ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
జిల్లాలో శాంతియుత వాతావరణంలో వినాయక చవితి పండుగ జరుపుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలి అని కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు. బుధవారం కలెక్టర్ సీపీ రంగ నాథ్, వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య మున్సిపల్ కమిషనర్ రిజవాన్ బాషా తో కలిసి కార్యాలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్, పంచాయతి రాజ్, మున్సిపల్ ఇతర శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత అనుభవాల దృష్టిలో పెట్టుకుని గణేష్ ఉత్సవాలను, పండుగను ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకావాలని అన్నారు. పోలీస్ అధికారులు ఇతర శాఖల అధికారుల సమన్వయంతో ఉత్సవ కమిటీ సభ్యులు నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాలన్నారు. హనుమకొండ లో 12 చెరువు లలో నిమజ్జనం చేస్తున్నట్లు తెలిపారు. శ్రామికులకు సరిపడా టీ షర్ట్లు, మంచి నీరు, భోజనాలు విధిగా అందించాలని అన్నారు. నిమజ్జన చెరువు లలో సిల్ట్, నాచు, గుర్రపు డెక్క తీసి విగ్రహ నిమజ్జనం కు అనుకూలం గా చేయాలి అని అన్నారు. అన్ని గణేష్ మండపాలను తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ముందస్తుగా గణేష్ మండలి నిర్వాహకులు పూర్తి వివరాలు అందించాలని, ఇది ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ, మండల స్థాయిలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై పోలీస్, రెవెన్యూ, పంచాయితీ ఇతర శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు మొదటి రోజు నుండి నిమజ్జనం శోభాయాత్ర వరకు ప్రశాంతవంతమైన వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా నిర్వహించాలని చెప్పారు. మండపాలకు విద్యుత్ ఏర్పాటుకు తప్పని సరిగా విద్యుత్ శాఖ నుండి అనుమతి తీసుకోవాలని చెప్పారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలుపై విద్యుత్ అధికారులు మండపాల్లో ఆడిట్ నిర్వహించాలని చెప్పారు. విద్యుత్ తీగలకు తగల కుండా ఎత్తు తక్కువ ఉండే విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. మండపాల్లో మైక్ ఏర్పాటుకు పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలని చెప్పారు. నిమజ్జనానికి వచ్చే విగ్రహాలు యంత్రాంగం సూచించిన ప్రాంతాల్లో మాత్రమే అత్యంత భద్రత మధ్య నిమజ్జన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకోవాలని, గణేష్ విగ్రహం నిమజ్జనం చేసుకునేందుకు అవసరమైన రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని చెప్పారు. నిమజ్జనం రూట్ లో అవసరమైన రోడ్డు మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టి పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వినాయక నిమజ్జనానికి వినియోగించే వాహనాలను ముందస్తుగా రవాణా శాఖ అధికారి నుండి ధ్రువీకరణ తీసుకోవాలని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను పూజించాలని, రసాయనాలు, ప్లాసర్ ఆఫ్ పారిస్ తో చేసే విగ్రహాలు పర్యావణానికి హానికలిగిస్తాయన్నారు. మట్టితో తయారు చేసిన విగ్రహాలను ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. మట్టి విగ్రహలను ప్రజలు కు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు. వ్యర్థాలు వేసేందుకు డస్ట్ బిన్స్ ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా చెత్త సేకరణ సజావుగా చేయవచ్చని అన్నారు.నిమజ్జనం అనంతరం కూడ పరిశుభ్రత పై ద్రుష్టి సరించాలని అన్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా అవసరమైన క్రేన్లు ఏర్పాటు చేయాలని వినియోగించాలని, గణేష్ నిమజ్జనం జరిగే ప్రదేశాలలో గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సహకారంతో కలిసికట్టుగా పండుగను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించాలని చెప్పారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ గణేష్ మండపం వద్ద అవసరమైన, గణేష్ నిమజ్జనం సజావుగా జరిగే విధంగా కట్టు దిట్టమైన భద్రత వ్యవస్థ ఏర్పాట్లు చేయాలి అని అన్నారు.సీసీ కెమెరా లను ఏర్పాటు చేయాలి అని అన్నారు. తగినంతమంది గజ ఈతగాళ్ల ను అందుబాటులో ఉంచాలి అని అన్నారు. అన్ని గణేష్ మండలి వద్ద పోలీసు పెట్రోలింగ్ పకడ్బందీగా అమలు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వినాయకుల నిమజ్జనానికి సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారులు ప్రణాళికాబద్ధంగా చేయాలని తెలిపారు. నిమజ్జనం పూర్తి అయ్యే వరకు పర్యవేక్షించాలని అన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని, గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ఆర్డీవోలు,రమేష్ డీసీపీ బారి డిఆర్డిఏ పిడి శ్రీనివాస్ కుమార్ , మున్సిపల్ కమిషనర్స్, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, వివిధ ప్రాంతాల ఉత్సవ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: