ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;అంగరంగ వైభవంగా నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరే సమయం ఆసన్నమైన సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ దంపతులు ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా దేశాయిపేటలోని చిన్న వడ్డేపల్లి చెరువులో మొదటి గణనాధుని నిమజ్జనం చేసి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ
నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుడుని గత పది సంవత్సరాలుగా ఆనవాయితీగా తాను ఈ చిన్న వడ్డేపల్లి చెరువులో మొదట నిమజ్జనం చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
నవరాత్రులు భక్తిశ్రద్ధలతో ప్రజలు పూజలు చేసి గణనాథుడు నిమజ్జనం చేసి ఆ గణపయ్య ఆశీస్సులు పొందుతారని
ఈ నిమజ్జనం ఏర్పాట్లలో భాగంగా నేడు ఏలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్,ట్రాఫిక్, విద్యుత్తు,జిడబ్ల్యూఎంసి మరియు అన్ని శాఖల అధికారులను సమన్వయ పరుస్తూ నిమజ్జన ఏర్పాట్లు చూడడం జరుగుతుందన్నారు
నియోజకవర్గంలో సుమారు 800 పైచిలుకు గణనాథులు కొలువు తీరాయని నగరంలోని యువత,పిల్లలు పెద్ద ఎత్తున ఈ ఏడాది గణనాథులను ఏర్పాటు చేయడం జరిగిందని వారందరూ నేడు భక్తిశ్రద్ధలతో ఆ గణపయ్యను నిమజ్జనం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
తాను ప్రతి సంవత్సరంలాగే నియోజకవర్గంలో కొలువుదీరిన గణనాథుని మండపాలకు తన వంతు భక్తిగా చందాను అందించానని ఎమ్మెల్యే తెలిపారు
ఆ గణపయ్య ఆశీస్సులతో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ నాయకత్వన వరంగల్ తూర్పు నియోజకవర్గం మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోతామని రాష్ట్ర మరియు నియోజకవర్గ ప్రజలపై ఆ గణనాధుని ఆశీర్వాదాలు మెండుగా ఉండి ప్రజలందరూ సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ గణనాధునిని ఎమ్మెల్యే కోరుకున్నట్టు తెలిపారు
ఈ సందర్భంగా కార్పొరేటర్ సురేష్ జోషి డివిజన్ అధ్యక్షుడు సోళ రాజు, స్థానిక పెద్దలు అధికారులు ముఖ్య నాయకులు కార్యకర్తలు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
Post A Comment: