పెద్దపల్లి,మంథని,కొయ్యూరు,అక్టోబర్,25(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్ బ్యూరోఆఫ్ తెలంగాణ)పదేండ్లు స్వేచ్చగా మహనీయులను పూజించుకున్నాం.విగ్రహాలు అవిష్కరిస్తమంటే ఆంక్షలు పెడుతుండ్లు అట్టడుగు వర్గాలు అభివృద్ది చెందితేనే రాజ్యాంగం అమలైనట్లు!.మహనీయుల ఆశయాలను కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలే..మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌..మహనీయుల చరిత్రను నిలబెడతాం..అట్టడుగు వర్గాలనుంచి ఎమ్మెల్యే అయితే ఐదేండ్లు అవమానించారని,తమను అవమానించినా ఇబ్బందులకు గురిచేసినా పట్టించుకోమని కానీ మహనీయులను అవమానిస్తే మాత్రం ఉపేక్షించేది లేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ స్పష్టం చేశారు.శుక్రవారం మల్హర్‌ మండలం కొయ్యూర్‌ ప్రధాన కూడలిలో భుపాలపల్లి జిల్లా ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం ఆధ్వర్యంలో విగ్రహా దాత పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఏర్పాట చేసిన కొమురంభీం విగ్రహాన్ని ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ,భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని లతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడరు,అనేక ఏండ్ల క్రితమే మహనీయులు మనకోసం అనేక పోరాటాలు,త్యాగాలు చేశారని ఆయన గుర్తు చేశారు.మహనీయుల చరిత్ర తెలుసుకోకపోవడం మూలంగానే మన హక్కులు సాదించుకోలేకపోతున్నామన్నారు.పదేళ్ల క్రితమే మంథని నియోజకవర్గంలో కొమురంభీం విగ్రహాన్ని అవమానించి పోలీస్‌స్టేషన్‌లో పెట్టారని,అదే నియోజకవర్గంలో ఈనాడు ఘనంగా విగ్రహ ఆవిష్కర చేసుకుంటున్నామని అన్నారు.అడవిని నమ్ముకుని అడవిలోనే బ్రతుకుతున్న ఆదివాసుల హక్కులను బ్రతుకులను ఆగము చేసిన కాంగ్రెస్ పార్టీ!.దాన్ని ఆచరిస్తున్న బిజెపి పార్టీ.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్ల పాటు మహనీయులను స్వేచ్చగా పూజించుకున్నామని ఈనాడు కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో మహనీయుల విగ్రహాల ఆవిష్కరణకు ఆంక్షలు పెడుతున్నారని ఆయన అన్నారు.తాము తమ కుటుంబసభ్యుల విగ్రహాలు పెట్టడం లేదని,అట్టడుగు వర్గాల కోసం త్యాగాలు చేసిన మహనీయుల విగ్రహాలు మాత్రమే పెడుతున్నామని,అలాంటి మహనీయుల విగ్రహాల ఆవిష్కరణలకు అనేక అడ్డంకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.తాను మహనీయుల చరిత్రను చాటి చెప్పాలనే సంకల్పంతో మహనీయుల జన్మస్థలాలు,పుణ్యస్థలాల సందర్శనకు శ్రీకారం చుట్టానని,ఈ క్రమంలొ మొట్టమొదటగా కొమురంభీం ఆసిఫాబాద్‌ వెళ్లగా అక్కడ కోవ లక్ష్మక్క జోడేఘాట్‌కు తీసుకెళ్లి కొమురంభీంను దర్శించుకున్నట్లు ఆయన తెలిపారు.రాజ్యాంగ నిర్మాత మనదేవుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఎన్నో హక్కులు కల్పించాడని,ఆ హక్కులను కాలరాసినోళ్లే ఈనాడు ఆగం ఆగం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.ఆనాడు పంట పండించి చేతికందే సమయంలో బ్రిటిష్‌ వాళ్లు వచ్చి పంటను తీసుకుపోతుంటే ఎదురొడ్డి పోరాటం చేసిన గొప్ప మహనీయుడు కొమురంభీం అని ఆయన వివరించారు.ఇలా ఎంతో మంది అట్టగుడు అణగారిన వర్గాల కోసం పోరాటాలు చేశారని,నాటి నుంచి నేటి తెలంగాణ సాధించుకునే ఉద్యమం వరకు మహనీయుల స్పూర్తి ఉందన్నారు.మంథని ఎమ్మెల్యేగా తాను పోటీ చేసి ఓడిపోతే తనపని అయిపోయిందని,తాను ఇక ఇక్కడి నుంచి పారిపోతానని ప్రచారం చేశారని,కానీ మహనీయులు ఉన్నన్నిరోజులు పుట్ట మధు ఉంటాడని ఆయన స్పష్టం చేశారు.ఆనాడు అంబేద్కర్‌ను అవమానించినోళ్లు ఈనాడు రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరుగుతున్నారని,అదే విధంగా మంథనిలో సైతం రాజ్యాంగం పుస్తకం పట్టుకుని తిరిగే వరకు పోరాటం ఆగదని.గిరిజన ప్రాంతాల్లో ఉన్న చైతన్యం మన ప్రాంతాల్లో లేదని,కేవలం అక్కడ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఉండటమేనని ఆయన అన్నారు.ఏఅవకాశం వచ్చినా గిరిజనుల్లోని తెగలను గొప్పగా అభివృద్ది చేసే ప్రయత్నం చేస్తానని ఆయన పేర్కొన్నారు.పోలీసులు సైతం తమపై ఒత్తిడిలు,ఆంక్షలు పెట్టవద్దని,మాజీ ఎంపీటీసీ స్వర్గీయ మేకల లింగయ్య విగ్రహం ఏర్పాటు చేస్తామంటే అడ్డు చెప్తున్నారని,కాంగ్రెస్‌ పార్టీ జెండా మోసి పార్టీ కోసం పనిచేసిన మేకల లింగయ్య విగ్రహ ఏర్పాటుకు కాంగ్రెస పార్టీ నాయకులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.ఎస్సీ ఎస్టీ బీసీలుఅభివృద్ది చెందితేనే నిజమైన రాజ్యాంగం అమలు అయినట్లుఅని,75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నామని,ఇంకా అణగారిన వర్గాలు మాత్రం అభివృద్ది చెందలేదని ఆయన అన్నారు.మహనీయుల చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని,చరిత్ర తెలుసుకుంటేనే అభివృద్ది చెందుతామని,ఇందుకోసం తాము పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: