గ్రామీణ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడల్లో విద్యార్థులు, యువత రాణించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.బుధవారం హనుమకొండ వేయి స్తంభాల దేవాలయం వద్ద నుండి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ వరకు పల్లెల నుండి ప్రపంచ స్థాయి ఛాంపియన్లుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సీఎం కప్-2024 టార్చ్ ర్యాలీని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారుల ప్రతిభను ప్రపంచ స్థాయి వరకు రాణించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ ను నిర్వహిస్తుందన్నారు. త్వరలో ప్రారంభమయ్యే సీఎం కప్ పోటీలలో గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వివిధ క్రీడాంశాలలో క్రీడాకారులు రాణించి అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రతిభను చాటాలన్నారు. ఈ సందర్భగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వం సీఎం కప్ పోటీలను నిర్వహిస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు యువత సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. వరంగల్ నుండి వచ్చిన సీఎం కప్ టార్చ్ ను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, జిల్లా యువజన, క్రీడల అధికారి గుగులోత్ అశోక్ కుమార్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎండి అజీజ్ ఖాన్, తదితరులు స్వీకరించి వేయి స్తంభాల గుడి వద్ద నుండి అధిక సంఖ్యలో తరలి వచ్చిన క్రీడాకారులు, క్రీడాభిమానులు, యువకులు సీఎం కప్ టార్చ్ తో ర్యాలీగా హనుమకొండ కలెక్టరేట్ వైపు బయలుదేరారు. ఈ ర్యాలీ వేయి స్తంభాల దేవాలయం వద్ద నుండి హనుమకొండ చౌరస్తా, పోలీస్ కమిషనరేట్ జంక్షన్, అంబేద్కర్ జంక్షన్, కాళోజీ జంక్షన్, వరంగల్ కలెక్టరేట్, అదాలత్ మీదుగా హనుమకొండ జిల్లా కలెక్టరేట్ వరకు సాగింది. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ వద్ద సీఎం కప్ టార్చ్ ను జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, తదితరులు అందుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పల్లె నుంచి ప్రపంచ స్థాయి వరకు క్రీడాకారులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం కప్ 2024 పై అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా టార్చ్ ర్యాలీ నిర్వహిస్తుందని అన్నారు. సీఎం కప్ టార్చ్ ర్యాలీ హనుమకొండ జిల్లాకు చేరుతుందని, ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, విద్యార్థులు, క్రీడాభిమానులు పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించే విధంగా ప్రోత్సహించాలన్నారు. సీఎం కప్ టార్చ్ ర్యాలీ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక కళాకారులు పలు గీతాలను ఆలపించి ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అధికారులు ఏ. ఎన్.కె గోకుల్, మధు, రతన్ బోస్, తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి సారంగపాణి, అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి వరద రాజేశ్వర్ రావు, రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి పవన్ కుమార్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రమేష్ రెడ్డి, ఖో ఖో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శ్యామ్, వరంగల్ నీట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ రవికుమార్, కేయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపల్ ఎ. టి. బి. టీ. ప్రసాద్, పలువురు పోలీస్ అధికారులు, ట్రైనీ కానిస్టేబుళ్ళు పాల్గొన్నారు.
Home
Unlabelled
గ్రామీణ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలి సీఎం కప్ టార్చ్ ర్యాలీ ప్రారంభోత్సవంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య..
Post A Comment: