October 2024
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

హన్మకొండ ;

హనుమకొండ జిల్లాలో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే( సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) ను పకడ్బందీగా నిర్వహించేం దుకు అధికారులు కృషి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. 

మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే మార్గదర్శకాల పై వివిధ శాఖల అధికారులు, జిల్లాలోని మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎంపీఎస్ వోలతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ  సామాజిక ఆర్థిక  విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే ( సమగ్ర ఇంటింటి  కుటుంబ సర్వే)ను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పకడ్బందీగా జరగాలన్నారు. సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే కోసం మండలానికి ప్రత్యేక అధికారులుగా ఉన్న  జిల్లాస్థాయి అధికారులతో పాటు ఎంపీడీవో, ఇతర అధికారుల పర్యవేక్షణలో  ఎన్యుమరేటర్ల ద్వారా సర్వే జరుగుతుందన్నారు. ప్రతి గ్రామం, వార్డులలో ఎన్యుమరేషన్ బ్లాక్ ల ప్రకారం సర్వే  జరుగుతుందన్నారు. బుధవారం మండల స్థాయిలో సర్వేకు  సంబంధించి వివిధ అంశాలను తెలియజేసేందుకు ఎన్యుమారేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 

సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే మార్గదర్శకాల పై శిక్షణ పొందిన అధికారులతో  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా  శిక్షణ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జెడ్పి సీఈవో విద్యాలత,  పరకాల ఆర్డిఓ డాక్టర్ కె. నారాయణ, సిపిఓ సత్యనారాయణరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, డిపిఓ లక్ష్మీ రమాకాంత్, కాజీపేట డిప్యూటీ కమిషనర్ రవీందర్, పరకాల మున్సిపల్ కమిషనర్ నరసింహ, ఇతర అధికారులతో పాటు  మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపి వోలు, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

హన్మకొండ ;

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు.మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు మధిర తహసిల్దార్ కార్యాలయం నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై సమీక్షించారు.

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు తయారు చేసిన ప్రణాళిక, సర్వే ఉద్దేశం, జిల్లా స్థాయిలో కలెక్టర్ లు తీసుకోవాల్సిన చర్యలు మొదలగు అంశాలను ఉప ముఖ్యమంత్రి వివరించారు. 

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (సామాజిక ,ఆర్థిక ,విద్య ,ఉపాధి, రాజకీయ, కుల సర్వే ) నిర్వహణ విధి విధానాలను క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించామని అన్నారు.ఈ సర్వేలో ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి రాజకీయ, కుల వివరాలను సేకరిస్తామని అన్నారు. 

ప్రజా ప్రభుత్వం ఉన్నతమైన ఆలోచనతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపడుతుందని, తీసి ఎస్సీ ఎస్టీ ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వివిధ సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ అవకాశాల వారికి మెరుగుపరచడానికి తగిన ప్రణాళికలు తయారు చేసేందుకు ఈ సర్వే ఉపయోగిస్తామని ఉప ముఖ్యమంత్రి అన్నారు.

 ప్రజా ప్రభుత్వం చేపట్టే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లక్షల మంది జీవితాల్లో మార్పు తీసుకుని వస్తుందని, అధికారులు వివరాలను సేకరించే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని అన్నారు.ప్రతి ఇంటి నుంచి వివరాలు సేకరణ జరగాలని, దానికి తగిన విధంగా ప్లాన్ తయారు కావాలని అన్నారు. 

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు అవసరమైన ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్ లను గుర్తించి వారికి అవసరమైన శిక్షణ అందించాలని, గ్రామం మండల జిల్లా సాయి ప్రభుత్వ అధికారులను ఎంపిక చేయాలని, సి.ఆర్.పీ, గెస్ట్ టీచర్ల సేవలు తీసుకోవచ్చని అన్నారు. 

150 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్ ఉండేలా ఈబీ మ్యాప్ లను అప్ డేట్ చేయాలని, ఎన్యుమరేటర్ కు నిర్దిష్టమైన ఎన్యుమరేషన్ బ్లాక్ (ఈబీ) కేటాయించాలని, 10 ఈబీ బ్లాక్ లకు డేటా సేకరణ పర్యవేక్షణకు సూపర్వైజర్ ఉండాలని, సూపర్ వైజర్ 10% ఇండ్లను ర్యాండం గా ఎంచుకొని డేటా వివరాలు తనకి చేయాలని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారులు నోడల్ అధికారిగా నియమించాలని, ఇలాంటి పెద్ద స్థాయి సర్వేలలో గత అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఎన్యుమరేటర్ సూపర్వైజర్ లకు అవసరమైన శిక్షణ అందించాలని అన్నారు.సర్వే నిర్వహణకు అవసరమైన ఫారంలు మార్గదర్శకాలు ముద్రణ స్టేషనరీ ఏర్పాట్లు చేయాలని, ఇండ్ల జాబితా చేపట్టాలని అన్నారు.

సర్వే షెడ్యూల్ వివరాలు ప్రజలకు చేరేలా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, నవంబర్ 6 నుంచి సర్వే ప్రారంభించాలని, సర్వే చేస్తున్న సమయంలో కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు ధరణి పాస్ పుస్తకాలు కుటుంబం దగ్గర ఉంచుకునేలా విరుద్ధంగా ప్రచారం చేయాలని అన్నారు. సర్వే వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసేందుకు డాటా ఎంట్రీ ఆపరేటర్లను గుర్తించాలని అన్నారు.

ఎన్యుమరేషన్ సమయంలో కుటుంబం యజమానికి వారి వద్ద నుంచి సేకరించే సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని తెలియజేయాలని, నింపిన షెడ్యూల్ ఫారం లోని జాగ్రత్తగా భద్రపరచాలని, ఈ డేటా ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదని తెలిపారు. రోజువారి సర్వే పూర్వకతిని జిల్లా వారీగా ఏరోజుకారోజు సాయంత్రం 6 గంటలకు తెలియజేయాలని అన్నారు.

సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.జిల్లా కలెక్టర్ ల బాధ్యతలు స్పష్టంగా తెలియజేసామని, ఏ ఇండ్లు మిస్ కాకుండా ఇండ్ల జాబితా ప్రక్రియ పూర్తి చేయాలని, షెడ్యూల్ రూపకల్పన, స్టీకర్, అవసరమైన సామాగ్రి సేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు.

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు అవసరమైన ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ నియామకం జరగాలని, వీరికి జిల్లా స్థాయిలో అవసరమైన శిక్షణ అందించాలని, ప్రజల వివరాలకు గోపిక పాటించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ఎన్యుమరేటర్లకు స్పష్టమైన ఆదేశాలు అందించాలని సీఎస్ సూచించారు.

సిద్దిపేట నుంచి పాల్గొన్న రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ చరిత్రలో నిలిచిపోయే ప్రక్రియ అవుతుందని అన్నారు. సర్వే నిర్వహణ పై శాసనసభ తీర్మానం ప్రవేశపెట్టి, క్యాబినెట్ లో ఆమోదం పొంది సంబంధిత ఉత్తర్వులు జారీ చేశామని అన్నారు.

ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్ సిద్ధం చేయాలని అన్నారు. సర్వే ప్రక్రియ పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. సూపర్వైజర్ లు సర్వే వివరాలు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ క్రాస్ చెక్ చేసుకోవాలని అన్నారు. సీఎస్ నుంచి క్షేత్రస్థాయి అధికారి వరకు సమన్వయంతో పని చేస్తూ ఏ తప్పులు లేకుండా సర్వే నిర్వహించాలని, దేశానికే రోల్ మోడల్ విధంగా మన పని తీరు ఉండాలని అన్నారు.

నల్గొండ నుంచి పాల్గొన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సర్వే నిర్వహణ షెడ్యూల్ ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. సర్వే పూర్తి చేసిన ఇంటికీ స్టిక్కర్ అంటించాలని అన్నారు. నవంబర్ 6 నుంచి సర్వే ప్రారంభమవుతుందని, నవంబర్ నెల చివరి వరకు ప్రతి ఇంటి సర్వే పూర్తిచేసే వివరాలు ఆన్ లైన్ లో పక్కాగా నమోదు చేయాలని అన్నారు. 

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఎన్యుమరేటర్ లతో ఇంటింటి సర్వే నిర్వహించడం ఎంత ముఖ్యమో, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి డాటా ఎంట్రీ వివరాలను తప్పులు లేకుండా ఎంట్రీ చేయడం అంతే ముఖ్యమని అన్నారు. 

అనంతరం ధాన్యం కొనుగోలు పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షిస్తూ జిల్లాలలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో వెంటనే ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు.జిల్లాలో వచ్చే దాన్యం దిగుబడి, అందుబాటులో ఉన్న గోడౌన్ సామర్థ్యం మేరకు అవసరమైతే ఇంటర్మీడియట్ గోడౌన్లను సిద్ధం చేసుకోవాలని అన్నారు.మిల్లింగ్ చార్జీలు గతంలో చాలా తక్కువగా ఉండేవని, వీటిని పెంచేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసిందని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాకుండా చూడాలని అన్నారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జడ్పీ సీఈవో విద్యాలత, సీపీవో సత్యనారాయణ రెడ్డి, డీపీవో లక్ష్మీరమాకాంత్, డీఈవో వాసంతి, జీడబ్ల్యూఎంసీ కాజిపేట్ డివిజన్ కమిషనర్ రవీందర్, పరకాల మున్సిపల్ కమిషనర్ నరసింహ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

హనుమకొండ జిల్లాలో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే( సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) ను పకడ్బందీగా నిర్వహించేం దుకు అధికారులు కృషి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. 

మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే మార్గదర్శకాల పై వివిధ శాఖల అధికారులు, జిల్లాలోని మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎంపీఎస్ వోలతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ  సామాజిక ఆర్థిక  విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే ( సమగ్ర ఇంటింటి  కుటుంబ సర్వే)ను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పకడ్బందీగా జరగాలన్నారు. సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే కోసం మండలానికి ప్రత్యేక అధికారులుగా ఉన్న  జిల్లాస్థాయి అధికారులతో పాటు ఎంపీడీవో, ఇతర అధికారుల పర్యవేక్షణలో  ఎన్యుమరేటర్ల ద్వారా సర్వే జరుగుతుందన్నారు. ప్రతి గ్రామం, వార్డులలో ఎన్యుమరేషన్ బ్లాక్ ల ప్రకారం సర్వే  జరుగుతుందన్నారు. బుధవారం మండల స్థాయిలో సర్వేకు  సంబంధించి వివిధ అంశాలను తెలియజేసేందుకు ఎన్యుమారేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 

సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే మార్గదర్శకాల పై శిక్షణ పొందిన అధికారులతో  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా  శిక్షణ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జెడ్పి సీఈవో విద్యాలత,  పరకాల ఆర్డిఓ డాక్టర్ కె. నారాయణ, సిపిఓ సత్యనారాయణరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, డిపిఓ లక్ష్మీ రమాకాంత్, కాజీపేట డిప్యూటీ కమిషనర్ రవీందర్, పరకాల మున్సిపల్ కమిషనర్ నరసింహ, ఇతర అధికారులతో పాటు  మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపి వోలు, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

రాష్ట్ర ప్రభు

త్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించాలని  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు.మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు  మధిర తహసిల్దార్ కార్యాలయం నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై సమీక్షించారు.

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు తయారు చేసిన ప్రణాళిక,  సర్వే ఉద్దేశం, జిల్లా స్థాయిలో కలెక్టర్ లు తీసుకోవాల్సిన చర్యలు మొదలగు అంశాలను ఉప ముఖ్యమంత్రి వివరించారు. 

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (సామాజిక ,ఆర్థిక ,విద్య ,ఉపాధి, రాజకీయ, కుల సర్వే ) నిర్వహణ విధి విధానాలను క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించామని అన్నారు.ఈ సర్వేలో ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి రాజకీయ, కుల వివరాలను సేకరిస్తామని అన్నారు. 

ప్రజా ప్రభుత్వం ఉన్నతమైన ఆలోచనతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపడుతుందని, తీసి ఎస్సీ ఎస్టీ ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వివిధ సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ అవకాశాల వారికి మెరుగుపరచడానికి తగిన ప్రణాళికలు తయారు చేసేందుకు ఈ సర్వే ఉపయోగిస్తామని ఉప ముఖ్యమంత్రి అన్నారు.

 ప్రజా ప్రభుత్వం చేపట్టే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లక్షల మంది జీవితాల్లో మార్పు తీసుకుని వస్తుందని, అధికారులు వివరాలను సేకరించే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని అన్నారు.ప్రతి ఇంటి నుంచి వివరాలు సేకరణ జరగాలని, దానికి తగిన విధంగా ప్లాన్ తయారు కావాలని అన్నారు. 

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు అవసరమైన ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్ లను గుర్తించి వారికి అవసరమైన శిక్షణ అందించాలని,  గ్రామం మండల జిల్లా సాయి ప్రభుత్వ అధికారులను ఎంపిక చేయాలని, సి.ఆర్.పీ, గెస్ట్ టీచర్ల సేవలు తీసుకోవచ్చని  అన్నారు. 

150 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్ ఉండేలా ఈబీ మ్యాప్ లను అప్ డేట్ చేయాలని,  ఎన్యుమరేటర్ కు నిర్దిష్టమైన ఎన్యుమరేషన్ బ్లాక్ (ఈబీ) కేటాయించాలని, 10 ఈబీ బ్లాక్ లకు డేటా సేకరణ పర్యవేక్షణకు సూపర్వైజర్ ఉండాలని, సూపర్ వైజర్ 10% ఇండ్లను ర్యాండం గా ఎంచుకొని డేటా వివరాలు తనకి చేయాలని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారులు నోడల్ అధికారిగా నియమించాలని, ఇలాంటి పెద్ద స్థాయి సర్వేలలో గత అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని,   ఎన్యుమరేటర్ సూపర్వైజర్ లకు అవసరమైన శిక్షణ అందించాలని అన్నారు.సర్వే నిర్వహణకు అవసరమైన ఫారంలు మార్గదర్శకాలు ముద్రణ స్టేషనరీ ఏర్పాట్లు చేయాలని, ఇండ్ల జాబితా చేపట్టాలని అన్నారు.

సర్వే షెడ్యూల్ వివరాలు ప్రజలకు చేరేలా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, నవంబర్ 6 నుంచి సర్వే ప్రారంభించాలని, సర్వే చేస్తున్న సమయంలో కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు ధరణి పాస్ పుస్తకాలు కుటుంబం దగ్గర ఉంచుకునేలా విరుద్ధంగా ప్రచారం చేయాలని అన్నారు. సర్వే వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసేందుకు డాటా ఎంట్రీ ఆపరేటర్లను  గుర్తించాలని అన్నారు.

ఎన్యుమరేషన్ సమయంలో కుటుంబం యజమానికి వారి వద్ద నుంచి సేకరించే సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని తెలియజేయాలని, నింపిన షెడ్యూల్ ఫారం లోని జాగ్రత్తగా భద్రపరచాలని, ఈ డేటా ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదని తెలిపారు. రోజువారి సర్వే పూర్వకతిని జిల్లా వారీగా ఏరోజుకారోజు సాయంత్రం 6 గంటలకు తెలియజేయాలని అన్నారు.

సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.జిల్లా కలెక్టర్ ల బాధ్యతలు స్పష్టంగా తెలియజేసామని,  ఏ ఇండ్లు మిస్ కాకుండా ఇండ్ల జాబితా ప్రక్రియ పూర్తి చేయాలని, షెడ్యూల్ రూపకల్పన, స్టీకర్, అవసరమైన సామాగ్రి సేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు.

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు అవసరమైన ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ నియామకం జరగాలని, వీరికి జిల్లా స్థాయిలో అవసరమైన శిక్షణ అందించాలని, ప్రజల వివరాలకు గోపిక పాటించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ఎన్యుమరేటర్లకు స్పష్టమైన ఆదేశాలు అందించాలని సీఎస్ సూచించారు.

సిద్దిపేట నుంచి పాల్గొన్న రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ చరిత్రలో నిలిచిపోయే ప్రక్రియ అవుతుందని అన్నారు. సర్వే నిర్వహణ పై శాసనసభ తీర్మానం ప్రవేశపెట్టి, క్యాబినెట్ లో ఆమోదం పొంది సంబంధిత ఉత్తర్వులు జారీ చేశామని అన్నారు.

ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్ సిద్ధం చేయాలని అన్నారు. సర్వే ప్రక్రియ పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు.  సూపర్వైజర్ లు సర్వే వివరాలు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ క్రాస్ చెక్ చేసుకోవాలని అన్నారు. సీఎస్ నుంచి క్షేత్రస్థాయి అధికారి వరకు సమన్వయంతో పని చేస్తూ ఏ తప్పులు లేకుండా సర్వే నిర్వహించాలని, దేశానికే రోల్ మోడల్ విధంగా మన పని తీరు ఉండాలని అన్నారు.

నల్గొండ నుంచి పాల్గొన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సర్వే నిర్వహణ షెడ్యూల్ ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు.  సర్వే పూర్తి చేసిన ఇంటికీ స్టిక్కర్ అంటించాలని అన్నారు. నవంబర్ 6 నుంచి సర్వే ప్రారంభమవుతుందని, నవంబర్ నెల చివరి వరకు ప్రతి ఇంటి సర్వే పూర్తిచేసే వివరాలు ఆన్ లైన్ లో పక్కాగా నమోదు చేయాలని అన్నారు. 

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఎన్యుమరేటర్ లతో ఇంటింటి సర్వే నిర్వహించడం ఎంత ముఖ్యమో,  ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి డాటా ఎంట్రీ వివరాలను తప్పులు లేకుండా ఎంట్రీ చేయడం అంతే ముఖ్యమని  అన్నారు. 

అనంతరం ధాన్యం కొనుగోలు పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షిస్తూ జిల్లాలలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో వెంటనే ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు.జిల్లాలో వచ్చే దాన్యం దిగుబడి, అందుబాటులో ఉన్న గోడౌన్ సామర్థ్యం మేరకు అవసరమైతే ఇంటర్మీడియట్ గోడౌన్లను సిద్ధం చేసుకోవాలని అన్నారు.మిల్లింగ్ చార్జీలు గతంలో చాలా తక్కువగా ఉండేవని, వీటిని పెంచేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసిందని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాకుండా చూడాలని అన్నారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జడ్పీ సీఈవో విద్యాలత, సీపీవో సత్యనారాయణ రెడ్డి, డీపీవో లక్ష్మీరమాకాంత్, డీఈవో వాసంతి, జీడబ్ల్యూఎంసీ కాజిపేట్ డివిజన్ కమిషనర్ రవీందర్, పరకాల మున్సిపల్ కమిషనర్ నరసింహ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

హన్మకొండ ;

అఖిల భారత జాతీయ పశుగణన కార్యక్ర మం వాల్ పోస్టర్లను కలెక్టర్ ప్రావిణ్య మంగళవారం ఆవిష్కరించారు.    జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కే. వెంకటరెడ్డి లు పాల్గొన్నారు. జనాభా లెక్కల మాదిరిగానే పశు సంవర్ధక శాఖ పశు గణన కార్యక్ర మాన్ని చేపడుతోంది. ప్రతీ ఐదేళ్లకు ఒకమారు పశువులను లెక్కిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం 21వ అఖిల భారత పశు గణనను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది . గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పశుసంపద అత్యంత కీలక మని కేంద్ర ప్రభుత్వ భావిస్తోంది. మానవ జీవన శైలిలో శాస్త్ర సాంకేతికంగా ఎంతో పురోగతి సాధించినప్పటికీ అదిక శాతం వ్యవసాయ అనుబంధ రంగంతో జీవనోపాది పొందుతున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఐదేళ్లకోసారి పశువుల గణన చేపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 21వ అఖిల భారత జాతీయ పశుగణన కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రణాళికలు పొందించింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, పట్టణాలలో పశు గణను పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 56 పశు వైద్యశాలలు ఉన్నాయి. వా టిలో రెండు ఏరియా వెటర్నరీ వైద్యశాలలు (ఏవీహెచ్), 23 ప్రైమరీ వెటర్నరీ వైద్యశాలలు (పీఏసీ), 31 పశు సబ్ సెంటర్లు ఉన్నాయి. వీటికి తోడు జిల్లాలో రెండు   సంచార పశు వైద్య శాలలు పనిచేస్తున్నాయి. జిల్లా వ్యా ప్తంగా మంజూరైన 155 వివిధ స్థాయిల సిబ్బందికి గా ను సుమారు 113 మంది పనిచేస్తున్నారు. ఆయా పరిది లో ఉన్నతాధికారులు ఎంపిక చేసిన 20 సూపర్వైజర్లు, 68             ఎన్యుమరేటర్ల ఆధ్వర్యంలో ఈ పశుగణన చేపట్టనున్నారు.. జిల్లాలో సుమారు 5,85,193 గొర్రెలు, సుమారు  1,27,818 గోజాతి పశువులున్నట్లు అంచనా ఉంది. రెవెన్యూ గ్రామం యూనిట్ గా పశు గణనను జరుపుతున్నారు. పశు గణన డిజిటల్ ఫ్లాట్ ఫారమ్ (భారత్ పశుదాన్ పోర్టల్)  సమాచారాన్ని పొందుపరుస్తున్నారు. జిల్లాలో  138 రెవెన్యూ గ్రామాలతో పాటు పట్టణాల్లో గల 57 వార్డులలో  68 మంది ఎన్యుమరేటర్లను గుర్తించి పశు గణన జరుపుతున్నారు. ఎన్యూ మరేటర్ల పనితీరు ను మండల స్థాయిలో సూపర్ వైజర్లు పర్యవేక్షిస్తున్నారు . ఇందుకు మండలానికి చెందిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ లకు బాధ్యతలు అప్పగించారు. ఈనెల 25వ తేదీ నుంచి పశుగణన చేపట్టారు. జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో  వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు పశు గణన కొన సాగనుంది. పశు వైద్య శాలల డాక్టర్లు సూపర్వైజ ర గా, గోపాల మిత్రులు,పారా స్టాఫ్ ఎన్యుమరేటర్లుగా ఈ పశుగణన కార్యక్రమం ప్రారంభించారు.డాక్టర్లు పశు గణన పర్యవేక్షిస్తున్నారు . ప్రతి ఇంటికి ఎన్యుమరేటర్ల వెళ్లి పలు అంశాలపై ఆరా తీసి వివరాలను ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేయాల్చి ఉంది. తెల్లజాతి పశువులు, నల్లజాతి పశువులు తో పాటు గొర్రెలు, మేకలు,పందులు, కుక్కలు, కోళ్లు ఇతర పెంపుడు జంతువులు వివరాలు నమోదు చేస్తున్నారు. ఆ రైతు పేరు,ఇంటి సంబర్, ఫోన్ గంబర్, పశుపుల వివరాలతో పా టు వాటి వయస్సు ఇతరత్రా వివరాలను డిజిటలైజేష ద్వారా పోర్టల్లో నమోదు చేస్తున్నారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో  అఖిల భారత జాతీయ పశుగణన కార్యక్ర మం వాల్ పోస్టర్లను కలెక్టర్ ప్రావిణ్య   జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కే. వెంకట్ నారాయణ, జిల్లా ఉప పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ పి శ్రీనివాస్ ఆవిష్కరించారు. డాక్టర్స్ ప్రవీణ్, దీపిక, వినయ్, విక్రమ్,   పార్థసారథి   పశు వైద్యాధికారులు పాల్గొన్నారు. పశు గణన ను విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రతి ఇంటికి వెళ్లాలని గణన ప్రాధాన్యత ను వివరించాలని ఆదేశం చారు. వాల్ పోస్టర్లను పశువైద్యశాలల ఎదుటు సంబంధిత కార్యాలయాల ఎదుట ఏర్పాటు చేస్తున్నా రు.

  ఈ గణనతో పశువుల లెక్క పక్కాగా తేలనుంది. దీనిని ఆధారంగా చేసుకుని సంబంధిత వ్యాక్సిన్లు, ప్రభుత్వ సబ్సిడీ దానా తదితర వాటిపై ప్రభుత్వాలు సులభంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. నాలుగు నెలల పాటు గణన జరుగుతుంది. సర్వేకు అన్ని గ్రామాల రైతులు సహకరించాలని కోరారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

-  హన్మకొండ ;

 హనుమకొండ జిల్లా పరిధిలోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో స్వీప్ ఆధ్వర్యంలో నూతన ఓటర్ల నమోదు కోసం విస్తృతంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో స్వీప్ ఆధ్వర్యంలో  నిర్వహించే యాక్షన్ ప్లాన్లో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నవంబర్ 1వ తేదీ నుండి 26 వ తేదీ వరకు స్వీప్ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య కార్యక్రమాలు  నిర్వహించనున్నట్లు తెలిపారు.  నవంబరు ఒకటో తేదీన ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా కళాశాలల్లో 18 ఏళ్లు నిండిన యువత ఓటరు గా నమోదయ్యేందుకు కార్యక్రమం, క్యాంపస్ అంబాసిడర్లకు శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. 

నవంబర్ 2వ తేదీన నెహ్రూ యువ కేంద్ర, ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో ఓటరు నమోదు కార్యక్రమం ఉంటుందన్నారు. 

7వ తేదీన గిరిజన గ్రామాలలో ఓటర్ నమోదు కార్యక్రమం,

8వ తేదీన మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఓటర్ నమోదు కార్యక్రమం, రంగోలి మెహందీ కార్యక్రమాలు, 

12వ తేదీన భావి ఓటర్లైన  పాఠశాల, కళాశాలల విద్యార్థులతో ఎలక్ట్రోరల్ లిటరసీ క్లబ్ సమావేశాలు, 

19వ తేదీన చునావా పాఠశాల మరియు మీ బిఎల్ ఓ గురించి తెలుసుకోండి కార్యక్రమాలు 

కంప్లీట్ 26వ తేదీన  ఓటరు చైతన్యంపై ర్యాలీ, 2కె రన్, మానవహారం కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. 

 ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో విద్యాలత, ఆర్డీవో నారాయణ, సిపిఓ సత్యనారాయణరెడ్డి, జిల్లా ఖజానాధికారి, స్వీప్ నోడల్ అధికారి శ్రీనివాస్ కుమార్, ఎలక్షన్ విభాగం సూపరింటెండెంట్ ప్రసాదరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 హన్మకొండ ;

విద్యార్థులకు పోలీసు  వీధుల పట్ల అవగాహన కోసమే ఓపెన్ హౌజ్ కార్యక్రమం నిర్వహిస్తు న్నట్లు జయశంకర్ భూపాలపల్లి  జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే   తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ (ఫ్లాగ్ డే) వారోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో  పోలీసు శాఖ ఆధ్వర్యంలో  ఓపెన్‌హౌస్‌ కార్యక్రమం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఎస్పి కిరణ్ ఖరే  పాల్గొని, ఓపెన్ హౌస్ కార్యక్రమం ప్రారంభించారు.  భూపాలపల్లి పట్టణానికి చెందిన దాదాపు 500 మంది,

ప్రభుత్వ,  ప్రైవేటు పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు  ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పి కిరణ్ ఖరే  స్వయంగా పిల్లలకు పోలీసులు ఉపయోగించే ఆయుధాల గురించి,  బీడీ టీమ్ ఎక్విప్మెంట్, నూతన  చట్టాల గురించి, షీ టీమ్స్, భరోసా సెంటర్స్ గురించి, కమ్యూనికేషన్ సిస్టం గురించి, ఫింగర్ ప్రింట్ డివైస్ ల వల్ల కలిగే ఉపయోగాల గురించి, డాగ్ స్క్వాడ్,  ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి  మరియు సైబర్ నేరాల గురించి వివరించారు.

అనంతరం ఎస్పి  మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల లో భాగంగా భూపాలపల్లి జిల్లా పరిధిలో  పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని,  ఓపెన్ హౌస్ కార్యక్రమం లో భాగంగా,  విద్యార్థిని విద్యార్థులకు ఆయుధాలు, షీ టీమ్స్, ట్రాఫిక్, పోలీస్ విధులు, ఫింగర్ ప్రింట్స్, కమ్యూనికేషన్ సిస్టమ్, డాగ్ స్క్వాడ్ మరియు ప్రజల రక్షణ కోసం పోలీసులు  చేస్తున్న  విధుల గురించి అవగాహనా కల్పించడం జరిగిందన్నారు. అదేవిదంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి, రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని, సైబర్ నేరాల వలలో పడకుండా తీసుకోవలసిన జాగ్రత్త చర్యల గురించి  విద్యార్థినీ విద్యార్థులకు వివరించారు. సైబర్ నేరాలు, సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయో,సైబర్ నేరం జరగగానే 1930  టోల్ ఫ్రీ నెంబర్ ల గురించి విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని పేర్కొన్నారు.  నూతన చట్టాలు, పోలీసులు  ప్రజలకు అందిస్తున్న సేవలు గురించి వివరించారు. విద్యార్థినీ విద్యార్థులకు కమ్యూనికేషన్ మ్యాన్ ప్యాక్, విహెచ్ఎఫ్ సెట్ ల గురించి అవగాహన, కల్పించడంతో పాటు,  బాలికలు మరియు మహిళల రక్షణకు ఏర్పాటుచేసిన  భరోసా కేంద్రం, షీ టీమ్స్ పని తీరు, పోలీసు శాఖకు సంబంధించిన వివిధ యాప్ ల గురించి అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల గురించి, డయల్ 100,  గురించి కూడా అవగాహన కల్పించారు. 

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి (ఆపరేషన్) బోనాల కిషన్, భూపాలపల్లి డిఎస్పి సంపత్ రావు, భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నగేష్, కిరణ్,  రత్నం, శ్రీకాంత్, ఆర్ఎస్ఐలు,, జిల్లా పరిధిలోని ఎస్సైలు పాల్గొన్నారు. వివిధ పాఠశాల కళాశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి,మంథని,కొయ్యూరు,అక్టోబర్,25(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ)పదేండ్లు స్వేచ్చగా మహనీయులను పూజించుకున్నాం.విగ్రహాలు అవిష్కరిస్తమంటే ఆంక్షలు పెడుతుండ్లు అట్టడుగు వర్గాలు అభివృద్ది చెందితేనే రాజ్యాంగం అమలైనట్లు!.మహనీయుల ఆశయాలను కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలే..మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌..మహనీయుల చరిత్రను నిలబెడతాం..అట్టడుగు వర్గాలనుంచి ఎమ్మెల్యే అయితే ఐదేండ్లు అవమానించారని,తమను అవమానించినా ఇబ్బందులకు గురిచేసినా పట్టించుకోమని కానీ మహనీయులను అవమానిస్తే మాత్రం ఉపేక్షించేది లేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ స్పష్టం చేశారు.శుక్రవారం మల్హర్‌ మండలం కొయ్యూర్‌ ప్రధాన కూడలిలో భుపాలపల్లి జిల్లా ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం ఆధ్వర్యంలో విగ్రహా దాత పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఏర్పాట చేసిన కొమురంభీం విగ్రహాన్ని ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ,భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని లతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడరు,అనేక ఏండ్ల క్రితమే మహనీయులు మనకోసం అనేక పోరాటాలు,త్యాగాలు చేశారని ఆయన గుర్తు చేశారు.మహనీయుల చరిత్ర తెలుసుకోకపోవడం మూలంగానే మన హక్కులు సాదించుకోలేకపోతున్నామన్నారు.పదేళ్ల క్రితమే మంథని నియోజకవర్గంలో కొమురంభీం విగ్రహాన్ని అవమానించి పోలీస్‌స్టేషన్‌లో పెట్టారని,అదే నియోజకవర్గంలో ఈనాడు ఘనంగా విగ్రహ ఆవిష్కర చేసుకుంటున్నామని అన్నారు.అడవిని నమ్ముకుని అడవిలోనే బ్రతుకుతున్న ఆదివాసుల హక్కులను బ్రతుకులను ఆగము చేసిన కాంగ్రెస్ పార్టీ!.దాన్ని ఆచరిస్తున్న బిజెపి పార్టీ.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్ల పాటు మహనీయులను స్వేచ్చగా పూజించుకున్నామని ఈనాడు కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో మహనీయుల విగ్రహాల ఆవిష్కరణకు ఆంక్షలు పెడుతున్నారని ఆయన అన్నారు.తాము తమ కుటుంబసభ్యుల విగ్రహాలు పెట్టడం లేదని,అట్టడుగు వర్గాల కోసం త్యాగాలు చేసిన మహనీయుల విగ్రహాలు మాత్రమే పెడుతున్నామని,అలాంటి మహనీయుల విగ్రహాల ఆవిష్కరణలకు అనేక అడ్డంకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.తాను మహనీయుల చరిత్రను చాటి చెప్పాలనే సంకల్పంతో మహనీయుల జన్మస్థలాలు,పుణ్యస్థలాల సందర్శనకు శ్రీకారం చుట్టానని,ఈ క్రమంలొ మొట్టమొదటగా కొమురంభీం ఆసిఫాబాద్‌ వెళ్లగా అక్కడ కోవ లక్ష్మక్క జోడేఘాట్‌కు తీసుకెళ్లి కొమురంభీంను దర్శించుకున్నట్లు ఆయన తెలిపారు.రాజ్యాంగ నిర్మాత మనదేవుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఎన్నో హక్కులు కల్పించాడని,ఆ హక్కులను కాలరాసినోళ్లే ఈనాడు ఆగం ఆగం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.ఆనాడు పంట పండించి చేతికందే సమయంలో బ్రిటిష్‌ వాళ్లు వచ్చి పంటను తీసుకుపోతుంటే ఎదురొడ్డి పోరాటం చేసిన గొప్ప మహనీయుడు కొమురంభీం అని ఆయన వివరించారు.ఇలా ఎంతో మంది అట్టగుడు అణగారిన వర్గాల కోసం పోరాటాలు చేశారని,నాటి నుంచి నేటి తెలంగాణ సాధించుకునే ఉద్యమం వరకు మహనీయుల స్పూర్తి ఉందన్నారు.మంథని ఎమ్మెల్యేగా తాను పోటీ చేసి ఓడిపోతే తనపని అయిపోయిందని,తాను ఇక ఇక్కడి నుంచి పారిపోతానని ప్రచారం చేశారని,కానీ మహనీయులు ఉన్నన్నిరోజులు పుట్ట మధు ఉంటాడని ఆయన స్పష్టం చేశారు.ఆనాడు అంబేద్కర్‌ను అవమానించినోళ్లు ఈనాడు రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరుగుతున్నారని,అదే విధంగా మంథనిలో సైతం రాజ్యాంగం పుస్తకం పట్టుకుని తిరిగే వరకు పోరాటం ఆగదని.గిరిజన ప్రాంతాల్లో ఉన్న చైతన్యం మన ప్రాంతాల్లో లేదని,కేవలం అక్కడ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఉండటమేనని ఆయన అన్నారు.ఏఅవకాశం వచ్చినా గిరిజనుల్లోని తెగలను గొప్పగా అభివృద్ది చేసే ప్రయత్నం చేస్తానని ఆయన పేర్కొన్నారు.పోలీసులు సైతం తమపై ఒత్తిడిలు,ఆంక్షలు పెట్టవద్దని,మాజీ ఎంపీటీసీ స్వర్గీయ మేకల లింగయ్య విగ్రహం ఏర్పాటు చేస్తామంటే అడ్డు చెప్తున్నారని,కాంగ్రెస్‌ పార్టీ జెండా మోసి పార్టీ కోసం పనిచేసిన మేకల లింగయ్య విగ్రహ ఏర్పాటుకు కాంగ్రెస పార్టీ నాయకులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.ఎస్సీ ఎస్టీ బీసీలుఅభివృద్ది చెందితేనే నిజమైన రాజ్యాంగం అమలు అయినట్లుఅని,75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నామని,ఇంకా అణగారిన వర్గాలు మాత్రం అభివృద్ది చెందలేదని ఆయన అన్నారు.మహనీయుల చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని,చరిత్ర తెలుసుకుంటేనే అభివృద్ది చెందుతామని,ఇందుకోసం తాము పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

హన్మకొండ ;

హనుమకొండ కేయూ క్రాస్ రోడ్డు  సమీపంలోని ప్రభుత్వ ఛాతి, క్షయ వ్యాధుల అసుపత్రిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని  ఓపి విభాగంతో పాటు  మేల్, ఫిమేల్ వార్డులు, ఆర్ఐసీయూ, బ్రాంకోస్కోపీ రూమ్, సెమినార్ హాల్ ను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి సంబంధించి అందిస్తున్న వైద్య సేవలు, కావాల్సిన సదుపాయాలను గురించి  ఎమ్మెల్యే, కలెక్టర్ ఆసుపత్రి ఇంచార్జ్  సూపరింటెండెంట్  డాక్టర్ సునీత, వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి భవనానికి పునరుద్ధరణ చర్యలు, ఇతర మరమ్మతు పనులు చేయించాలని, పలు సదుపాయాలు కల్పించాలని వైద్యులు సిబ్బంది కోరగా ఆసుపత్రి అభివృద్ధికి కావాల్సిన ప్రతిపాదనలు పంపించాలని ఎమ్మెల్యే, కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని లలితాదేవి, రెవిన్యూ డివిజనల్ అధికారి వెంకటేష్, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

హన్మకొండ ;

హనుమకొండలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు పెండింగ్ లో ఉండకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను గురించి సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులలో ఏవైనా పెండింగ్ ఉన్నట్లయితే వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎంపీడీవోలు, ఎంఈవోలు, ఏఈలు రెగ్యులర్ గా పాఠశాలలను సందర్శించి విద్యుత్తు, తాగునీటి సరఫరా, టాయిలెట్స్ నిర్మాణ పనులు పూర్తయ్యాయా లేదా అనేది తనిఖీ చేయాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన తాగునీటీ సరఫరా, విద్యుత్తు, టాయిలెట్స్ నిర్మాణ పనులు ప్రతి పాఠశాలలో వంద శాతం పూర్తి కావాలన్నారు. అనవసరమైన పనులు కాకుండా ప్రాధాన్యత కలిగిన పనులనే చేపట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వంద శాతం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం విద్యార్థులకు అందించేలా ప్రధానోపాధ్యాయులకు ఎంఈవోలు తెలియజేయాల న్నారు.

ఈ సమావేశంలో డీఈవో వాసంతి, జిల్లా పరిషత్ సీఈవో విద్యాలత, డిఆర్డివో నాగ పద్మజ, సిపిఓ సత్యనారాయణ రెడ్డి, ఆర్ అండ్ బి ఈఈ సురేష్ బాబు, ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ ఏఈలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

హన్మకొండ ;

బాలికలు వివిధ క్రీడాంశాల్లో  అత్యుత్తమ ప్రతిభను చాటాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి మహాత్మా జ్యోతిబాఫూలే పాఠశాలల అండర్ -17 బాలికల క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్యఅతిథిగా హాజరై ముందుగా మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిభాయి ఫూలేల చిత్రపటాలకి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. క్రీడా పోటీల  ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను కలెక్టర్ ఆవిష్కరించారు.  అనంతరం కలెక్టర్ క్రీడాజ్యోతిని వెలిగించి జిల్లాస్థాయి క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలకు చెందిన క్రీడాకారిణులు మార్చ్ పాస్ట్ ను నిర్వహించారు. క్రీడాకారిణులతో క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18 పాఠశాలలకు చెందిన 600కు పైగా మంది విద్యార్థినులు  పాల్గొనడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు. కమలాపూర్ పాఠశాలలో మూడు రోజుల పాటు జిల్లా స్థాయి క్రీడా పోటీలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుండడం  అభినందనీయమని తెలిపారు.   వివిధ క్రీడాంశాలలో  బాలికలు  ఉత్సాహంగా పాల్గొనాలని అన్నారు. క్రీడల్లో బాలికలు క్రీడా స్ఫూర్తిని చాటాలని పేర్కొన్నారు. గత నెలలో ఇదే పాఠశాలలో హాస్టల్ నిద్ర చేసినప్పుడు విద్యార్థినులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనడం తాను గమనించానని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకున్న నిఖత్ జరీన్, దీప్తి జీవంజీలను బాలికలు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.  వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ కు చెందిన దీప్తి జీవంజి పారా ఒలింపిక్స్ పోటీలో పతకం సాధించి దేశానికి కీర్తి ప్రతిష్టలను తీసుకువచ్చారని అన్నారు. బాక్సింగ్ లో నిఖత్ జరీన్, అథ్లెటిక్స్లో దీప్తి జీవంజీ లను బాలికలు ఆదర్శంగా తీసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభను చాటి దేశానికి కీర్తి ప్రతిష్టలను తీసుకురావాలన్నారు. నిఖత్ జరీన్ కు ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం కల్పించిందన్నారు. ఎక్కువమంది  బాలికలను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు.   స్పోర్ట్స్ కోటాలో  విద్యలో అవకాశాలు పొందాలని, అదేవిధంగా ఉద్యోగాలు సాధించాలని అన్నారు. బాలికలు చదువుతోపాటు  క్రీడల్లోనూ రాణించాలన్నారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా  నాయకత్వ లక్షణాలు  అలవడతాయని, క్రమశిక్షణ కలిగి ఉంటారన్నారు. క్రీడల్లో సాధించిన ప్రతిభ  జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు.  జిల్లా స్థాయిలో  నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో  విద్యార్థినులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలోనూ  అత్యుత్తమంగా రాణించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. క్రీడా పోటీల్లో పాల్గొంటున్న  క్రీడాకారిణులకు  శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా  జిల్లా బీసీ వెల్ఫేర్ డిడి రామ్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని అన్నారు. క్రీడల్లో ప్రతిభను చాటాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వరంగల్ పాఠశాలకు చెందిన  విద్యార్థినులు యోగాసనాలను అద్భుతంగా ప్రదర్శించి ఆకట్టుకున్నారు. వర్ధన్నపేట, తిమ్మాపూర్, గాంధీనగర్ పాఠశాలల విద్యార్ధినులు చేసిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కమలాపూర్ తహసీల్దార్ సురేష్ కుమార్, ఎంపీడీవో  గుండె బాబు,  మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల జిల్లా కన్వీనర్ వెంకట ప్రసాద్, కమలాపూర్ పాఠశాల ప్రిన్సిపల్ సౌజన్య, ఇతర పాఠశాలల ప్రిన్సిపాల్స్ ఓదెల మల్లయ్య, తదితరులతో పాటు ఉపాధ్యాయులు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

హన్మకొండ ;

ఆరోగ్యవంత మైన జీవనశైలి లో భాగంగా గర్భిణులు, బాలింతలు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడంతో పాటు యోగ, ధ్యానాన్ని అలవర్చుకునే విధంగా  అవగాహన కల్పించాలని  జిల్లా కలెక్టర్‌  పి. ప్రావీణ్య అన్నారు. మంగళవారం వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాల సమావేశ మందిరంలో ఆర్య జనని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఐసిడిఎస్‌ సూపర్వైజర్లకు క్షేత్రస్థాయిలో గర్భిణులు, బాలింతలకు కల్పించాల్సిన అవగాహన కార్యక్రమాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హనుమకొండ జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య  ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఆరోగ్యవంతంగా ఉండేందుకు  గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడే  యోగ, ధ్యానం ఆసనాలతోపాటు  తీసుకోవాల్సిన పౌష్టికాహారం  గురించి ఐసిడిఎస్‌ సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పౌష్టికాహారం, యోగ, ధ్యాన ఆసనాలు, ఇతర ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన  వివిధ అంశాలను గురించి ఐసిడిఎస్‌ సూపర్వైజర్లు మండల స్థాయిలో  అంగన్వాడి టీచర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించే విధంగా ఈ శిక్షణ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. మూడు పద్ధతులను గర్భిణీ స్త్రీలు పాటించడం వలన శ్రేష్టమైన సంతానం కలుగుతుందని అన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి జయంతి, ఆర్యజనని అధ్యక్షులు అనుపమ రెడ్డి అంగన్‌వాడీ టీచర్లు ఐసిడిఎస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

హన్మకొండ  ;

హనుమకొండ జిల్లాలో రోడ్డు భద్రతకు సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, జిల్లా రోడ్డు భద్రత కమిటీ ఛైర్మన్ పి. ప్రావీణ్య వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ (డి.ఆర్.ఎస్.సి) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ, పోలీస్, రవాణా, మున్సిపల్, ఆర్టీసీ,  జాతీయ రహదారులు, వైద్య ఆరోగ్యశాఖ, తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొని రోడ్డు భద్రతకు తీసుకుంటున్న చర్యల గురించి సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలు చోటు చేసుకున్న ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్డు నిర్మాణాల పనులను 15 రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. వరంగల్ ఎన్ఐటీ తో ఎన్జీవో సంస్థ ఆధ్వర్యంలో  రోడ్డు భద్రత  అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ  వాకడే, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ఈఈ సురేష్ బాబు, డీసీపీలు రవీందర్, సలీమా, ఏసీపీలు కిషోర్ కుమార్, దేవేందర్ రెడ్డి, తిరుమల్,సత్యనారాయణ,ఆయా శాఖల అధికారులు  పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

హన్మకొండ ;

మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అనుబంధ సంస్థ ప్రత్యేక దత్తత విభాగం శిశు గృహను మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య  సందర్శించారు. ఈ సందర్భంగా వసతులను పరిశీలించారు అనంతరం జిల్లా సంక్షేమ అధికారి, బాలల సంక్షేమ సమితి,బాలల పరిరక్షణ విభాగం, శిశుగృహ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాగా శిశు గృహలో  ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వదిలివేయబడిన పిల్లలకు, సరెండర్ చేసిన పిల్లలకు, రక్షణ సంరక్షణ అవసరం ఉన్న పిల్లలకు ఆయా జిల్లాల బాలల సంక్షేమ సమితి వారి ఆదేశాలమేరకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి జె జయంతి తెలియచేసారు. ప్రస్తుతం 11 మంది పిల్లలు ఆశ్రయం పొందుచున్నారని ఒకరికి దత్తత ప్రక్రియకు ఎంపిక కాబడగా మరో ఇద్దరు టైo లైన్ లో ఉన్నారని, మిగతా వారు రక్షణ సంరక్షణ అవసరం ఉన్న పిల్లలని తెలియచేసారు. ప్రస్తుతం ఒకే శిశు గృహలో రెండు యూనిట్లు కొనసాగుచున్నవని దీనివల్ల నిబంధనల ప్రకారం కెపాసిటీ సరిపోదని తెలియచేయగా హనుమకొండ, వరంగల్, జనగాం జిల్లాలను కలిపి హనుమకొండ సెంటర్ పాయింట్ గా ఒక యూనిట్,మహబూబాబాద్ ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను ఒక యూనిట్ గా కలిపి  మహబూబాబాద్ జిల్లాను సెంటర్ పాయింట్ గా చేయాలని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు.

అలాగే వెకెన్సీలో  ఉన్న ఆయా పోస్టుల గురించి రాష్ట్ర సంచాలకులకు తెలియచేసి నియామక ఏర్పాట్లకోసం చర్యలు తీసుకోవాలని

మరియు జిల్లాల్లో లోని జిఎం హెచ్  మదర్ మిల్క్ బ్యాంక్ నుండి శిశు గృహ పిల్లలకు పాలు అందించాలని ఆదేశించారు.

కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె లలితా దేవి,

జిల్లా బాలల సంక్షేమ సమితి ఛైర్పర్సన్ అన్నమనేని అనిల్ చందర్ రావు, సభ్యులు డాక్టర్ పరికీ సుధాకర్, జిల్లా బాలల పరిరక్షణ ఇన్చార్జి అధికారి ఎస్ ప్రవీణ్ కుమార్, ఇన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ అధికారి ఎం మౌనిక, శిశు గృహ మేనేజర్ దూడం నగేష్, సోషల్ వర్కర్ సంగి చైతన్య తదితరులు పాల్గొన్నారు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

హన్మకొండ ;

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో  ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పి. ప్రావీణ్య వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు అందించిన  వినతులను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన  వినతులను పరిశీలించిన కలెక్టర్  సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై నుండి 106 వినతులు  అందినట్లు అధికారులు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్  వెంకట్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి  వై. వి. గణేష్, హనుమకొండ  ఆర్డీవో వెంకటేష్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

హన్మకొండ ;

 జిల్లాలో ఓటర్ జాబితా సవరణ 2024-25 సంబంధించి ప్రణాళికాబద్ధంగా  స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గ్రాడ్యుయేట్ , టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఓటరు రూపకల్పన పై  జిల్లాల కలెక్టర్ లకు  వీడియో సమావేశం ద్వారా శిక్షణ అందించారు.   సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య,  ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో  రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ,  ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు వస్తున్న దరఖాస్తుల విచారణ మిషన్ మోడ్ లో పూర్తి చేయాలని అన్నారు. ఉమ్మడి మెదక్- నిజామాబాద్- అదిలాబాద్- కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల స్థానానికి లక్ష దరఖాస్తులు, టీచర్ల స్థానానికి 2046 దరఖాస్తులు రాగా పట్టభద్రుల 7 వేల దరఖాస్తులు మాత్రమే విచారణ పూర్తి అయ్యాయని ,వరంగల్- ఖమ్మం -నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయుల  స్థానానికి 2730 దరఖాస్తులు వస్తే అన్ని పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. పెండింగ్ ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ నమోదు దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ లకు ఆదేశించారు.  ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలలో పాల్గొనేందుకు అర్హులైన ఓటర్లు తమ పేర్లను ఓటరు జాబితాలో నవంబర్ 6 లోపు నమోదు చేయాలని అన్నారు.ఓటర్ జాబితా సవరణ 2024-25  కోసం  స్వీప్ కార్యక్రమాలు పక్కాగా చేపట్టాలని, దీని కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులు నియమించాలని అన్నారు.  జనవరి 1, 2025 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఓటు హక్కు కల్పించాలని అన్నారు.  యువ ఓటర్ల నమోదు తో పాటు దివ్యాంగులు, థర్డ్ జెండర్, సెక్స్ వర్కర్ మొదలగు వర్గాలు, ఆదివాసీ, గిరిజనుల ఓటర్ల నమోదు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.

ఓటర్ జాబితా రూపకల్పన  పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని, ఏ ఒక్కరిని వదల కుండా ఓటు హక్కు కల్పించాలని అన్నారు. అక్టోబర్ 29న డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల చేయడం జరుగుతుందని, దీనిపై అభ్యంతరాలను, నూతన ఓటర్ నమోదు దరఖాస్తులను నవంబర్ 29 వరకు స్వీకరిస్తామని, డిసెంబర్ 26 వరకు అభ్యంతరాలను పరిష్కరించి జనవరి 6న తుది ఓటర్ జాబితా ప్రచురించాలని తెలిపారు. 

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట రెడ్డి, రెవెన్యూ డివిజన్ అధికారి వెంకటేష్,  సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

హన్మకొండ ;

వరంగల్ నగర పాలక సంస్థ పరిధి లోని వరంగల్ హన్మకొండ కాజీపేట త్రినగరి లో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు  అరగంట పాటు కురిసిన భారీ వర్షం సిటీ ని జలమయం చేసింది. వరంగల్ చౌరస్తా,కృష్ణ కాలని,బట్టలబాజారు,ఎల్లం బాజారు,ములుగు రోడ్డు,అలంకార్ జంక్షన్,హన్మకొండ చౌరస్తా,పబ్లిక్ గార్డెన్,నయీంనగర్ ప్రాంతాలు జలమయం అయ్యాయి. కృష్ణా కాలని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల,హైస్కూలు ప్రాంగణంలో,వరంగల్ చౌరస్తాలో   భారీ వర్షానికి  వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బట్టల బాజారు,ఎల్లం బాజారు వీధుల్లో మురుగు నీరు నిలువ ఉండడం వల్ల మలేరియా డెంగ్యూ వంటి జ్వరాలబారిన పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.బట్టల బాజారు లో వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద వర్షం నీటితో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ములుగు రోడ్డు లోని కాళేశ్వరం వెళ్లే చౌరస్తా,అలంకార్ జంక్షన్ హన్మకొండ చౌరస్తా లో వాహన దారులకు ఇబ్బందులు తప్పలేదు. అధికార యంత్రాంగం వర్షం నీరు రాకుండా నిలచి పోకుండా శాశ్వత పరిష్కారం చూపాలని పట్టణ వాసులు మొత్తుకుంటున్నప్పటికి సరైన ప్రణాళికలు సిద్ధం చేయలేక పోతున్నారు.దీంతో అరగంట వర్షం కురిసినా అవస్థలు పడుతున్నారు. నగర పాలక సంస్థ అధికారులు,జిల్లా కలెక్టర్ లు,ఎమ్మెల్యే ఎంపి లు మంత్రులు శాశ్వత పరిష్కారం చూపాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 హన్మకొండ ;

శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణత్యాగాలు చేసిన  పోలీస్ అమరవీరులు ప్రజల గుండెల్లో చిరస్మరణీయం నిలిచిపోతారని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్కా ర్యాలయములోఅమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే)ను ఘనంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గత ఏడాది నుండి ఇప్పటి వరకు దేశంలో విధినిర్వహణలో మరణించిన 241మంది పోలీస్ అమరవీరుల పేర్లను అదనపు డీసీపీ రవి చదివి వినిపించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డా.సత్య శారద , ప్రావీణ్య, కర్నల్ రవికుమార్ రవి,డిసిపిలు షేక్ ,సలీమా రవీందర్ తో పాటు అదనపు ఏ.సి.పిలు, ఏ.సి.పిలు, ఇన్స్ స్పెక్టర్లు, ఆర్. ఐలు పోలీస్ . అమరవీరుల కుటుంబ సభ్యులు, ఇతర పోలీస్ సిబ్బంది పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పాగుచ్చాలు వుంచి నివాళులు అర్పించిన పిదప, ఆర్.ఐ స్పర్జన్ సారధ్యంలో సాయుధ పోలీసులు 'శోక్ శ్రస్త్  చేసి మరణించిన పోలీసు అమరవీరులకు పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల సేవకోసం తమ ప్రాణాలను ఆర్చించిన పోలీసులు మహనుభావులని, పోలీసు అమరవీరుల చూపిన మార్గదర్శకాన్ని అనుసరిస్తూ, ప్రజల శ్రేయస్సు కోరకు పాటుపడాలని, ప్రజల్లో మంచి పేరు రావాలంటే చిత్తశుద్ధి, నిత్, నీజాయితీతో పనిచేయాల్సి వుంటుందని పోలీసు అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారు ఎల్లప్పుడు మన గుండెల్లోనే వుంటారని, వారు మన మధ్య లేనకున్నా మనం వారిని స్మరిస్తునే వుంటామని, అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవల్సిన భాధ్యత మనందరిపై వుందని, వారికి ఎలాంటి సమస్య వున్న వారికి పోలీస్ విభాగం తరుపున పూర్తి సహకారం అందజేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ కార్యాలయము నుండి మిషన్ హస్పటల్ వరకు నిర్వహించిన ర్యాలీలో పోలీసులు అధికారులు, సిబ్బంది పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులతో పాటు పోలీసు జాగృతి కళాబృందం సభ్యులు పాల్గోని పోలీసు అమరవీరులకు జోహర్లు  అర్పించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ప్రజల  ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి, చట్ట ప్రకారం పరిష్కారానికి చొరవ చూపాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ  కిరణ్ ఖరే  అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో   నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమంలో ఎస్పీ  ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి,వారితో ముఖాముఖి మాట్లాడి ఫిర్యాదు దారుల సమస్యలను తెలుసుకొని, పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఈ క్రమంలో 15 ఫిర్యాదులు అందగా ఫిర్యాదు దారుల అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా తెలియపరిచి చట్ట ప్రకారం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని అదేశించారు. ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని ఎస్పి కిరణ్ ఖరే  పోలీసు అధికారులను ఆదేశించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

రక్తదాతలు ప్రాణదాతలతో సమానమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా ఆర్మూడ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం (పోలీసు ఫ్ల్లాగ్ డే)  పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సహాకారంతో  జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా కలెక్టర్, ఎస్పి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పి కిరణ్ ఖరే   రక్తదానం చేశారు. 

 అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ  మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో లేకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతీ ఒక్కరు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలన్నారు. అలాగే  ప్రజలకు అన్ని వేళలా తోడుగా ఉంటూ పోలీసులు తమ ఉద్యోగాలు చేస్తున్నారని, పోలీసు వృత్తి అనేక వత్తిళ్లతో కూడుకున్నదని, పోలీసులు తమ వృత్తి ధర్మం కోసం తమ కుటుంబాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్నారని కొనియాడారు. కొందరు పోలీసులు తమ కర్తవ్య నిర్వహణలో తమ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎస్పి కిరణ్ ఖరే  మాట్లాడుతూ

అమరవీరుల త్యాగానికి గుర్తుగా రక్తదాన శిబిర కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. రక్తదానం చేస్తే ఆపదలో ఉన్న ఓ ప్రాణాన్ని కాపాడవచ్చునని తెలియజేశారు. ప్రతి వ్యక్తి రక్తదానం చేసే గుణాన్ని ఏర్పరచుకోవాలన్నారు. అనం తరం రక్తదానం చేసిన వారికి ఎస్పి కిరణ్ ఖరే   సర్టిఫికెట్లను అందజే శారు. ఈ రక్తదాన శిబిరంలో 150 యువత, పోలీసులు, వివిధ వర్గాల ప్రజలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ  బోనాల కిషన్, కాటారం సబ్ కలెక్టర్ మాయాంక్ సింగ్, డిఎస్పీలు సంపత్ రావు, రామ్మోహన్ రెడ్డి, నారాయణ నాయక్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ  జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు డాక్టర్ కిరణ్, జిల్లా పరిధిలోని సిఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ఎస్సైలు, ప్రజలు, యువత పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

హనుమకొండ వడ్డేపల్లి సమీపంలో ఇంతకు ముందు వరకు కొనసాగిన ఐనవోలు మండల పరిషత్ కార్యాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య శనివారం పరిశీలించారు. సి.ఇ. కార్యాలయం కోసం ఈ భవనాన్ని కేటాయించేందుకు ఉన్న అవకాశాలను కలెక్టర్ పరిశీలించారు. కార్యాలయం గురించిన వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జడ్పీ డిప్యూటీ సీఈవో రవి, పంచాయతీరాజ్  ఇన్చార్జి ఎస్ఈ శంకరయ్య, ఐనవోలు ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను ఈ నెల 21వ తేదీ నుంచి 31 వరకు నిర్వహిస్తున్నట్లు జయశంకర్ భూపాలపల్లి  జిల్లా ఎస్పీ  కిరణ్ ఖరే  శనివారం  తెలిపారు. విధినిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసులను స్మరించుకునేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ  పేర్కొన్నారు. ఇందులో భాగంగా పోలీసుల విధులు, టెక్నాలజీ వినియోగం, రక్తదాన శిబిరాలు, ఓపెన హౌస్‌, అమరవీరుల కుటుంబాల సందర్శన, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, కొవ్వొత్తుల ర్యాలీ, సైకిల్‌ ర్యాలీ, మరికొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు .తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్‌ భాషల్లో ఇంటర్‌ విద్యార్థుల వరకు 'విచక్షణతో కూడిన మొబైల్‌ ఫోన వాడకం' అంశంపై, డిగ్రీ ఆపై విద్యార్థులకు 'తెలంగాణను డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంతో నా పాత్ర' అనే అంశాలపై, అలాగే పోలీసు అధికారులు, సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.   వ్యాస రచన పోటీల్లో  ఉత్తమ ప్రతిభ చూపిన ముగ్గురికి బహుమతులు అందజేస్తామన్నారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో వివిధ కేటగిరిలో మూడు ఉత్తమ వ్యాసాలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. అలాగే  పబ్లిక్ స్థలాల్లో, పోలీసు అమరవీరుల గురించి తెలుపుతూ వివిధ  కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధి లోని ప్రధాన కూడళ్ళ వద్ద పోలీస్ అమరవీరుల బ్యానర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎస్పీ  తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

హన్మకొండ ;

జిల్లాలలో గ్రూప్స్  పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తూ సన్నద్ధం కావాలని  తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎం. మహేందర్ రెడ్డి గ్రూప్స్ పరీక్షల నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు.

నవంబర్ 17 మరియు 18 తేదీలలో నిర్వహించు గ్రూప్ 3 పరీక్షలు మరియు డిసెంబర్ 15 మరియు 16 తేదీలలో నిర్వహించు గ్రూప్-2 పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో చేయాల్సిన ఏర్పాట్ల, తీసుకోవాల్సిన జాగ్రత్తల పై పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కలెక్టర్లకు పలు సూచనలు జారీ చేశారు.  జిల్లాలలో చేయాల్సిన ఏర్పాట్లకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 

ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రూప్స్ పరీక్షల నిర్వహణకు ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి, అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయో లేవో పరిశీలించాలని, ఈ ప్రక్రియ రేపటి లోగా పూర్తి చేయాలని కమిషన్ చైర్మన్ కలెక్టర్లను ఆదేశించారు. 

పరీక్ష కేంద్రాల ధృవీకరణ పూర్తయిన తర్వాత అభ్యర్థుల వివరాలతో కూడిన ఓ.ఎం.ఆర్ షిట్ల ముద్రణ ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో పరీక్ష ప్రశ్నా పత్రాల, ఇతర ముఖ్యమైన సామాగ్రి భద్రపర్చేందుకు స్ట్రాంగ్ రూమ్ లను గుర్తించాలని అన్నారు.  పరీక్షలు సజావుగా సాగేందుకు వీలుగా జిల్లాలోని ఒక ప్రాంతంలో ఉన్న పరీక్షా కేంద్రాలకు రీజనల్ కోఆర్డినేటర్లను నియమించాలని అన్నారు. 

గ్రూప్ 3 పరీక్షకు 3 పేపర్లు, గ్రూప్ 2 పరీక్ష 4 పేపర్లు పెద్ద ఎత్తున సభ్యులు ఉన్న నేపథ్యంలో రీజనల్ కోఆర్డినేటర్ పరిధిలో స్ట్రాంగ్ రూమ్ గుర్తించాలని అన్నారు.  రీజనల్ కోఆర్డినేటర్ పరిధిలో అభ్యర్థుల సంఖ్య ఆధారంగా  అవసరమైన మేర స్ట్రాంగ్ రూమ్ ఉండాలని అన్నారు. 

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 

 జిల్లాలో  గ్రూప్ 3 పరీక్షకు 83 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 10 మంది సీనియర్ జిల్లా స్థాయి అధికారులను నియమించడం జరిగిందని, పరీక్ష కేంద్రాలు పరిశీలించి వెంటనే, అప్ లోడ్ చేస్తామని, 2 స్ట్రాంగ్ రూమ్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు, ఈ పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్  వివరించారు.

ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, పోలీస్, రెవిన్యూ, సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి,గోదావరిఖని,అక్టోబర్,18(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ)రామగుండం నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ఇన్చార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో సభ్యత్వం.రామగుండం నియోజకవర్గంలో బీజేపీ సభ్యత్వనమోదు ముందంజలో ఉన్నది.కుందనపల్లి,రామగుండం రైల్వే స్టేషన్,గోధావరిఖని లక్ష్మీ నగర్ చౌరస్తాలో పార్టీ సబ్యత్వనమోదు రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు,సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఊహించని స్పందన లభిస్తుందని,దీనితో రాబోయేఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం తధ్యంఅని అన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని దేశీయత,ఆర్థిక స్వావలంబన,ప్రపంచ వేదికపై భారత ప్రతిష్ట వంటి అంశాల్లో మోదీ నాయకత్వం కీలకపాత్ర పోషిస్తోందని మోదీ పథకాలు దేశంలోని ప్రతి వ్యక్తికి మేలు చేస్తాయని,ప్రజలు పెద్దఎత్తున బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకొని మోదీ పథాలను సమర్థిస్తున్నారని,మోదీ స్ఫూర్తితో సభ్యత్వనమోదు విజయవంతమవుతోందని,ప్రజల్లో దేశఅభివృద్ధి పట్ల ఉత్సాహం పెరుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.పార్టీలో సబ్యత్వం తికున్న వారికీ కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ విధానాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో చిలువేరు కుమార్,శ్రీకాంత్,బబ్లు.జన్నంపల్లి కృష్ణారెడ్డి,రాపోలు రవిందర్ రావ్,మేకల రాజమల్లు,ఓరుగంటి శ్రీరాములు,బరిగల శ్రీనివాస్,బరిగెల రాజెంద్ర ప్రసాద్,బుక్యా రాంసింగ్,కలవేణి నర్సింగ్,మేకల కనకమ్మ,దోంతుల భూమయ్య,సిద్ద స్వామి,రవి,చింతక్రింది నాగరాజు పార్టీ నేతలు,కార్యకర్తలు,ప్రజలు తదితరులు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

                                                    పెద్దపల్లి,రామగిరి,కమాన్పూర్,అక్టోబర్18(మేడీ గడ్డటీవీన్యూస్ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ)పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ జంగిలి రమేష్,తల్లి అమృత రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో ఇటీవల మరణించగ వారి కుటుంబాన్ని,కమాన్ పూర్ మండలం కిష్టంపల్లెలో ఆకుల ఎల్లమ్మ లు ఇటీవల మరణించగా వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచి మృతుల చిత్రపటాలకు పూలమాల లేసి నివాళులర్పించారు.మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్...                         *"పార్టీవదేహానికి నివాళులు"*.                      కమాన్పూర్ మండలం గుండారం గ్రామంలో పార్వతీ శంకర్ శుక్రవారం మరణించగా శంకర్ పార్థివ దేహానికి పుష్పాంజలిఘటించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచిన మంథని నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్,పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 పెద్దపల్లి,మంథని,అక్టోబర్17(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ)మంథని మండలం లక్కేపూర్ గ్రామంలో కొంతం శ్రీనివాస్ కాలు ప్యాక్చర్ ఆఐ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న శ్రీనివాసును,.గురువారం,అదే గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న కూర బుచ్చక్క-రాజయ్య దంపతులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకొని ధైర్యంగా ఉండాలని చెప్పినారు,మంథని పట్టణంలోని గొల్లగూడెంలో పరిషవేన మల్లయ్య ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి మృతుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన,మంథని నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్,వారివెంట పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు ఉన్నారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

                                                                                 పెద్దపల్లి,అక్టోబర్17(మే డిగడ్డటీవీన్యూస్ ఛానల్ బూర్ఆఫ్ తెలంగాణ)మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధన దిశగా కృషి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.మహాకవి వాల్మీకి జయంతి పురస్కరించుకొని గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని,జ్యోతి ప్రజ్వలన చేసి,మహాకవి వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడరు.మహాకవి వాల్మీకి హైందవ ధర్మానికి అతిముఖ్యమైన గ్రంథం రామాయణాన్ని రచించారని,రామాయ ణ గ్రంథంద్వారా అనేక విలువలను సమాజానికి అందించారని కలెక్టర్ పేర్కొన్నారు.రామాయణంద్వారా ఆదర్శ మానవుడికి ఉండవలసిన లక్షణాలు,మానవ సంబంధాలు,విలువలను మహాకవి అందరికీ బోధించారని.మహాకవి వాల్మీకి రచించిన రామాయణం కారణంగానే మన దేశంలో కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉందని.నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన వసుదైక కుటుంబం అనే భావన రామాయణంతో ముడీబడి ఉందని.మహాకావ్యం రామాయణాన్ని రచించిన మహాకవి వాల్మీకి జయంతిని పండగగా జరుపుకోవడం సంతోషకరమని కలెక్టర్ తెలిపారు.అనంతరం వక్తలు మహర్షీ వాల్మీకి జీవిత విశేషాలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు,కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్,కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు ప్రకాష్ సునీత,పద్మావతి,కలెక్టరేట్ సిబ్బంది,బీసీ సంఘాల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

హన్మకొండ ;

హనుమకొండ జిల్లాలోని ప్రతి మండలం పరిధిలో ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల కమిటీ సభ్యులు, ఏపీఎంలు, సీసీలు, వీవోఏలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణకు సంబంధించిన వివరాలను ధాన్యం కొనుగోలు కేంద్రాల కమిటీ సభ్యులు, ఏపీఎంలు, వీవోఏలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ డేటా ఎంట్రీ పక్కాగా చేయాలన్నారు. ప్రతి రోజు ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. ప్రతి రైతుకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. సన్న, దొడ్డు రకాల ధాన్యం వివరాలను కరెక్ట్ గా నమోదు చేయాలన్నారు. ఒకవేళ ఒకదానికి బదులుగా మరొకటి నమోదు చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫిగా సాగేటట్టు చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఏపీఎంలు పాటించాల్సిన విధివిధానాలను వివరించారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీవో నాగ పద్మజ, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఉమారాణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్ సింగ్, పౌర సరఫరాల మేనేజర్ మహేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి అనురాధ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

హన్మకొండ ;

హనుమకొండలో  మహర్షి వాల్మీకి జయంతిని హనుమకొండ జిల్లా కలెక్టరేట్  లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి  చిత్రపటానికి జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి  పూల మాల వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ వాల్మీకి గొప్ప మహర్షి అని పేర్కొన్నారు. రామాయణాన్ని రచించిన మహా ముని వాల్మీకి అని అన్నారు. మహర్షి వాల్మీకి ఆచరించిన ఆదర్శాలను మనం ఆచరించాలన్నారు. అదేవిధంగా ఈ సమావేశంలో బోయ వాల్మీక సంఘం నాయకులు అడిగిన అంశాలపై అదనపు కలెక్టర్ స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ పథకాలు దామాషా ప్రకారం వర్తించే విధంగా  కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రామ్ రెడ్డి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, ఇతర జిల్లా అధికారులతో పాటు బోయ వాల్మీకి సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భోగి కృష్ణమూర్తి, జిల్లా అధ్యక్షుడు నిగ్గుల వెంకటప్రసాద్, సంఘం నాయకులు  పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

అమలులోకి వచ్చిన నూతన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో రెవెన్యూ, పోలీస్, విద్య, విద్యుత్, రవాణా, ఎక్సైజ్, పౌర సరఫరాలు, మైనింగ్, యాంటీ నార్కోటిక్స్, వైద్య ఆరోగ్య, తదితర శాఖల ఉన్నతాధికారులతో భారతీయ నూతన న్యాయ చట్టాలు, ఎన్ ఫోర్స్మెంట్, రోడ్డు భద్రత అంశాలపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. 
ఈ సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ అవుతున్న రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. సమస్యలపై దృష్టి సారించేందుకు  మండల, జిల్లాస్థాయిలో అధికారులు సమన్వయ సమావేశాలను నిర్వహించాలన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో  పనిచేయాలన్నారు. 
 ఈ సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నూతనంగా న్యాయ చట్టాలు అమలులోకి వచ్చాయని అన్నారు.  ఐపిసి స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినయం చట్టాలు అమలవుతున్నాయని అన్నారు. ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, సిఆర్పిసి స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, ఐఈఏ స్థానంలో భారతీయ సాక్ష్య అధినయం చట్టాలు అమలులోకి వచ్చాయన్నారు. ప్రస్తుతం సాంకేతికత ఎంతో పెరిగిందన్నారు. పెరిగిన సాంకేతికతతో నేరాలు కూడా పెరుగుతున్నాయి అన్నారు. అదేవిధంగా నూతన చట్టాలలో మహిళలు, చిన్నారుల రక్షణకు, భద్రతకు అనేక అంశాలు పొందుపరిచి ఉన్నాయన్నారు. జాతీయస్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖ సంస్కరణలు, చట్టాల అమలు తీరుపై మంచి పేరు ఉందని అన్నారు. జిల్లాలో అధికారుల సమన్వయం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నియంత్రణకు తోడ్పాటునందించాలన్నారు. 
నూతన న్యాయ చట్టాలపై పోలీస్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.  వివిధ శాఖల అధికారులు ఆయా శాఖల పనితీరు, తీసుకుంటున్న చర్యలపై వివరించారు. 
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్  వెంకట్ రెడ్డి, డీఆర్వో వై. వి. గణేష్, డీసీపీ సలీమా, డీఈఓ వాసంతి, డిఎంహెచ్వో డాక్టర్ లలిత దేవి,  హనుమకొండ, పరకాల ఆర్డీవోలు వెంకటేష్, డాక్టర్ కె. నారాయణ, ఏసీపీలు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

హనుమకొండ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్  ఎ. వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ పై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులు, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్  వెంకట్ రెడ్డి మాట్లాడుతూ  ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద  దొడ్డు,సన్న రకం ధాన్యానికి  సంబంధించిన కనీస మద్దతు ధర తెలిపే విధంగా  బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. దొడ్డు, సన్న రకం ధాన్యాల కొనుగోలుకు  వేరువేరు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. సన్న రకం ధాన్యానికి  ప్రభుత్వం రూ.500లను  బోనస్ ప్రకటించిందని, వాటి కొనుగోలులో  జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.  సన్న రకం ధాన్యాన్ని గుర్తించేందుకు  ధాన్యం కొనుగోలు కేంద్రాలలో  డిజిటల్ మైక్రో కాలిపర్స్, ప్యాడి క్లీనర్స్, డ్రయ్యర్స్ ను కొనుగోలు చేసి అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు చేసిన సన్న రకం  ధాన్యం బస్తాలకు ఎరుపు రంగు దారంతో కుట్లు వేయాలన్నారు. దొడ్డు రకం ధాన్యం సంచులకు  ఆకుపచ్చ  రంగు దారంతో కుట్లు వేయాలన్నారు. సన్నరకం ధాన్యం నింపే కొత్త సంచులను తిరగేసి ధాన్యం నింపిన అనంతరం వాటికి సంబంధించిన వివరాలను సంచులపై ఎస్ గుర్తుతో పాటు సెంటర్ నెంబర్ స్టెన్సిల్తో మార్క్ చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కు సంబంధించి వ్యవసాయ అధికారులు అందించిన టోకెన్ ఆధారంగానే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద  కొనుగోలును  చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఉమారాణి, మేనేజర్ మహేందర్, జిల్లా సహకార అధికారి నీరజ, అసిస్టెంట్ రిజిస్టార్ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ జేడీ రవీందర్ సింగ్, జిల్లా మార్కెటింగ్ అధికారి అనురాధ, ఇతర అధికారులతో పాటు  ఫ్యాక్స్ కార్యదర్శులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల  ఇన్చార్జులు  పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

గ్రామీణ స్థాయి నుండి  అంతర్జాతీయ స్థాయి వరకు  క్రీడల్లో విద్యార్థులు, యువత రాణించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.బుధవారం హనుమకొండ వేయి స్తంభాల దేవాలయం వద్ద నుండి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ వరకు పల్లెల నుండి ప్రపంచ స్థాయి ఛాంపియన్లుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సీఎం కప్-2024 టార్చ్ ర్యాలీని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తో కలిసి జిల్లా కలెక్టర్  ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారుల ప్రతిభను  ప్రపంచ స్థాయి వరకు  రాణించే విధంగా  రాష్ట్ర ప్రభుత్వం  సీఎం కప్ ను నిర్వహిస్తుందన్నారు. త్వరలో ప్రారంభమయ్యే సీఎం కప్ పోటీలలో  గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వివిధ క్రీడాంశాలలో క్రీడాకారులు రాణించి  అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రతిభను చాటాలన్నారు. ఈ సందర్భగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్  ఝా మాట్లాడుతూ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు  ప్రభుత్వం సీఎం కప్ పోటీలను నిర్వహిస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు యువత సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. వరంగల్ నుండి వచ్చిన సీఎం కప్ టార్చ్ ను  జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, జిల్లా యువజన, క్రీడల అధికారి గుగులోత్  అశోక్ కుమార్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎండి అజీజ్ ఖాన్, తదితరులు  స్వీకరించి  వేయి స్తంభాల గుడి వద్ద నుండి అధిక సంఖ్యలో తరలి వచ్చిన క్రీడాకారులు, క్రీడాభిమానులు, యువకులు సీఎం కప్ టార్చ్ తో ర్యాలీగా హనుమకొండ కలెక్టరేట్ వైపు  బయలుదేరారు.  ఈ ర్యాలీ  వేయి స్తంభాల  దేవాలయం వద్ద నుండి  హనుమకొండ చౌరస్తా, పోలీస్ కమిషనరేట్ జంక్షన్, అంబేద్కర్ జంక్షన్, కాళోజీ జంక్షన్, వరంగల్ కలెక్టరేట్, అదాలత్ మీదుగా హనుమకొండ జిల్లా కలెక్టరేట్ వరకు సాగింది. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ వద్ద సీఎం కప్  టార్చ్ ను  జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, తదితరులు అందుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్  వెంకట్ రెడ్డి మాట్లాడుతూ  పల్లె నుంచి ప్రపంచ స్థాయి వరకు క్రీడాకారులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో  సీఎం కప్ 2024  పై అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా  టార్చ్ ర్యాలీ  నిర్వహిస్తుందని అన్నారు. సీఎం కప్ టార్చ్ ర్యాలీ హనుమకొండ జిల్లాకు చేరుతుందని, ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, విద్యార్థులు, క్రీడాభిమానులు పాల్గొనడం  చాలా సంతోషకరంగా ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించే విధంగా  ప్రోత్సహించాలన్నారు. సీఎం కప్ టార్చ్  ర్యాలీ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక కళాకారులు పలు గీతాలను ఆలపించి ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో  స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అధికారులు ఏ. ఎన్.కె గోకుల్, మధు, రతన్ బోస్, తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి సారంగపాణి, అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి వరద రాజేశ్వర్ రావు,  రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి పవన్ కుమార్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రమేష్ రెడ్డి, ఖో ఖో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి  శ్యామ్, వరంగల్ నీట్  ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ రవికుమార్, కేయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపల్ ఎ. టి. బి. టీ. ప్రసాద్, పలువురు  పోలీస్ అధికారులు, ట్రైనీ కానిస్టేబుళ్ళు పాల్గొన్నారు.