ప్రజల ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి, చట్ట ప్రకారం పరిష్కారానికి చొరవ చూపాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమంలో ఎస్పీ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి,వారితో ముఖాముఖి మాట్లాడి ఫిర్యాదు దారుల సమస్యలను తెలుసుకొని, పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఈ క్రమంలో 15 ఫిర్యాదులు అందగా ఫిర్యాదు దారుల అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా తెలియపరిచి చట్ట ప్రకారం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని అదేశించారు. ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని ఎస్పి కిరణ్ ఖరే పోలీసు అధికారులను ఆదేశించారు.
Post A Comment: