హన్మకొండ ;

విద్యార్థులకు పోలీసు  వీధుల పట్ల అవగాహన కోసమే ఓపెన్ హౌజ్ కార్యక్రమం నిర్వహిస్తు న్నట్లు జయశంకర్ భూపాలపల్లి  జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే   తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ (ఫ్లాగ్ డే) వారోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో  పోలీసు శాఖ ఆధ్వర్యంలో  ఓపెన్‌హౌస్‌ కార్యక్రమం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఎస్పి కిరణ్ ఖరే  పాల్గొని, ఓపెన్ హౌస్ కార్యక్రమం ప్రారంభించారు.  భూపాలపల్లి పట్టణానికి చెందిన దాదాపు 500 మంది,

ప్రభుత్వ,  ప్రైవేటు పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు  ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పి కిరణ్ ఖరే  స్వయంగా పిల్లలకు పోలీసులు ఉపయోగించే ఆయుధాల గురించి,  బీడీ టీమ్ ఎక్విప్మెంట్, నూతన  చట్టాల గురించి, షీ టీమ్స్, భరోసా సెంటర్స్ గురించి, కమ్యూనికేషన్ సిస్టం గురించి, ఫింగర్ ప్రింట్ డివైస్ ల వల్ల కలిగే ఉపయోగాల గురించి, డాగ్ స్క్వాడ్,  ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి  మరియు సైబర్ నేరాల గురించి వివరించారు.

అనంతరం ఎస్పి  మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల లో భాగంగా భూపాలపల్లి జిల్లా పరిధిలో  పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని,  ఓపెన్ హౌస్ కార్యక్రమం లో భాగంగా,  విద్యార్థిని విద్యార్థులకు ఆయుధాలు, షీ టీమ్స్, ట్రాఫిక్, పోలీస్ విధులు, ఫింగర్ ప్రింట్స్, కమ్యూనికేషన్ సిస్టమ్, డాగ్ స్క్వాడ్ మరియు ప్రజల రక్షణ కోసం పోలీసులు  చేస్తున్న  విధుల గురించి అవగాహనా కల్పించడం జరిగిందన్నారు. అదేవిదంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి, రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని, సైబర్ నేరాల వలలో పడకుండా తీసుకోవలసిన జాగ్రత్త చర్యల గురించి  విద్యార్థినీ విద్యార్థులకు వివరించారు. సైబర్ నేరాలు, సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయో,సైబర్ నేరం జరగగానే 1930  టోల్ ఫ్రీ నెంబర్ ల గురించి విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని పేర్కొన్నారు.  నూతన చట్టాలు, పోలీసులు  ప్రజలకు అందిస్తున్న సేవలు గురించి వివరించారు. విద్యార్థినీ విద్యార్థులకు కమ్యూనికేషన్ మ్యాన్ ప్యాక్, విహెచ్ఎఫ్ సెట్ ల గురించి అవగాహన, కల్పించడంతో పాటు,  బాలికలు మరియు మహిళల రక్షణకు ఏర్పాటుచేసిన  భరోసా కేంద్రం, షీ టీమ్స్ పని తీరు, పోలీసు శాఖకు సంబంధించిన వివిధ యాప్ ల గురించి అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల గురించి, డయల్ 100,  గురించి కూడా అవగాహన కల్పించారు. 

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి (ఆపరేషన్) బోనాల కిషన్, భూపాలపల్లి డిఎస్పి సంపత్ రావు, భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నగేష్, కిరణ్,  రత్నం, శ్రీకాంత్, ఆర్ఎస్ఐలు,, జిల్లా పరిధిలోని ఎస్సైలు పాల్గొన్నారు. వివిధ పాఠశాల కళాశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: