కాటారం మండల్ ప్రతినిధి / జాగిరి నరేష్ గౌడ్
కాటారం మండలం బయ్యారం వద్ద ఈ నెల 10న నారాయణ సింగ్ హత్య కేసులో నిందితుడు పసుల ముండెను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 10న రాత్రి 11 గంటల సమయంలో నారాయణ సింగ్ ఇంటికి వెళ్లి ఇరువురు మద్యం తాగారు. నారాయణ సింగ్ నిద్రలోకి జారుకోగా.. మొండయ్య అక్కడే ఉన్న రేకు కత్తితో నారాయణ సింగ్ మెడ ఎడమ వైపు పొడవడంతో తీవ్ర రక్తస్రావమై మరణించాడని, మృతుడిపై ఉన్న ఆభరణాల కోసం మొండయ్య హత్య చేసినట్లు తెలిపారు.
Post A Comment: