హన్మకొండ ;
హనుమకొండలో మహర్షి వాల్మీకి జయంతిని హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి చిత్రపటానికి జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ వాల్మీకి గొప్ప మహర్షి అని పేర్కొన్నారు. రామాయణాన్ని రచించిన మహా ముని వాల్మీకి అని అన్నారు. మహర్షి వాల్మీకి ఆచరించిన ఆదర్శాలను మనం ఆచరించాలన్నారు. అదేవిధంగా ఈ సమావేశంలో బోయ వాల్మీక సంఘం నాయకులు అడిగిన అంశాలపై అదనపు కలెక్టర్ స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దామాషా ప్రకారం వర్తించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రామ్ రెడ్డి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, ఇతర జిల్లా అధికారులతో పాటు బోయ వాల్మీకి సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భోగి కృష్ణమూర్తి, జిల్లా అధ్యక్షుడు నిగ్గుల వెంకటప్రసాద్, సంఘం నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: