హన్మకొండ ;
హనుమకొండ జిల్లాలో రోడ్డు భద్రతకు సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, జిల్లా రోడ్డు భద్రత కమిటీ ఛైర్మన్ పి. ప్రావీణ్య వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ (డి.ఆర్.ఎస్.సి) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ, పోలీస్, రవాణా, మున్సిపల్, ఆర్టీసీ, జాతీయ రహదారులు, వైద్య ఆరోగ్యశాఖ, తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొని రోడ్డు భద్రతకు తీసుకుంటున్న చర్యల గురించి సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలు చోటు చేసుకున్న ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్డు నిర్మాణాల పనులను 15 రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. వరంగల్ ఎన్ఐటీ తో ఎన్జీవో సంస్థ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ఈఈ సురేష్ బాబు, డీసీపీలు రవీందర్, సలీమా, ఏసీపీలు కిషోర్ కుమార్, దేవేందర్ రెడ్డి, తిరుమల్,సత్యనారాయణ,ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: