ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ జిల్లాలో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే( సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) ను పకడ్బందీగా నిర్వహించేం దుకు అధికారులు కృషి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.
మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే మార్గదర్శకాల పై వివిధ శాఖల అధికారులు, జిల్లాలోని మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎంపీఎస్ వోలతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే ( సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)ను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పకడ్బందీగా జరగాలన్నారు. సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే కోసం మండలానికి ప్రత్యేక అధికారులుగా ఉన్న జిల్లాస్థాయి అధికారులతో పాటు ఎంపీడీవో, ఇతర అధికారుల పర్యవేక్షణలో ఎన్యుమరేటర్ల ద్వారా సర్వే జరుగుతుందన్నారు. ప్రతి గ్రామం, వార్డులలో ఎన్యుమరేషన్ బ్లాక్ ల ప్రకారం సర్వే జరుగుతుందన్నారు. బుధవారం మండల స్థాయిలో సర్వేకు సంబంధించి వివిధ అంశాలను తెలియజేసేందుకు ఎన్యుమారేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే మార్గదర్శకాల పై శిక్షణ పొందిన అధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ కార్యక్రమంలో అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జెడ్పి సీఈవో విద్యాలత, పరకాల ఆర్డిఓ డాక్టర్ కె. నారాయణ, సిపిఓ సత్యనారాయణరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, డిపిఓ లక్ష్మీ రమాకాంత్, కాజీపేట డిప్యూటీ కమిషనర్ రవీందర్, పరకాల మున్సిపల్ కమిషనర్ నరసింహ, ఇతర అధికారులతో పాటు మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపి వోలు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: