హన్మకొండ ;
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అనుబంధ సంస్థ ప్రత్యేక దత్తత విభాగం శిశు గృహను మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య సందర్శించారు. ఈ సందర్భంగా వసతులను పరిశీలించారు అనంతరం జిల్లా సంక్షేమ అధికారి, బాలల సంక్షేమ సమితి,బాలల పరిరక్షణ విభాగం, శిశుగృహ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాగా శిశు గృహలో ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వదిలివేయబడిన పిల్లలకు, సరెండర్ చేసిన పిల్లలకు, రక్షణ సంరక్షణ అవసరం ఉన్న పిల్లలకు ఆయా జిల్లాల బాలల సంక్షేమ సమితి వారి ఆదేశాలమేరకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి జె జయంతి తెలియచేసారు. ప్రస్తుతం 11 మంది పిల్లలు ఆశ్రయం పొందుచున్నారని ఒకరికి దత్తత ప్రక్రియకు ఎంపిక కాబడగా మరో ఇద్దరు టైo లైన్ లో ఉన్నారని, మిగతా వారు రక్షణ సంరక్షణ అవసరం ఉన్న పిల్లలని తెలియచేసారు. ప్రస్తుతం ఒకే శిశు గృహలో రెండు యూనిట్లు కొనసాగుచున్నవని దీనివల్ల నిబంధనల ప్రకారం కెపాసిటీ సరిపోదని తెలియచేయగా హనుమకొండ, వరంగల్, జనగాం జిల్లాలను కలిపి హనుమకొండ సెంటర్ పాయింట్ గా ఒక యూనిట్,మహబూబాబాద్ ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను ఒక యూనిట్ గా కలిపి మహబూబాబాద్ జిల్లాను సెంటర్ పాయింట్ గా చేయాలని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు.
అలాగే వెకెన్సీలో ఉన్న ఆయా పోస్టుల గురించి రాష్ట్ర సంచాలకులకు తెలియచేసి నియామక ఏర్పాట్లకోసం చర్యలు తీసుకోవాలని
మరియు జిల్లాల్లో లోని జిఎం హెచ్ మదర్ మిల్క్ బ్యాంక్ నుండి శిశు గృహ పిల్లలకు పాలు అందించాలని ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె లలితా దేవి,
జిల్లా బాలల సంక్షేమ సమితి ఛైర్పర్సన్ అన్నమనేని అనిల్ చందర్ రావు, సభ్యులు డాక్టర్ పరికీ సుధాకర్, జిల్లా బాలల పరిరక్షణ ఇన్చార్జి అధికారి ఎస్ ప్రవీణ్ కుమార్, ఇన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ అధికారి ఎం మౌనిక, శిశు గృహ మేనేజర్ దూడం నగేష్, సోషల్ వర్కర్ సంగి చైతన్య తదితరులు పాల్గొన్నారు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: