ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;కాజీపేట దర్గా ముగింపు ఉత్సవాలలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ఈ చారిత్రాత్మక నగరంలో ఈ చారిత్రాత్మక దర్గాలో మూడు రోజులపాటు ఘనంగా పూజలు నిర్వహించడం జరిగిందని, ఉత్సవాలు ఘనంగా నిర్వహించారని అన్నారు. మొన్న సంగల్, నిన్న ఉర్సు, నేడు బద్వాల్ తోని దర్గా ఉత్సవాలు ముగిశాయని తెలిపారు. దర్గా పీఠాధిపతి అయిన కుశ్రు పాషా గారి నేతృత్వంలో భక్తులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చారని, ప్రపంచంలోనే ఇది రెండవ దర్గా అని, మొదటిది ఇరాన్ లో ఉంటే రెండోది భారతదేశంలోని మన దగ్గర ఉందని తెలిపారు. వస్తున్నటువంటి భక్తులను దృష్టిలో పెట్టుకొని గతి గత పది రోజుల్లో కిందటి నుంచి కార్పొరేషన్ లోని అన్ని విభాగాల నుంచి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశామని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశంతో పాటు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో పీఠాధిపతి సమన్వయంతోని వచ్చినటువంటి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు రాబోయే రోజులలో కూడా మరింత అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తామని తెలిపారు.
Post A Comment: