ముఖ్య సంచాలక్ అనపర్తి సాయి తేజ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో కృష్ణాష్టమి వేడుకలు విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరుగగా పలువురు చిన్నారులు కృష్ణుడు గోపికల వేషధారణలతో సందడి చేశారు. స్థానిక రామాలయం నుండి కొబ్బరికాయ కొట్టి ఎస్సై రాజకుమార్ శోభాయాత్రను ప్రారంభించగా మహాదేవపూర్ పురవీధుల్లో డీజే పాటలతో భజనలు చేస్తూ తిరిగారు. ఈ వేడుకల్లో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బెంబిరి దేవరావు, జిల్లా సహా కార్యదర్శి అంకిరెడ్డి, భజరంగ్ దళ్ ప్రఖండ ప్రముఖ్, చీలం మధుకర్, బజరంగ్ దళ్ కార్యకర్తలు పోత మనోజ్, చెక్కల రాకేష్ ఠాకూర్, అరవింద్ సింగ్, శీలం పవన్ చిన్నారులు పాల్గొన్నారు.
Post A Comment: