ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

కొండాలక్ష్మన్ బాపూజీ 108 జయంతి సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కొత్తవాడ జంక్షన్ వద్దనున్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి కలెక్టర్ ప్రావీణ్య, మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ బాషా,మాజీ జెడ్పిచేర్మెన్ సాంబారి సమ్మారావు తో కలిసి పూలమాల వేసి  ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ 

తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటం నాటి తరానికి ఎంత స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్  కొండా లక్ష్మణ్ బాపూజీ  జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం మనకందరికీ గర్వకారణమని ఎమ్మెల్యే అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఏనలేని పాత్ర పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ గుర్తుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జలవిహార్లో వారి క్యాంస విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని

తెలంగాణ ఉద్యమంలో బాపూజీ కార్యాలయాన్ని ఉద్యమం కోసం అందించారని అలాంటి గొప్ప వ్యక్తిని గౌరవించుకోవడం మన బాధ్యత అన్నారు

బాపూజీ ఒక ప్రాంతానికి కులానికి సంబంధించిన వ్యక్తి కాదని యావత్తు తెలంగాణణకు ఆదర్శప్రాయుడని ఎమ్మెల్యే అన్నారు.

తెలంగాణ కోసం రాజకీయాలను పక్కనపెట్టి తనకున్న పదవులు తృణపాయంగా వదిలేసి తెలంగాణ కోసం పోరాడిన మహనీయుడన్నారు.

రాబోయే కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిలోపు కనీ విని ఎరుగని రీతిలో నియోజకవర్గంలోని మెయిన్ సెంటర్లో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం ఏర్పాటు చేస్తామని వారి త్యాగాలను వారు చేసిన సేవలను చిరస్మరణీయంగా నిలిపే విధంగా తాము కృషి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు చేసిన చోట ఒక పార్కు మరియు కమ్యూనిటీ హాల్ సైతం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ యేలుగం లీలావతి సత్యనారాయణ,ఆర్టిఏ మెంబర్ గోరంట్ల మనోహర్,బిఆర్ఎస్ నాయకులు చిప్ప వెంకటేశ్వర్లు,బొల్లు సతీష్,మదనయ్య

పాక సుధాకర్,బెతి అశోక్ ,పద్మశాలి పెద్దలు, ముఖ్య నాయకులు,డివిజన్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: