హన్మకొండ ;
వరంగల్ నగర పాలక సంస్థ పరిధి లోని వరంగల్ హన్మకొండ కాజీపేట త్రినగరి లో సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు అరగంట పాటు కురిసిన భారీ వర్షం సిటీ ని జలమయం చేసింది. వరంగల్ చౌరస్తా,కృష్ణ కాలని,బట్టలబాజారు,ఎల్లం బాజారు,ములుగు రోడ్డు,అలంకార్ జంక్షన్,హన్మకొండ చౌరస్తా,పబ్లిక్ గార్డెన్,నయీంనగర్ ప్రాంతాలు జలమయం అయ్యాయి. కృష్ణా కాలని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల,హైస్కూలు ప్రాంగణంలో,వరంగల్ చౌరస్తాలో భారీ వర్షానికి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బట్టల బాజారు,ఎల్లం బాజారు వీధుల్లో మురుగు నీరు నిలువ ఉండడం వల్ల మలేరియా డెంగ్యూ వంటి జ్వరాలబారిన పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.బట్టల బాజారు లో వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద వర్షం నీటితో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ములుగు రోడ్డు లోని కాళేశ్వరం వెళ్లే చౌరస్తా,అలంకార్ జంక్షన్ హన్మకొండ చౌరస్తా లో వాహన దారులకు ఇబ్బందులు తప్పలేదు. అధికార యంత్రాంగం వర్షం నీరు రాకుండా నిలచి పోకుండా శాశ్వత పరిష్కారం చూపాలని పట్టణ వాసులు మొత్తుకుంటున్నప్పటికి సరైన ప్రణాళికలు సిద్ధం చేయలేక పోతున్నారు.దీంతో అరగంట వర్షం కురిసినా అవస్థలు పడుతున్నారు. నగర పాలక సంస్థ అధికారులు,జిల్లా కలెక్టర్ లు,ఎమ్మెల్యే ఎంపి లు మంత్రులు శాశ్వత పరిష్కారం చూపాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
Post A Comment: