ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 





హన్మకొండ ;

రాష్ట్ర ప్రభు


త్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించాలని  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు.మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు  మధిర తహసిల్దార్ కార్యాలయం నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై సమీక్షించారు.

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు తయారు చేసిన ప్రణాళిక,  సర్వే ఉద్దేశం, జిల్లా స్థాయిలో కలెక్టర్ లు తీసుకోవాల్సిన చర్యలు మొదలగు అంశాలను ఉప ముఖ్యమంత్రి వివరించారు. 

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (సామాజిక ,ఆర్థిక ,విద్య ,ఉపాధి, రాజకీయ, కుల సర్వే ) నిర్వహణ విధి విధానాలను క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించామని అన్నారు.ఈ సర్వేలో ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి రాజకీయ, కుల వివరాలను సేకరిస్తామని అన్నారు. 

ప్రజా ప్రభుత్వం ఉన్నతమైన ఆలోచనతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపడుతుందని, తీసి ఎస్సీ ఎస్టీ ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వివిధ సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ అవకాశాల వారికి మెరుగుపరచడానికి తగిన ప్రణాళికలు తయారు చేసేందుకు ఈ సర్వే ఉపయోగిస్తామని ఉప ముఖ్యమంత్రి అన్నారు.

 ప్రజా ప్రభుత్వం చేపట్టే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లక్షల మంది జీవితాల్లో మార్పు తీసుకుని వస్తుందని, అధికారులు వివరాలను సేకరించే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని అన్నారు.ప్రతి ఇంటి నుంచి వివరాలు సేకరణ జరగాలని, దానికి తగిన విధంగా ప్లాన్ తయారు కావాలని అన్నారు. 

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు అవసరమైన ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్ లను గుర్తించి వారికి అవసరమైన శిక్షణ అందించాలని,  గ్రామం మండల జిల్లా సాయి ప్రభుత్వ అధికారులను ఎంపిక చేయాలని, సి.ఆర్.పీ, గెస్ట్ టీచర్ల సేవలు తీసుకోవచ్చని  అన్నారు. 

150 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్ ఉండేలా ఈబీ మ్యాప్ లను అప్ డేట్ చేయాలని,  ఎన్యుమరేటర్ కు నిర్దిష్టమైన ఎన్యుమరేషన్ బ్లాక్ (ఈబీ) కేటాయించాలని, 10 ఈబీ బ్లాక్ లకు డేటా సేకరణ పర్యవేక్షణకు సూపర్వైజర్ ఉండాలని, సూపర్ వైజర్ 10% ఇండ్లను ర్యాండం గా ఎంచుకొని డేటా వివరాలు తనకి చేయాలని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారులు నోడల్ అధికారిగా నియమించాలని, ఇలాంటి పెద్ద స్థాయి సర్వేలలో గత అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని,   ఎన్యుమరేటర్ సూపర్వైజర్ లకు అవసరమైన శిక్షణ అందించాలని అన్నారు.సర్వే నిర్వహణకు అవసరమైన ఫారంలు మార్గదర్శకాలు ముద్రణ స్టేషనరీ ఏర్పాట్లు చేయాలని, ఇండ్ల జాబితా చేపట్టాలని అన్నారు.

సర్వే షెడ్యూల్ వివరాలు ప్రజలకు చేరేలా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, నవంబర్ 6 నుంచి సర్వే ప్రారంభించాలని, సర్వే చేస్తున్న సమయంలో కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు ధరణి పాస్ పుస్తకాలు కుటుంబం దగ్గర ఉంచుకునేలా విరుద్ధంగా ప్రచారం చేయాలని అన్నారు. సర్వే వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసేందుకు డాటా ఎంట్రీ ఆపరేటర్లను  గుర్తించాలని అన్నారు.

ఎన్యుమరేషన్ సమయంలో కుటుంబం యజమానికి వారి వద్ద నుంచి సేకరించే సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని తెలియజేయాలని, నింపిన షెడ్యూల్ ఫారం లోని జాగ్రత్తగా భద్రపరచాలని, ఈ డేటా ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదని తెలిపారు. రోజువారి సర్వే పూర్వకతిని జిల్లా వారీగా ఏరోజుకారోజు సాయంత్రం 6 గంటలకు తెలియజేయాలని అన్నారు.

సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.జిల్లా కలెక్టర్ ల బాధ్యతలు స్పష్టంగా తెలియజేసామని,  ఏ ఇండ్లు మిస్ కాకుండా ఇండ్ల జాబితా ప్రక్రియ పూర్తి చేయాలని, షెడ్యూల్ రూపకల్పన, స్టీకర్, అవసరమైన సామాగ్రి సేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు.

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు అవసరమైన ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ నియామకం జరగాలని, వీరికి జిల్లా స్థాయిలో అవసరమైన శిక్షణ అందించాలని, ప్రజల వివరాలకు గోపిక పాటించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ఎన్యుమరేటర్లకు స్పష్టమైన ఆదేశాలు అందించాలని సీఎస్ సూచించారు.

సిద్దిపేట నుంచి పాల్గొన్న రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ చరిత్రలో నిలిచిపోయే ప్రక్రియ అవుతుందని అన్నారు. సర్వే నిర్వహణ పై శాసనసభ తీర్మానం ప్రవేశపెట్టి, క్యాబినెట్ లో ఆమోదం పొంది సంబంధిత ఉత్తర్వులు జారీ చేశామని అన్నారు.

ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్ సిద్ధం చేయాలని అన్నారు. సర్వే ప్రక్రియ పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు.  సూపర్వైజర్ లు సర్వే వివరాలు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ క్రాస్ చెక్ చేసుకోవాలని అన్నారు. సీఎస్ నుంచి క్షేత్రస్థాయి అధికారి వరకు సమన్వయంతో పని చేస్తూ ఏ తప్పులు లేకుండా సర్వే నిర్వహించాలని, దేశానికే రోల్ మోడల్ విధంగా మన పని తీరు ఉండాలని అన్నారు.

నల్గొండ నుంచి పాల్గొన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సర్వే నిర్వహణ షెడ్యూల్ ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు.  సర్వే పూర్తి చేసిన ఇంటికీ స్టిక్కర్ అంటించాలని అన్నారు. నవంబర్ 6 నుంచి సర్వే ప్రారంభమవుతుందని, నవంబర్ నెల చివరి వరకు ప్రతి ఇంటి సర్వే పూర్తిచేసే వివరాలు ఆన్ లైన్ లో పక్కాగా నమోదు చేయాలని అన్నారు. 

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఎన్యుమరేటర్ లతో ఇంటింటి సర్వే నిర్వహించడం ఎంత ముఖ్యమో,  ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి డాటా ఎంట్రీ వివరాలను తప్పులు లేకుండా ఎంట్రీ చేయడం అంతే ముఖ్యమని  అన్నారు. 

అనంతరం ధాన్యం కొనుగోలు పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షిస్తూ జిల్లాలలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో వెంటనే ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు.జిల్లాలో వచ్చే దాన్యం దిగుబడి, అందుబాటులో ఉన్న గోడౌన్ సామర్థ్యం మేరకు అవసరమైతే ఇంటర్మీడియట్ గోడౌన్లను సిద్ధం చేసుకోవాలని అన్నారు.మిల్లింగ్ చార్జీలు గతంలో చాలా తక్కువగా ఉండేవని, వీటిని పెంచేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసిందని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాకుండా చూడాలని అన్నారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జడ్పీ సీఈవో విద్యాలత, సీపీవో సత్యనారాయణ రెడ్డి, డీపీవో లక్ష్మీరమాకాంత్, డీఈవో వాసంతి, జీడబ్ల్యూఎంసీ కాజిపేట్ డివిజన్ కమిషనర్ రవీందర్, పరకాల మున్సిపల్ కమిషనర్ నరసింహ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: