ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

 జిల్లాలో  గణేష్ నిమజ్జన శోభాయాత్ర  ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ పుల్లా కరుణాకర్  అన్నారు. సోమవారం వినాయక నిమజ్జన ఏర్పాట్లు, నిర్వాహకులు పాటించాల్సిన నియమనిబంధనల గురించి పత్రికా ప్రకటనలో తెలిపారు. వినాయక నిమజ్జనం చేసే చెరువులు, కుంటలు, నదుల వద్ద ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పి  పేర్కొన్నారు. గణేష్  ఊరేగింపు సమయంలో గ్రామాల్లో విద్యుత్ తీగలు తగిలి  ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అప్రమత్తతగా వ్యవహరించాలని అన్నారు. మంచి కండిషన్లో ఉన్న వాహనాలను మాత్రమే గణేష్ శోభయాత్ర వినియోగించాలని సూచించారు.  ప్రధానంగా వినాయక ప్రతిమలను ఊరేగించే వాహన డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. విగ్రహాలు తీసుకొని నీటి లోతు వరకు  ఎవరూ వెళ్లకూడదని, అందులోనూ ఈతరాని  వారు ఎట్టి పరిస్థితుల్లో నీళ్లలో దిగకూడదని ఎస్పి కరుణాకర్  సూచించారు. నిమజ్జనం రోజున వాహనాలపై డీజేతో కూడిన మ్యూజిక్ సిస్టమును ఉపయోగించడం నిషేధించడం జరిగిందని వెల్లడించారు. ఇతర మతాలకు గాని ఇతర వర్గాలకు చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని ఏలాంటి రెచ్చగొట్టే పనులు చేయవద్దని పేర్కొన్నారు.  చిన్నారులను నిమజ్జనం  ప్రాంతాలకు తీసుకురావద్దు మండపాల నిర్వాహకులు,  తల్లిదండ్రులు చిన్నారులను నిమజ్జన ప్రాంతాలకు తీసుకురావద్దని ఎస్పి  సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు.  జిల్లాలో ప్రశాంతంగా శోభయాత్ర నిర్వహణ కోసం  ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉత్సవ కమిటీ సభ్యులు, శాంతి కమిటీ సభ్యులలతో పోలిసు అధికారులు  సమావేశం నిర్వహించారని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని,  ఏదైనా సంఘటన జరిగితే నిర్వాహకులు వెంటనే పోలీసులు తెలియజేయాలని,  ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఏలాంటి వదంతులు, పుకార్లను నమ్మరాదని, ఏమైనా సమస్యలు ఉంటే దగ్గర్లోని పోలీస్ స్టేషన్ గాని, డయల్-100 కు గాని సమాచారం అందించాలని ఎస్పి కరుణాకర్   కోరారు. ప్రశాంత వినాయక గణేష్ నిమజ్జనమే జిల్లా పోలిసు శాఖ అభిమతమని, శాంతియుత, ప్రశాంత వినాయక నిమజ్జోత్సవాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పి  కోరారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: