్టం చేసారు.
Post A Comment: