హన్మకొండ ;
ఆరోగ్యవంత మైన జీవనశైలి లో భాగంగా గర్భిణులు, బాలింతలు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడంతో పాటు యోగ, ధ్యానాన్ని అలవర్చుకునే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. మంగళవారం వరంగల్ కాకతీయ వైద్య కళాశాల సమావేశ మందిరంలో ఆర్య జనని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లకు క్షేత్రస్థాయిలో గర్భిణులు, బాలింతలకు కల్పించాల్సిన అవగాహన కార్యక్రమాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఆరోగ్యవంతంగా ఉండేందుకు గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడే యోగ, ధ్యానం ఆసనాలతోపాటు తీసుకోవాల్సిన పౌష్టికాహారం గురించి ఐసిడిఎస్ సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పౌష్టికాహారం, యోగ, ధ్యాన ఆసనాలు, ఇతర ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన వివిధ అంశాలను గురించి ఐసిడిఎస్ సూపర్వైజర్లు మండల స్థాయిలో అంగన్వాడి టీచర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించే విధంగా ఈ శిక్షణ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. మూడు పద్ధతులను గర్భిణీ స్త్రీలు పాటించడం వలన శ్రేష్టమైన సంతానం కలుగుతుందని అన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి జయంతి, ఆర్యజనని అధ్యక్షులు అనుపమ రెడ్డి అంగన్‌వాడీ టీచర్లు ఐసిడిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: