ముఖ్య సంచాలక్ అనపర్తి సాయి తేజ


పెద్దపల్లి బిజెపి ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న కందుల సదానందం ముదిరాజ్,ఈ సందర్భంగా కందుల సదానందం ముదిరాజ్ మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా పార్టీకి ఒక ఫుల్ టైమర్ లాగా కష్టపడుతున్న సందర్భాన్ని గుర్తుచేస్తూ ఏబీవీపీ నుండి కష్టపడుతూ బిజెపి నుండి పెద్దపల్లి మండలానికి జడ్పిటిసి గా పోటీ చేసి ఎన్నో గ్రామాల నుండి యువకులను పెద్ద ఎత్తున బిజెపిలో జాయినింగ్ చేపించనని, ZPTC  తరువాత వచ్చిన కౌన్సిలర్ ఎలక్షన్స్ లలో ప్రతి ఒక్కరికి పనిచేశానని, అప్పటినుండి గత మూడు సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామ గ్రామాన తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నానని, రాష్ట్ర ప్రభుత్వ వైకల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగడుతున్న సందర్భంలో నాపై కేసు కూడా పెట్టారని ఇప్పటికీ కోర్టుల చుట్టూ పేషీలకి తిరుగుతున్న సందర్భాన్ని తన గుర్తు చేస్తూ పెద్దపెల్లి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశానని కందుల సదానందం ముదిరాజ్  తెలియజేశారు, పెద్దపల్లి నియోజకవర్గ పరిస్థితి గురించి ఇక్కడున్న వనరులను దుర్వినియోగం చేస్తున్న పరిస్థితి అక్రమంగా మట్టిని ఇసుకను అమ్ముకుంటున్న పరిస్థితి ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి పెద్దపెల్లి నియోజకవర్గంలో  ఉన్న అనేక సమస్యల గురించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని కలిసి నియోజవర్గ పరిస్థితి గురించి వివరించానని కందుల సదానందం ముదిరాజ్ తెలియజేశారు.. 

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: