హన్మకొండ ;

జిల్లాలలో గ్రూప్స్  పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తూ సన్నద్ధం కావాలని  తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎం. మహేందర్ రెడ్డి గ్రూప్స్ పరీక్షల నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు.

నవంబర్ 17 మరియు 18 తేదీలలో నిర్వహించు గ్రూప్ 3 పరీక్షలు మరియు డిసెంబర్ 15 మరియు 16 తేదీలలో నిర్వహించు గ్రూప్-2 పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో చేయాల్సిన ఏర్పాట్ల, తీసుకోవాల్సిన జాగ్రత్తల పై పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కలెక్టర్లకు పలు సూచనలు జారీ చేశారు.  జిల్లాలలో చేయాల్సిన ఏర్పాట్లకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 

ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రూప్స్ పరీక్షల నిర్వహణకు ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి, అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయో లేవో పరిశీలించాలని, ఈ ప్రక్రియ రేపటి లోగా పూర్తి చేయాలని కమిషన్ చైర్మన్ కలెక్టర్లను ఆదేశించారు. 

పరీక్ష కేంద్రాల ధృవీకరణ పూర్తయిన తర్వాత అభ్యర్థుల వివరాలతో కూడిన ఓ.ఎం.ఆర్ షిట్ల ముద్రణ ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో పరీక్ష ప్రశ్నా పత్రాల, ఇతర ముఖ్యమైన సామాగ్రి భద్రపర్చేందుకు స్ట్రాంగ్ రూమ్ లను గుర్తించాలని అన్నారు.  పరీక్షలు సజావుగా సాగేందుకు వీలుగా జిల్లాలోని ఒక ప్రాంతంలో ఉన్న పరీక్షా కేంద్రాలకు రీజనల్ కోఆర్డినేటర్లను నియమించాలని అన్నారు. 

గ్రూప్ 3 పరీక్షకు 3 పేపర్లు, గ్రూప్ 2 పరీక్ష 4 పేపర్లు పెద్ద ఎత్తున సభ్యులు ఉన్న నేపథ్యంలో రీజనల్ కోఆర్డినేటర్ పరిధిలో స్ట్రాంగ్ రూమ్ గుర్తించాలని అన్నారు.  రీజనల్ కోఆర్డినేటర్ పరిధిలో అభ్యర్థుల సంఖ్య ఆధారంగా  అవసరమైన మేర స్ట్రాంగ్ రూమ్ ఉండాలని అన్నారు. 

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 

 జిల్లాలో  గ్రూప్ 3 పరీక్షకు 83 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 10 మంది సీనియర్ జిల్లా స్థాయి అధికారులను నియమించడం జరిగిందని, పరీక్ష కేంద్రాలు పరిశీలించి వెంటనే, అప్ లోడ్ చేస్తామని, 2 స్ట్రాంగ్ రూమ్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు, ఈ పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్  వివరించారు.

ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, పోలీస్, రెవిన్యూ, సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: