హన్మకొండ ;
హనుమకొండలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు పెండింగ్ లో ఉండకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను గురించి సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులలో ఏవైనా పెండింగ్ ఉన్నట్లయితే వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎంపీడీవోలు, ఎంఈవోలు, ఏఈలు రెగ్యులర్ గా పాఠశాలలను సందర్శించి విద్యుత్తు, తాగునీటి సరఫరా, టాయిలెట్స్ నిర్మాణ పనులు పూర్తయ్యాయా లేదా అనేది తనిఖీ చేయాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన తాగునీటీ సరఫరా, విద్యుత్తు, టాయిలెట్స్ నిర్మాణ పనులు ప్రతి పాఠశాలలో వంద శాతం పూర్తి కావాలన్నారు. అనవసరమైన పనులు కాకుండా ప్రాధాన్యత కలిగిన పనులనే చేపట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వంద శాతం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం విద్యార్థులకు అందించేలా ప్రధానోపాధ్యాయులకు ఎంఈవోలు తెలియజేయాల న్నారు.
ఈ సమావేశంలో డీఈవో వాసంతి, జిల్లా పరిషత్ సీఈవో విద్యాలత, డిఆర్డివో నాగ పద్మజ, సిపిఓ సత్యనారాయణ రెడ్డి, ఆర్ అండ్ బి ఈఈ సురేష్ బాబు, ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ ఏఈలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: