హన్మకొండ ;
హనుమకొండ కేయూ క్రాస్ రోడ్డు సమీపంలోని ప్రభుత్వ ఛాతి, క్షయ వ్యాధుల అసుపత్రిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఓపి విభాగంతో పాటు మేల్, ఫిమేల్ వార్డులు, ఆర్ఐసీయూ, బ్రాంకోస్కోపీ రూమ్, సెమినార్ హాల్ ను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి సంబంధించి అందిస్తున్న వైద్య సేవలు, కావాల్సిన సదుపాయాలను గురించి ఎమ్మెల్యే, కలెక్టర్ ఆసుపత్రి ఇంచార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి భవనానికి పునరుద్ధరణ చర్యలు, ఇతర మరమ్మతు పనులు చేయించాలని, పలు సదుపాయాలు కల్పించాలని వైద్యులు సిబ్బంది కోరగా ఆసుపత్రి అభివృద్ధికి కావాల్సిన ప్రతిపాదనలు పంపించాలని ఎమ్మెల్యే, కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని లలితాదేవి, రెవిన్యూ డివిజనల్ అధికారి వెంకటేష్, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: