- హన్మకొండ ;
హనుమకొండ జిల్లా పరిధిలోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో స్వీప్ ఆధ్వర్యంలో నూతన ఓటర్ల నమోదు కోసం విస్తృతంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎ. వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో స్వీప్ ఆధ్వర్యంలో నిర్వహించే యాక్షన్ ప్లాన్లో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నవంబర్ 1వ తేదీ నుండి 26 వ తేదీ వరకు స్వీప్ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబరు ఒకటో తేదీన ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా కళాశాలల్లో 18 ఏళ్లు నిండిన యువత ఓటరు గా నమోదయ్యేందుకు కార్యక్రమం, క్యాంపస్ అంబాసిడర్లకు శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు.
నవంబర్ 2వ తేదీన నెహ్రూ యువ కేంద్ర, ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో ఓటరు నమోదు కార్యక్రమం ఉంటుందన్నారు.
7వ తేదీన గిరిజన గ్రామాలలో ఓటర్ నమోదు కార్యక్రమం,
8వ తేదీన మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఓటర్ నమోదు కార్యక్రమం, రంగోలి మెహందీ కార్యక్రమాలు,
12వ తేదీన భావి ఓటర్లైన పాఠశాల, కళాశాలల విద్యార్థులతో ఎలక్ట్రోరల్ లిటరసీ క్లబ్ సమావేశాలు,
19వ తేదీన చునావా పాఠశాల మరియు మీ బిఎల్ ఓ గురించి తెలుసుకోండి కార్యక్రమాలు
కంప్లీట్ 26వ తేదీన ఓటరు చైతన్యంపై ర్యాలీ, 2కె రన్, మానవహారం కార్యక్రమాలు ఉంటాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో విద్యాలత, ఆర్డీవో నారాయణ, సిపిఓ సత్యనారాయణరెడ్డి, జిల్లా ఖజానాధికారి, స్వీప్ నోడల్ అధికారి శ్రీనివాస్ కుమార్, ఎలక్షన్ విభాగం సూపరింటెండెంట్ ప్రసాదరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: