ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాల తయారీలో కృత్రిమ రంగులు మరియు రసాయనాల వినియోగం వల్ల జల వనరులు కాలుష్యానికి గురవుచున్నాయి. అందుచే కృత్రిమ రంగులు మరియు రసాయనాలతో చేసిన విగ్రహాలను మానివేసి మట్టితో చేసిన విగ్రహాలను పూజించి చెరువులను కలుషితం కాకుండా కాపాడుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్  తెలిపారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్  మాట్లాడుతూ ప్రజల్ని చైతన్యపరిచే విధంగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వారి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆర్ సునీత, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం, వరంగల్  మాట్లాడుతూ ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి వినాయకులను పూజించి పర్యావరణ పరిరక్షించాలని తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతి జిల్లాకు 2000 వేల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కావున మట్టి విగ్రహాలను పూజించి చెరువులను కలుషితం కాకుండా కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి జిల్లా అధికారి ఆర్. సునీత, డిఆర్ఓ, జిఎం -డిఐసి , డిస్ట్రిక్ట్ బిసి  వెల్ఫేర్ ఆఫీసర్, ఏఈఈ  ,ఏఎస్, టిఎస్ పిసిబి  పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: