December 2023
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ



హన్మకొండ ;

80 కొత్త ఆర్టీసీ బస్సులు (30 ఎక్స్ప్రెస్. 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్, సీటర్లు) లను శనివారం రవాణా, బీసీ సంక్షేమ శాఖా మాత్యులు పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.

హైదరాబాద్ లోని డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో బస్సులను మంత్రి పొన్నం, సంస్థ ఎండీ సజ్జనార్, అధికారులతో కలిసి  ప్రారంభించారు.  త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీకి అందుబాటులోకి రాబోతున్నన్నట్లు ఎండీ సజ్జనార్ వెల్లడించారు. వీటిలో హైదరాబాద్కు 500, జిల్లాలకు 500 బస్సులు కేటాయించనున్నట్లు వివరించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

 భూపాలపల్లి, చిట్యాల సిఐలు ఎస్పి కిరణ్ ఖరే  ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రంతో మైనారిటీ పాఠశాలలో మరియు మొగుళ్ళపల్లిలో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో గంజాయి మత్తు పదార్థాలు, సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన సదస్సును  భూపాలపల్లి సిఐ రామ్ నర్సింహా రెడ్డి, చిట్యాల సీఐ వేణు చందర్ లు నిర్వహించారు.  ఈ సందర్భంగా సిఐలు  మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారని, డ్రగ్స్ గంజాయికి బానిసై వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు.  ఎవరైనా గంజాయి అమ్మితే ఉపేక్షించేది లేదని కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. గంజాయి అమ్మేవారి పట్ల తగిన సమాచారం అందించాలని వారి పేరు గోప్యంగా ఉంచుతాయని, యువత, విద్యార్థులు  గంజాయి కి దూరంగా ఉండి జీవితం లో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే సైబర్ నేరాల పట్ల యువత, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత  సమాచారం, ఓటిపి, పిన్ ఏ ఇతర సమాచారం ఇవ్వద్దన్నారు. ఈ కార్యక్రమంలో మొగుళ్ళపల్లి  ఎస్సై  శ్రీధర్, భూపాలపల్లి ఎస్సై  లు శ్రీలత, శ్రావణ్,  పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం హనుమకొండ జిల్లాలో గురువారం ప్రారంభమైంది. జిల్లాలోని ఆయా మండలాల పరిధిలోని పలు గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద ప్రజా పాలన కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ప్రజా పాలన అభయ హస్తం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన కౌంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను అధికారులు స్వీకరించిన అనంతరం దరఖాస్తుదారులకు రసీదులను అందజేశారు. దరఖాస్తులను అందజేసినందుకు వచ్చే మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కౌంటర్లను సిద్ధం చేశారు. దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చే ప్రజల కోసం కౌంటర్ల వద్ద టెంట్లు, కుర్చీలు, తాగునీటి సౌకర్యం, తదితర వసతులను కల్పించారు. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రధమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు.

గ్రామ సభలను సందర్శించిన అదనపు కలెక్టర్

 డిసెంబర్ 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు జరగనున్న ప్రజా పాలన గ్రామసభలు ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జరుగనున్నాయి. ప్రజా పాలన కార్యక్రమం తొలి రోజు అయిన గురువారం హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా గ్రామ సభలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. పరకాల లోని సిఎస్ఐ స్కూల్ లో ప్రజా పాలన అభయ హస్తం గ్యారంటీ స్కీమ్ ల దరఖాస్తుల స్వీకరణకు కౌంటర్లను ఏర్పాటు చేయగా వాటిని గురించి, అక్కడ కల్పించిన వసతులను మునిసిపల్ కమిషనర్ శేషాంజన్ స్వామిని అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల కోసం వచ్చే ప్రజలు దరఖాస్తు చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు ఉండాలన్నారు. ప్రజల నుండి ఎన్ని దరఖాస్తు లు వచ్చాయానే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కమలాపూర్ మండలంలోని గూనిపర్తి లోని గ్రామసభ ను సందర్శించారు. అక్కడి వివరాలను స్థానిక అధికారులను అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్ రాధిక గుప్తా విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రజా పాలన కార్యక్రమాన్ని ఎస్పి కిరణ్ ఖరే పరిశీలించారు. 

నేటి నుండి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలనకు సంబందించి పోలీస్ బందోబస్తు, ప్రజా పాలన నిర్వహణ తీరును జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే గురువారం పరిశీలించారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీ, రాంనగర్ మున్సిపల్ వార్డుల్లో నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని ఎస్పి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా అర్హులైన ప్రజలు స్వేచ్ఛగా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పి కిరణ్ ఖరే కోరారు.

 ఈ కార్యక్రమంలో భూపాలపల్లి సీఐ రామ్ నర్సింహరెడ్డి పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

 అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమం వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలోని 4వ పెద్దమ్మగడ్డ, 5వ డివిజన్ కొత్తూరు జెండా కమ్యూనిటీ హాళ్ళలో గురువారం నిర్వహించారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వార్డు సభలలో ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు అందించిన సందేశాన్ని కాజీపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ చదివి వినిపించారు.

ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.5లక్షల నుండి రూ.10లక్షలకు పెంపు గురించిన ఆరు గ్యారంటీలను అధికారం లోనికి వచ్చిన తరువాత అమలు చేస్తామని హామీ ఇచ్చామని పేర్కొన్నారు. ప్రజా ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తప్పకుండా అమలు చేస్తామన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లోని ప్రతి డివిజన్లో ప్రభుత్వ పథకాలను అందించేందుకు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించేందుకు కౌంటర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి డివిజన్ లోని ప్రజలకు దరఖాస్తు పత్రాలు అందుతాయని, ఎవరు కూడా ఆందోళన చెందనవసరం లేదన్నారు. ప్రజాపాలన కార్యక్రమం డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ఉంటుంది కాబట్టి దరఖాస్తు పత్రాల కోసం అధైర్యపడవద్దన్నారు. ప్రభుత్వ పథకాల కోసం ప్రజలకు దరఖాస్తు పత్రాలను పూర్తిస్థాయిలో అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారన్నారు. రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రజా పాలనలో భాగంగా వచ్చిన దరఖాస్తులను ఈ డివిజన్ల లో ఏర్పాటుచేసిన కౌంటర్ల వద్ద అధికారులకు ప్రజలు సమర్పించారు. అదేవిధంగా కౌంటర్ల వద్ద వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎండి. అజీజ్ ఖాన్, వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, సెంట్రల్ జోన్ డిసిపి ఎం. ఏ. భారి, ఏసీపీ కిరణ్ కుమార్, ఆర్డివో ఎల్. రమేష్, తహశీల్దార్ విజయ్ కుమార్, నోడల్ అధికారి మేన శ్రీను, కార్పొరేటర్లు పోతుల శ్రీమాన్, తోట వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, సిబ్బంది తో పాటు ఆయా డివిజన్ల ప్రజలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

పొగమంచు కారణంగా కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్పి కిరణ్ ఖరే బుధవారం తెలిపారు.

 వాహన అతి వేగాన్ని తగ్గించండి. విజిబిలిటీ చాలా తక్కువగా ఉన్నప్పుడు మీ పరిసరాలను అంచనా వేయడం కష్టంగా ఉంటుంది. మీరు వేగంగా ప్రయాణిస్తున్నట్లయితే రహదారి పరిస్థితులు వెంటనే అర్ధం కాకపోవచ్చు, సాధ్యమైనంత వరకు వేగాన్ని తగ్గించండి. దృశ్యమానత పరిమితిని మించి నడిపితే ఎదురుగా ఎవరైనా ఉన్నారో లేదో నిర్ధారించడం కష్టమవుతుంది.

కనిపించని వాహనాలను వినికిడి ద్వారా గ్రహించే ప్రయత్నం చేయండి. పొగమంచు వాతావరణంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చెవులు గొప్ప ఆస్తిగా ఉంటాయి. దట్టమైన పొగమంచు సమయంలో మీ దృశ్యమానత దెబ్బతినవచ్చు, టైర్లు మరియు హారన్ల శబ్దాలు కనిపించని వాహనాల నుండి దూరాన్ని అంచనా వేయడంలో మీకు సహాయపడతాయి. కాబట్టి పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ వాహనంలో సంగీతాన్ని నిలిపివేయండి మరియు రహదారి శబ్దాలను వినండి.

మీ లేన్‌ లోనే డ్రైవింగ్ చేయండి.పొగమంచు ద్వారా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తక్కువ దృశ్యమానతతో, ఎవరైనా లేన్‌లను ఎప్పుడు మారుస్తున్నారో గుర్తించడం చాలా కష్టం, ఇది ప్రమాదాలకు దారితీయవచ్చు. రహదారి యొక్క ఒక భాగంపై దృష్టి కేంద్రీకరించడం మరియు నిర్దిష్ట లేన్‌కు కట్టుబడి ఉండటం మంచిది.

 మీ వాహన అద్దాలను స్పష్టంగా ఉంచడానికి ప్రయత్నించండి.మీ దృష్టిని వీలైనంత స్పష్టంగా ఉంచడానికి ప్రయత్నించండి.మీ దృష్టికి ఎలాంటి అడ్డంకులు లేవని నిర్ధారించుకోవడానికి మీ విండ్‌స్క్రీన్‌ను లోపల మరియు వెలుపల శుభ్రం చేయండి.

 మీ వాహనంలో హీటర్ ఆన్ చేయండి. బయట పొగమంచు తరచుగా వాహనం లోపలి భాగంలో ఘనీభవనానికి కారణమవుతుంది. మన దృష్టికి మరింత ఆటంకం కలిగిస్తుంది. హీటర్‌ను ఆన్ చేయడం ద్వారా దీన్ని సులభంగా క్లియర్ చేయవచ్చు.

ఓవర్ టేక్ చేయవద్దు.పొగమంచు ఉన్న సమయంలో ఓవర్ టెక్ చేయవద్దు. ఓవర్‌టేక్ చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు ముందు ఉన్న డ్రైవర్‌ దృష్టిని మరల్చవచ్చు.అకస్మాత్తుగా వారి వేగాన్ని తగ్గించుకోవడానికి వీలు కాకపోవచ్చు. ప్రమాదం జరగడానికి దారి తీయొచ్చు.

వాహనాల మధ్య కనీస దూరం పాటించండి.మీకు మరియు ముందున్న వాహనానికి మధ్య సరైన స్థలాన్ని ఉంచడం చాలా మంచి ఆలోచన. ఇది ప్రతిస్పందించడానికి,వేగాన్ని తగ్గించడానికి మరియు అవసరమైనప్పుడు ఆపడానికి తగినంత సమయాన్ని ఇస్తుంది. రహదారిపై మీ దృష్టిని కేంద్రీకరించండి.....పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే అప్రమత్తంగా ఉండటం మరియు మీ దృష్టిని రహదారిపై ఉంచడం. స్వల్ప వ్యవధిలోనే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ మరియు వాతావరణ పరిస్థితులపై దృష్టి పెట్టడం ప్రతి ఒక్క డ్రైవర్ బాధ్యత......... ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ జాగ్రతలు పాటించాలి.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుకు కసరత్తు చేస్తోంది. అయితే.. ఆరు గ్యారెంటీల అమలు కోసం ఈ నెల 28 నుంచి ప్రజా పాలన పేరుతో గ్రామ సభలు నిర్వహించనుంది. అయితే.. ఆ ఆరు గ్యారెంటీల ద్వారా లబ్ది పొందేందుకు రేషన్ కార్డులే ప్రామాణికమని ప్రభుత్వం ప్రకటించటం గమనార్హం. అయితే.. గత సర్కారు హయాంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవటంతో.. చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఎప్పడెప్పుడు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలా అని చూస్తున్నారు. కాగా.. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్లు మొదలయ్యాయని.. గైడ్ లైన్స్ ఇవేనని.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదేనంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి శ్రీధర్ కీలక ప్రకటన చేశారు.జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రజా పాలన నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు.. కొత్త రేషన్ కార్డుల విషయంపై క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నట్టు.. కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం, పాత కార్డులను తీసేయడం వంటి ప్రక్రియను ప్రభుత్వం చేపట్టలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపడుతుందన్నారు. అయితే.. కొత్త రేషన్ కార్డుల జారీకి ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదని.. లబ్ధిదారుల ఎంపికకు ఇంకా గైడ్ లైన్స్ సిద్ధం కాలేదని మంత్రి పేర్కొన్నారు. డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం కూడా దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పిన విషయంపై కూడా మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఆశావహుల డేటా సేకరణ కోసమే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఫించన్ వస్తున్న వాళ్లు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లు కావాలనుకునే వాళ్లు దరఖాస్తు చేసుకోవాలని.. అప్లికేషన్లలో అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ప్రజా పాలనలో స్వీకరించే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తామని తెలిపారు. ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ  ;

 సుబేదారిలోని  ప్రభుత్వ బాలిక సధన్ లో క్రిస్టమస్ ను పురస్కరించుకొని సెమీ క్రిస్టమస్ వేడుకలు శుక్రవారం  ఘనంగా నిర్వహించారు.

జిల్లా సంక్షేమ అధికారి కె.మధురిమ  అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో మాట్లాడుతు ఇక్కడ ఉన్న పిల్లలు కేవలం అనాథలే కాదు సింగిల్ పేరెంట్ , విడాకులు తీసుకున్న తల్లి తండ్రుల పిల్లలు కూడా ఉన్నారు అని, ప్రభుత్వం ద్వారానే ఈ సదన్ నడిపిస్తున్నామని , వారి ఉజ్వల భవిష్యత్తు కి దగ్గర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తూ విద్యను అందిస్తున్నాం అని పేర్కొన్నారు. 

కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్త I.A.S పిల్లలతో కలిసి క్రిస్టమస్ వేడుక పాటలు పాడి, కేకే కటింగ్ లో పాల్గొన్నారు. పిల్లలకి తమ జీవితం పట్లా ఆశయాలు ఉండాలని , వాటి కోసం కస్టపడి చదవాలని ఎన్నో అవరోధాలను అధిగమించాలని సందేశాన్ని ఇచ్చారు.

అనంతరం శాలువా తో సన్మానించిన అధికారులు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి మధురిమ, చిల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డా. పరికి సుధాకర్ , రాజేంద్ర ప్రసాద్ , డి.సి.పి.ఓ సంతోష్ కుమార్ , పి.ఓ.లు ప్రవీణ్ కుమార్ , మౌనిక , సూపరింటెండెంట్ కల్యాణి ,రజిత , మాధవి , శ్రీనివాసులు, విజయ్ కుమార్, సతీష్ కుమార్ , భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

 యువత అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ తెలిపారు. హనుమకొండ జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా యువజన ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా యువజన సంక్షేమ, క్రీడల శాఖ అధికారి గుగులోత్ అశోక్ కుమార్ వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అజీజ్ ఖాన్ హాజరై మాట్లాడుతూ భారతదేశం అత్యధిక యువ జనాభా కలిగిన దేశం అని అన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో యువత యొక్క పాత్ర అమోఘమైందని తెలంగాణ రాష్ట్ర సాధనలో యువతి యువకులు చేసిన పోరాట ఫలితమే ఈరోజు మనం స్వరాష్ట్రంలో జీవనాన్ని కొనసాగిస్తున్నామన్నారు. ముఖ్యంగా మన తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని వైభవాన్ని ప్రతి ఒక్కరు తప్పకుండా ఆచరిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువతలో ఉన్న శక్తిని వెలికి తీయడానికి ఇలాంటి యువజన ఉత్సవాలు చాలా ఉపయోగపడతాయి అన్నారు. మరొక ప్రత్యేక అతిథిగా హాజరైన జాతీయ యువజన అవార్డు గ్రహీత మండల పరశురాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఒక నూతన యువజనపాల్సిని మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ మరియు పట్టణ యువతీ యువకులను సాంస్కృతిక రంగాల్లో అలాగే క్రీడ రంగాల్లో రాణించడానికి ప్రత్యేకమైనటువంటి పాలసీని తీసుకువచ్చి వారిని అభివృద్ధి పరచాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో యువజన అవార్డు గ్రహీత గంగోజుల నరేష్ ,యువజన సంక్షేమ శాఖ సిబ్బంది నయుం , సుజన్ ,ఏవీ కళాశాల ఎన్ఎస్ఎస్ పోగ్రామ్ ఆఫీసర్ కోడిమాల శ్రీనివాస్ రావు, సిబ్బంది వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువతీ యువకులు పాల్గొన్నారు.

వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

 ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అన్నారు.

గురువారం హనుమకొండ మండలం గుండ్ల సింగారంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత  పాఠశాలలో  వయోవృద్ధుల సంక్షేమ సంస్థ విద్యారణ్యపురి ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా హాజరై మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఆరోగ్య సంరక్షణకు శ్రద్ధ తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వయోవృద్ధులు మంచి ఆరోగ్యం కోసం మరింత శ్రద్ధ వహించడంతోపాటు ఆరోగ్య సంరక్షణకు జాగ్రత్తలు పాటించాలన్నారు. 

ఈ ఉచిత వైద్య ఆరోగ్య శిబిరంలో వైద్యులు, సిబ్బంది  స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు 

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ లావుడ్యా రవి నాయక్, జిల్లా సంక్షేమ అధికారి కె. మధురిమ,  వయోవృద్ధుల సంక్షేమ సంస్థ విద్యారణపురి ప్రతినిధులు దామెర నర్సయ్య, మేకల వెంకటయ్య, తేరాల యుగేందర్, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

క్రిస్మస్ పర్వదినానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని  వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ సభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి  అన్నారు.

హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని  సమావేశపు హాలులో వివిధ శాఖల అధికారులు, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధులతో క్రిస్మస్ పండుగ నిర్వహణపై జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన సోమవారం సాయంత్రం సమీక్ష సమావేశాన్ని  నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ  క్రిస్మస్ తో పాటు అన్ని పండుగలకు  ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగను సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. పండుగల నిర్వహణలో  అందరి సహాయ సహకారాలు అవసరమని పేర్కొన్నారు. సమన్వయంతో పండుగ నిర్వహించి ప్రత్యేకంగా పేరును తీసుకురావాలన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి వెయ్యి దుస్తుల పంపిణితోపాటు, ఫీస్ట్ నిర్వహణకు రెండు లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. క్రిస్మస్ పండుగ నిర్వహణలో అన్ని విభాగాలు సమన్వయంతో  పనిచేసి విజయవంతం చేయాలన్నారు. పండుగ నిర్వహణలో  ఏ సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వరంగల్ సెంట్రల్ జోన్ డిసిపి ఎం.ఏ భారీ మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చెపడతామన్నారు.  వరంగల్ మహానగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ అనిసూర్ రషీద్  మాట్లాడుతూ నగరపాలక సంస్థ తరపున ఏర్పాట్లు  చేస్తామని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ  క్రిస్మస్ పండుగ రోజున చర్చిల వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా పంచాయతీ అధికారి జగదీష్ మాట్లాడుతూ అన్ని గ్రామ పంచాయతీల తరపున గ్రామాల్లో క్రిస్మస్ ఏర్పాట్లు  చేస్తామన్నారు.

ఈ సందర్భంగా పాస్టర్లకు, క్రైస్తవులకు ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాస్టర్లు,  క్రైస్తవులు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా  కేకును కట్ చేయించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు.

 ఈ సందర్భంగా  రెడ్ క్రాస్ రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఇ.వి శ్రీనివాసరావు, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు ఎల్. రమేష్, శ్రీనివాస్, ఏసీపి కిరణ్ కుమార్, పాస్టర్లు ఐజాక్, మంద కుమార్, ఇమ్మానుయేల్, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

మేడిగడ్డ టీవీన్యూస్ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి పవన్


మెదక్ జిల్లా  ఆందోల్ నియోజకవర్గ పరిధిలోని టెక్మాల్ మండల పోలీస్ స్టేషన్ లో దళిత బంధు లో  కమీషన్లు తీసుకున్నానంటూ తనపై ఒక వ్యక్తి పోలీస్ లకు ఫిర్యాదు చేసినట్టు నిన్న నే నా దృష్టికి వచ్చింది. ఈ ఫిర్యాదు రాజకీయ కుట్ర, అయినప్పటికీ ఆరోపణలపై విచారణకు నేను సిద్ధంగా వున్నాను. అని అన్నారు అయితే నిజాలు నిగ్గుతేల్చడానికి 'లై" డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని దానికి నేను సిద్దాంగా ఉన్నానని కూడా తీయజేశారు . . తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తి కి కూడా లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించి ఫిర్యాదులోని వాస్తవాన్ని ఫిర్యాదు వెనకాల ఉన్న కుట్ర ను ఛేదించాలని పోలీస్ లను కోరుతున్నాను. ఆందోల్ నియోజకవర్గంలో దామోదర రాజనర్సింహ చేస్తున్న అరాచకాలకు ఈ ఫిర్యాదు పరాకాష్ట. తప్పుడు కేసు లతో మా కార్యకర్తలను వేధిస్తున్నాడు. అని అన్నారు మా కార్యకర్తల ఇళ్లపై దాడులు చేయిస్తున్నాడు. బి ఆర్ ఎస్ మహిళ కార్యకర్తల ఇళ్లలోకి జోరబడి వారిపై కోడి గుడ్లతో దాడి చేయిస్తున్నరు. నాయకుల ఇళ్ల పైకి టపాసులు విసురుకుంటు వారి కుటుంబాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు, అని తెలిపారు కార్ల కింద టపాసులు పేల్చుకుంటు దామోదర అనుచరులు రాక్షస ఆనందం పొందుతున్నారు. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి రాయలసీమ ఫ్యాక్షన్ గ్రామాల్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు మా ఆందోల్ లో ఏ గ్రామంలో చూసిన ఇదే పరిస్థితి కనబడుతుంది. కొత్తగా ప్రభుత్వం ఏర్పడి పదిహేను రోజులు గడవక ముందే మంత్రి గా అన్ని స్థాయిల్లోని అధికారులను బెదిరింపులతో తమదారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అని మండి పడ్డారు పోలీస్ అధికారులను సైతం దామోదర బెదిరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం ప్రశాంతంగా పనిచేసుకొని పరిస్థితి ని దామోదర తీసుకొచ్చాడు. గ్రామాల్లో రాజకీయంగా  ఆయనకు దీటుగా నిలబడ్డందుకే తప్పుడు ఆరోపణలతో కేసు లు పెట్టిస్తున్నాడు. అని తెలిపారు జీతం మీద మాత్రమే ఐదేళ్లు గడిపిన చరిత్ర నాది.  నేను ఎలాంటి వాన్నో నాతో కలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. రాజకీయంగా బదనాం చేయడమే లక్ష్యంగా కొందరిని లోబరుచుకుని, ప్రలోభపెట్టి  దామోదర దిగజారి రాజకీయాలు చేస్తున్నారు.  నిష్పక్షపాత విచారణ జరగాలని నిజాలు నిగ్గుతేలాలని డిమాండ్ చేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రిగా  కొండా సురేఖ  రేపు ఉదయం 8 : 45 గంటలకు (ఆదివారం, డిసెంబర్ 17న) బాధ్యతలు చేపట్టనున్నారు.

 సచివాలయం నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో (రూమ్ నెంబర్ 410) ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరిస్తారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

హనుమకొండ జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్రంగా ఉండేవిధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో అధికారులతో శనివారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘము ఆదేశాల ప్రకారం ఓటర్ల జాబితా పకడ్బందీగా ఉండాలన్నారు. ఓటర్ల జాబితా లో మార్పులు, చేర్పులు చేయడంతో పాటు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన వారికి ఓటు హక్కు కల్పించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. బీఎల్వోలు, అధికారులు క్షేత్ర స్థాయిలో ఓటర్ల జాబితా లో మార్పులు, చేర్పులు, నూతన ఓటర్ల నమోదు, మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు, ఓటరు ఫోటో గుర్తింపు, తదితర వివరాలు సమగ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. ఓటర్ల జాబితా  కు సంబంధించిన ఏవైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలన్నారు. ఓటర్ల జాబితా కు సంబంధించిన పలు విషయాలపై ఈ సందర్భంగా చర్చించారు. 

ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు రాధిక గుప్తా, మహేందర్ జీ, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, హనుమకొండ ఆర్డివో రమేష్, వివిధ మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్య  పథకాలను అర్హులైన లబ్ధిదారుల చెంతకు తీసుకు వెళ్ళడమే కాకుండా, కొత్త లబ్ధిదారుల గుర్తింపు లో భాగంగా అవగాహన నిమిత్తం ఈనెల 16 నుండి జనవరి 26 వరకు జిల్లా వ్యాప్తంగా 

"వికసిత్ భారత్ సంకల్ప యాత్ర" అనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ  తెలిపారు.

వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహణ విషయమై శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. 

కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు మౌలిక సదుపాయాలైన పారిశుద్ధ్యం, ఆర్థిక సహాయం, ఎల్పీజీ కనెక్షన్లు, ఇండ్లు, ఆహార భద్రత, పౌష్టికాహారం, వైద్యం, విద్య ,స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన విద్య అందించడంలో భాగంగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, ఇందులో భాగంగా నిర్దేశించిన, అర్హత ఉన్న లబ్ధిదారులకు ఈ కార్యక్రమాలన్ని చేరేలా అలాగే కొత్త లబ్ధిదారులను గుర్తించి వారికి అవగాహన కల్పించేందుకుగాను ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. 

దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా నవంబర్ 15 నుండి జనవరి 26 వరకు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు.

ఇందులో భాగంగా జిల్లాకు మూడు ప్రచార వాహనాలను కేటాయించడం జరిగిందని , ఈ వాహనాలు ప్రతిరోజు  గ్రామాలలో కేంద్ర ప్రభుత్వ పథకాలను వీడియో ద్వారా ఆయా గ్రామాల ప్రజలకు తెలియజేస్తారన్నారు. 

కేంద్ర ప్రభుత్వ  పథకాలైన ఆయుష్మాన్ భారత్, పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, దీన్ దయాల్ అంత్యోదయ అన్న యోజన, పిఎం ఆవాస్ యోజన, పిఎం ఉజ్వల్ యోజన, పిఎం విశ్వకర్మ ,పీఎం కిసాన్ సమ్మాన్ ,కిసాన్ క్రెడిట్, పోషణ అభియాన్, హార్ ఘర్ జల్ జీవన్ మిషన్, జన్ ధన్ యోజన, స్వామిత్వ, అటల్ పెన్షన్ యోజన, పీఎం ప్రణాం, నానో ఫర్టిలైజర్ తదితర పథకాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తారని, అంతేగాక కొత్త లబ్ధిదారులను గుర్తించే కార్యక్రమాన్ని చేపడతారని తెలిపారు.

జిల్లాలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు విజయవంతం చేసేందుకు సహకారం అందించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అమలు తీరుపై  హనుమకొండ జిల్లా కలెక్టర్  సిక్తా పట్నాయక్ ను కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ

హీనా ఉస్మాన్ శనివారం కలెక్టర్ ఛాంబర్ లో కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. హనుమకొండ జిల్లాకు కేటాయించిన  యాత్రకు సంబంధించిన మూడు ప్రచార రథాలను  వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గీసుకొండ మండలం గంగాదేవి పల్లిలో  ప్రచార యాత్ర  జరగగా హీనా ఉస్మాన్  అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్, నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

యూత్ పేస్ట్ కార్యక్రమంలో భాగంగా హెచ్ఐవి ఎయిడ్స్, టిబి, బ్లడ్ డొనేషన్ పట్ల అవగాహన పెంపొందించడంలో భాగంగా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ మరియు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వారి ఆదేశాల మేరకు స్కూల్ విద్యార్థులకు జాతీయస్థాయి 9 రాష్ట్రాలతో హెచ్ఐవి ఎయిడ్స్ పై నిర్వహించిన క్విజ్ కాంపిటీషన్లో హనుమకొండ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులు పోటీపడి ప్రధమ బహుమతి సాధించి హనుమకొండ జిల్లా మరియు తెలంగాణ రాష్ట్ర కీర్తి పతాకాన్ని జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు హనుమకొండ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు, అడిషనల్ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ మదన్ మోహన్ రావు ఫోను ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విద్యార్థులు గతంలో జిల్లాస్థాయిలో మరియు రాష్ట్రస్థాయిలో నిర్వహించిన కాంపిటీషన్ ప్రోగ్రాంలో ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది.

ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులు గండి సహస్ర, నలిమెల అక్షయకు రూపాయలు 50,000 నగదు బహుమతి తో పాటు ట్రోఫీలను న్యాకో అధికారిని సుచి గౌతమ్  మరియు చత్తీస్గడ్ అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్  డాక్టర్ జి జే రావు  చేతుల మీదుగా అందించడం జరిగింది. రీజినల్ స్థాయిలో గుర్తింపు తెచ్చినందుకుగాను జిల్లా డాప్కో టీం శ్రీమతి స్వప్నమాధురి, కమలాకర్, రామకృష్ణ రమేష్ లను, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి అభినందనలు తెలియజేశారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి మహాలక్ష్మి పథకం, ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ తీసుకువచ్చిన రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాలను  హనుమకొండ జిల్లాలో నేటి నుండి అమలవుతాయని  హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు.

శనివారం మధ్యాహ్నం హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతిఆసుపత్రి ( గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్) ఆవరణలో  మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఆర్టీసీ బస్సుల్లో  ఉచిత ప్రయాణానికి సంబంధించిన మహాలక్ష్మి పథకం జీరో టికెట్ను కలెక్టర్ చేతుల మీదుగా ఆర్టీసీ అధికారులు  ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం  మహిళలు, బాలికలు, వృద్ధ మహిళలకు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో  ఉచిత ప్రయాణం చేసేందుకు వీరికి జీరో  టికెట్ ఇవ్వబడుతుందన్నారు. మహిళల ఉచిత ప్రయాణం చేయడానికి తెలంగాణ చిరునామాను కలిగి ఉంటే సరిపోతుందన్నారు. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం కింద రూ. 10 లక్షలను ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా వైద్యం కోసం అందిస్తుందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు, ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఈ పథకం ద్వారా పేదలు వైద్య సేవలను  అందుకోవచ్చునని అన్నారు.

ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ బి.సాంబశివరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు పొందేందుకు దారిద్య రేఖకు దిగువన ఉన్నవారికి ఈ పథకం వరమని  తెలిపారు. ఈ పథకం ద్వారా పేదలకు నగదు రహిత చికిత్స తో పాటు రోగికి ఉచిత ఆహారం, రవాణా చార్జీలు ఇవ్వబడతాయన్నారు. హనుమకొండ జిల్లాలోని  ఐదు ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు  37 ప్రైవేట్ ఆస్పత్రుల్లో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం అమలవుతుందన్నారు.

ఈ సందర్భంగా ఆర్టీసీ  డిప్యూటీ ఆర్ ఎం  మాధవరావు మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు మహిళలందరికీ  వరం లాంటిది అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు,బాలికలు,వృద్ధ మహిళలు,ట్రాన్స్ జెండర్లు ఎంపిక చేయబడిన ఆర్డినరీ సిటీ, సబర్బన్, ఎక్స్ప్రెస్ బస్సుల్లో  ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు.

 *ఆర్టీసీ బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించిన కలెక్టర్*

 హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వద్ద ఆర్టీసీ బస్సు ముందు పచ్చ జెండా ఊపి మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మహిళలతో కలిసి బస్సులో  ప్రయాణించారు. ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల నుండి అశోక జంక్షన్, ఆర్టీసీ బస్టాండ్, హయాగ్రీవా చారి కాంపౌండ్, కాళోజీ సెంటర్, అంబేద్కర్ కూడలి, పోలీస్ కమిషనరేట్ కార్యాలయం, తదితర ప్రాంతాల మీదుగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి తిరిగి హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.  ఆర్టీసీ బస్సులో  ప్రయాణానికి సంబంధించిన జీరో టికెట్ను  కలెక్టర్ తీసుకున్నారు. అదేవిధంగా మహిళలు తీసుకున్న జీరో టికెట్లను  కలెక్టర్ పరిశీలించారు. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఆర్డిఓ శ్రీనివాస్, డిఆర్డిఓ పిడి శ్రీనివాస్ కుమార్, ఆర్టీసీ అధికారులు, వైద్యాధికారులు, మహిళలు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

 అమ్మాయిలు అన్ని రంగాల్లో అబ్బాయిలకు ధీటుగా రాణిస్తున్నారని విద్యా ఉపాధిలో ముందున్నారని అందు వలన ఇంకా అమ్మాయిలంటే వివక్ష తగదని  లింగ నిర్ధారణ ద్వారా పుట్ట బోయే బిడ్డ అమ్మాయని తెలుసుకుని అబార్షన్ కు పాల్పడే డాక్టర్లు, ప్రోత్సహించే వారిపై  కఠిన చర్యలు తీసుకుంటామని  హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. 

           

కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం  గర్బ ధారణ పూర్వ గర్భస్థ పిండ (లింగ నిర్ధారణ) పరీక్షల నియంత్రణ చట్టం అమలులో భాగంగా  జిల్లా అప్రాప్రియేట్  అథారిటీ సమావేశం  సిక్తా పట్నాయక్ 

 జిల్లా కలెక్టర్, హనుమకొండ  అధ్యక్షతన జరిగినది. జిల్లా లో  చట్ట అమలు తీరును, చేపట్టిన అవగాహన కార్యక్రమాలు  మరియు పి.హెచ్.సి ల వారీగా అమ్మాయిల జననాలను సమీక్షించడo జరిగింది. 

 జిల్లాలో అమ్మాయిల జననాలు తక్కువగా నమోదవుతున్న ప్రాంతాలలో ప్రత్యేక  కార్యక్రమాలు, 

అవగాహన కార్యక్రమాలు  చేపట్టాలని అదే విధముగా స్కానింగ్ పరీక్షలు  దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని,

అక్రమంగా అబార్షన్ లు నిర్వహిస్తున్న ఆసుపత్రుల పైన మరియు స్కానింగ్ సెంటర్ ల పైన 

నిఘా మరియు పర్యవేక్షణ లు పెంచాలని ఎన్జీవో  లు భాద్యత తీసుకొవాలని, గ్రామం జిల్లాలోని కళాజాత బృందాలను ఉపయోగించుకొని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, పోలీస్ డిపార్టుమెంటు  వారి   సహకారం తీసుకోవాలని, మహిళా సమాఖ్య సభ్యుల మీటింగ్ జరిగినప్పుడు మీటింగ్లలో పి సి పి ఎన్ డి టి చట్టంపై అవగాహన కల్పించాలని  సిక్తా పట్నాయక్, జిల్లా కలెక్టర్  ఆదేశించారు.

   శ్రీదేవి సెకండ్ అడిషనల్ ఫ్యామిలీ కోర్టు  జడ్జ్ మాట్లాడుతూ మహిళా కళాశాలలో అమ్మాయి లకు అన్ని ఆరోగ్య అంశాల తో పాటు చట్టం పై అవగాహన కల్పించాలని,  చూడగానే అర్థమయ్యే రీతిలో బొమ్మల ద్వారా  సంక్షిప్త సమాచారంతో చట్టంపై అవగాహన కల్పించాలని, స్పెషల్ డ్రైవ్ ద్వారా బృందాలుగా ఏర్పడి ఆసుపత్రిల లో ఆకస్మిక తనిఖీ చేయాలని జిల్లాలోని ఆర్ఎంపీలతో సమావేశాలు ఏర్పాటు చేసి చట్టం గురించి , లింగ వివక్షత గురించి, చట్టము దుర్వినియోగ పరిచితే వేసే శిక్షల గురించి తెలియజేయాలని  ఆమె పేర్కొన్నారు. 

ఈ సమావేశంలో  హనుమకొండ డి‌ఎం‌హెచ్‌ఓ డాక్టర్.బి. సాంబశివ రావు, డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ డాక్టర్. ఎం‌డి. యాకూబ్ పాషా, జిల్లా సంక్షేమ అధికారి  మధురిమ,  ఆర్ కృష్ణ మూర్తి మారి  ఎన్జీవో, జిల్లా మాస్ మీడియా అధికారి వి. అశోక్ రెడ్డి, డిప్యూటీ డెమో కే. ప్రసాద్ , స్టాటిస్టికల్ ఆఫీసర్ ప్రసన్న కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ హెచ్ టి యు నుండి   మల్లేష్, వెంకన్న పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రెటరీ వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేన హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్ , డి.ఈ.ఓ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గవర్నమెంట్ పాఠశాలల్లో విద్యార్ధుల అటెండెన్స్ , లిటరసీ రేట్ 100 శాతం వచ్చేలా ప్రతి ఉపాధ్యాయుడి బాధ్యత అన్నారు. క్యాంపైన్ కోసం యన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ అధికారుల సహాయం తీసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి పట్లా ప్రతేక శ్రద్ధ తప్పనిసరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అన్ని సక్రమంగా వినియోగించి, ప్రతి ఒక్కరి విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు దారి వెయ్యాలని అన్నారు.

( ఎఫ్.ఎల్.యన్ ) ఫంక్షనల్ లిటరసీ న్యుమెరసీ లో భాగంగా ముందుగా తొలి మెట్టు కార్యక్రమం ద్వారా ప్రతి 1-5వ తరతి విద్యార్థి చదవడం , రాయడం , మాట్లాడడం నేర్చుకోవాలన్నారు. ఉన్నతి కార్యక్రమం ద్వారా 6వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. 10వ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన లక్ష్య కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క ఔట్ గోయింగ్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం శ్రమించాలన్నారు.

ప్రతి విద్యార్థికి పప్రభుత్వం అందించే ఉచిత టెక్స్ట్ బుక్స్ , నోట్ బుక్స్ , స్టడీ మెటీరియల్స్ అందించాలని,   ఎఫ్.ఏ  ( ఫార్మటివ్ అసెస్మెంట్ ) , ఎస్.ఏ ( సమ్మేటివ్ అసెస్మెంట్ ) లను ఎప్పటికప్పుడు దృష్టి సారించాలన్నారు. 10వ  తరగతి బోర్డ్ పరీక్షలు రాసే విద్యార్ధులకు అదనపు స్టడీ అవర్స్ను నిర్వహించి , ఎప్పటికెప్పుడు టేస్ట్ లను నిర్వహించి విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచేలా చేయాలన్నారు.

హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతు ఎప్పటికప్పుడు జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్లతో రివ్యూ , ఉపాధ్యాయుల టీచింగ్ పై సమావేశాలు నిర్వహిస్తున్నామని  తెలిపారు.

కొన్ని పాఠశాలల్లో శానిటరీ, ,త్రాగు నీరు , స్కావెంజర్ కార్మికుల అవసరం ఉందన్నారు.     

ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డిఆర్వో వై. వి. గణేష్, డి.ఈ.ఓ. అబ్దుల్ హై ,  పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ

టీఎస్ ఎన్పీడీసీఎల్ సిఎండిగా నియమితులైన కె. వరుణ్ రెడ్డి శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.   హనుమకొండలోని  మున్సిపల్ కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ సిక్తా   పట్నాయక్ ను ఎన్పీడీసీఎల్ సిఎండి  వరుణ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి మొక్క ను అందజేశారు. ఈ సందర్భంగా సీఎండి వరుణ్ రెడ్డికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ విభిన్న రంగాల్లో దివ్యాంగులు రాణించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం హనుమకొండ లోని అంబేద్కర్ భవన్ లో జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని దివ్యాంగులకు జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఇటీవల వివిధ క్రీడాంశాల్లో పోటీలను నిర్వహించగా బహుమతులు, ప్రశంసా పత్రాల ప్రదానోత్సవం అంబేద్కర్ భవన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జీవితంలో అనేక సవాళ్లు ఎదురవుతుంటాయని వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలన్నారు. మనో సంకల్పం ముందు శారీరక అవరోధం కానీ కాదని, సంకల్ప సిద్ధి, మనో ధైర్యమే విజయ సాధనాలని పేర్కొన్నారు. దివ్యాంగులు జీవితంలో అనుకున్నది సాధించగలమనే  ఆత్మస్థైర్యంతో ఎల్లప్పుడు ముందుకు సాగాలన్నారు. జిల్లాలోని దివ్యాంగులు వివిధ క్రీడా పోటిల్లో పాల్గొని ప్రతిభను చాటడం అభినందనీయమన్నారు. 

*ఆకట్టుకున్న చిన్నారులు*

పలువురు చిన్నారులు తమ సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. పలు సినీ గీతాలకు నృత్యాలు చేసి అందరిచేత అభినందనలు అందుకున్నారు. మల్లికాంబ మనో వికాస కేంద్రం చిన్నారులు.. దేవుళ్ళు చిత్రంలోని మీ ప్రేమ కోరే చిన్నారులం, అదేవిధంగా దేవత చిత్రంలోని వెల్లువచ్చే గోదారమ్మా తదితర సినీ గీతాలకు నృత్యం చేసి ఆకట్టుకున్నారు. శ్రీ వెంకటేశ్వర బధిరుల పాఠశాలకు చెందిన చిన్నారి ఓం నమో వెంకటేశాయ చిత్రంలోని వేయి నామాలవాడ వెంకటేశుడా గీతానికి అద్భుతంగా నృత్యం చేశారు.

*ప్రతిభావంతులకు పురస్కరాలు*

దివ్యాంగులకు పరుగు, చెస్, క్యారమ్స్, షాట్ పుట్, జావెలిన్ త్రో, తదితర పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటిన చిన్నారులకు బహుమతులు, ప్రశంసా పత్రాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ అందజేశారు.

 జిల్లా సంక్షేమ అధికారి కె. మధురిమ అధ్యక్షతన జరిగిన  ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ శ్రీనివాస్ కుమార్, అనురాగ్ హెల్పింగ్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ అనితా రెడ్డి, బి డబ్ల్యు కార్యాలయ సూపరింటెండెంట్ లక్ష్మీకాంత్ రెడ్డి, దివ్యాంగుల సంఘం ప్రతినిధులు నల్లెల్ల రాజయ్య, ధనుంజయ్ కుమార్, రామకృష్ణ, అనిల్ కుమార్, నెహ్రూ యువ కేంద్ర  ప్రతినిధి మచ్చ రాజు, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి సంతోష్ కుమార్, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ భాస్కర్, ఎఫ్ ఆర్ ఓ రవికృష్ణ, దివ్య, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

 భూపాలపల్లి జిల్లా అదనపు  ఎస్పీ అడ్మిన్ గా ఏ. నరేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం  జిల్లా పోలీసు కార్యాలయంలో  అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. పోలిసు శాఖలో  1991 సంవత్సరంలో  ఎస్సై  గా ఎంపికయిన అదనపు ఎస్పీ  నరేష్ కుమార్, మొదట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సుల్తానాబాద్ లో ఎస్సై  గా విధులు నిర్వహించారు.ఎస్సై గా రాయకల్ , కోరుట్ల, వేములవాడ, కరీంనగర్ రూరల్ లో పనిచేసి 2006 లో సీఐగా పదోన్నతి పొంది, సీఐడీ   వరంగల్, టేకులపల్లి,  ఖమ్మం, కొత్తగూడెం, జగిత్యాల, ఖానాపూర్ సీఐ గా  విధులు నిర్వర్తిస్తూ, 2017 లో డిఎస్పీ గా పదోన్నతి పొందారు.  డిఎస్పీ గా మహబూబాబాద్, మామునూర్ ఏసిపి గా విధులు  నిర్వర్తిస్తూ, 2023 లో అదనపు ఎస్పిగా ప్రమోషన్ పొంది , సీఐడీ  వరంగల్ అదనపు ఎస్పీగా  పనిచేస్తూ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ గా బదిలీపై రావడం జరిగింది.  అదనపు ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన ఏ. నరేష్ కుమార్  కు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

విద్యార్థులు విద్యతో పాటు, క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు.

బుధవారం కాజీపేట మండలం కడిపికొండ శివారులో ఉన్న కేంద్రీయ విద్యాలయం లో 15వ వార్షిక క్రీడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడులకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు వెల్కమ్ బ్యాండ్ లతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులని ఉద్దేశించి మాట్లాడుతు క్రీడల్లో గెలుపు ఓటములు సహజం అనీ అన్నారు. క్రీడల్లో సమిష్టిగా సాగుతూ దానితి పాటు చదువుల్లోనూ క్రమశిక్షణ తో రాణిస్తూ జీవితం లో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలన్నారు.

క్రీడలు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు.

క్రీడల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల మానసిక, శారీరక శక్తి పెరగడంతో పాటు, సమగ్రత టీమ్‌ స్పిరిట్‌ , సాంఘిక బాధ్యతను తీసుకోవడం, నాయకత్వ లక్షణాలు మెరుగు పడుతాయన్నారు. యోగా, మెడిటేషన్‌, క్రీడలు బో ధనలో తప్పని సరి కావాలని టీచర్ లకు సూచించారు.విద్యార్థులు క్రీడల్లో  చక్కని ప్రదర్శన చేసారు అని, కేంద్రియ విద్యాలయ అభివృద్ధి కి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్  శుభాషిణి, శ్రీనివాస్, కవిత వెంకన్న విద్యార్థుల తల్లీ దండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

  ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ


హన్మకొండ ;

వైకల్యాన్ని అధిగమించి ఆత్మవిశ్వాసంతో దివ్యాంగులు  ముందుకు సాగుతూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ సభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.

 హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో  అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడోత్సవాలను  బుధవారం నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలను  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ  అన్ని రంగాల్లో మాదిరిగా క్రీడారంగంలోనూ  దివ్యాంగులు ముందుకెళ్తున్నారని అన్నారు. దివ్యాంగులు క్రీడల్లో రాణించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. భవిష్యత్తులో దివ్యాంగుల కోసం అధిక ప్రాధాన్యత ఇచ్చి జిల్లా సంక్షేమ శాఖ ప్రోత్సహించాలన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం  తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వైకల్యాన్ని అధిగమించేలా  దివ్యాంగులను ఉత్సాహపరిచే విధంగా  ప్రోత్సహించాలన్నారు.

ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా మాట్లాడుతూ క్రీడలు మనలోని శక్తిని, ఉత్సాహాన్ని  రెట్టింపు చేస్తాయని అన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొంటున్న దివ్యాంగులందరికీ అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె. మధురిమ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జిల్లాలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు క్రీడా పోటీల్లో  ఆత్మవిశ్వాసంతో పాల్గొంటుండడం అభినందనీయమన్నారు. ఈ నెల 15వ తేదీన  హనుమకొండ అంబేద్కర్ భవన్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా క్రీడల్లో పాల్గొన్న దివ్యాంగులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.  వేడుకలకు దివ్యాంగులు హాజరుకావాలని కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు.  కాగా పరుగు, షాట్ పుట్, జావెలిన్ త్రో, చెస్, క్యారమ్స్, తదితర క్రీడా పోటీల్లో  దివ్యాంగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  ఎండి. అజీజ్ ఖాన్, రెడ్ క్రాస్ సొసైటీ ఈసీ మెంబర్ ఈ.వి. శ్రీనివాసరావు, కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు,  డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ అశోక్ కుమార్, సూపరింటెండెంట్ లక్ష్మీకాంత్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సంతోష్ కుమార్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లు బిల్లా మహేందర్, సురేష్, ధనుంజయ, తదితరులతో పాటు మల్లికాంబ మనోవికాస కేంద్రం, బన్ను మనోవికాస కేంద్రం, శ్రీ వెంకటేశ్వర బదిరుల పాఠశాల, స్పందన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

 


                                                                           పెద్దపల్లి,డిసెంబర్,12,మేడిగడ్డటీవీన్యూస్,యశోద ఆసుపత్రి నుంచి కేసిఆర్ వీడియో సందేశం,నాతోపాటు వందలాది పేషంట్లకు ఇబ్బంది కలగకూడదు,కోలుకోనిత్వరలోనే మీ మధ్యకు వస్తా,ఇన్ఫెక్షన్ వస్తదని డాక్టర్లు బయటకు పంపటం లేదు,దయచేసి యశోద దవాఖానకు రాకండి అంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రజలకు దండంపెట్టి చెప్పాడు...యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెకుసుకొని పరామర్శించడానికి యశోద దవాఖానకు తరలివస్తున్న ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ విజ్ఞప్తి చేసారు.తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ మధ్యలకే వస్తానని అప్పడిదాకా సంయమనం పాటించి యశోద దవాఖానకు రావొద్దు,తనతో పాటు వందలాది మంది పేషెంట్లు హాస్పిటల్ లో ఉన్నందున మన వల్ల వారికి ఇబ్బంది కలగకూడదని ప్రజలను వేడుకుంటున్న తనపట్ల అభిమానం చూపుతున్న కోట్లాది ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ గద్గద స్వరంతో చేతులు జోడించి మొక్కుతున్న,తనను చూడడానికి వచ్చి మీరూ ఇబ్బంది పడొద్దు,హాస్పటల్ లో ఉన్న పేషెంట్లను ఇబ్బంది పెట్టొద్దు.ఎవరు కూడా నన్ను చూడడానికి రావద్దని వైద్యుల సూచనలు పాటించాలని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు...

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ ను హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హుస్నాబాద్ లోని నివాసంలో రాష్ట్ర మంత్రి  పొన్నం ప్రభాకర్ ని  కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసి  మొక్కను  అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు

 హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను వర్ధన్నపేట ఎమ్మెల్యే కె. ఆర్. నాగరాజు  మర్యాద పూర్వకంగా కలిశారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని  కలెక్టర్ చాంబర్ లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా  కలెక్టర్ ను శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజుకు కలెక్టర్ అభినందనలు తెలిపారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.

మంగళవారం హనుమకొండ అంబేద్కర్ భవన్ లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని పలు డివిజన్లకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ నియోజకవర్గ లబ్ధిదారులకు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందుతాయని అన్నారు. ప్రభుత్వ పథకాల కోసం ఎవరూ కూడా మధ్యదళారులను, ఎవరిని కూడా ఆశ్రయించవద్దని అన్నారు. అలా ఎవరినైనా ఆశ్రయించి ప్రభుత్వ పథకాల కోసం డబ్బులు ఇచ్చినట్లు తెలిస్తే వారికి ప్రభుత్వ పథకాలు అందవని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల కోసం ఎవరైనా డబ్బులు అడిగితే లబ్ధిదారులు తమకు గానీ, అధికారులకు గానీ తెలియజేయాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. జిల్లా అధికార యంత్రాంగం తో కలిసి రాబోయే రోజుల్లో జిల్లాను హైదరాబాద్ కు దీటుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలతో ముందుకు వెళ్తామన్నారు. ఇందుకు అందరి సహాయ సహకారాలు అందించాలని కోరారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తో చర్చించడం జరిగిందన్నారు. ఇటీవల వరకు ఎన్నికల కోడ్ ఉండడంతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు అందలేదని, ఎన్నికల కోడ్ ముగియడంతో చెక్కుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. అందులో భాగంగానే కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి మైనారిటీ, బీసీ వెల్ఫేర్, మున్సిపల్ కార్పొరేషన్ కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం తరఫున పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులు దృష్టి సారిస్తారని పేర్కొన్నారు. కొన్ని నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయని, అన్ని కార్యక్రమాలు ఆ లోగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తారని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా చెక్కులు అందుకున్న లబ్ధిదారులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా హనుమకొండ, కాజీపేట మండలాలకు చెందిన 220మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ లు రూ.2కోట్ల 20 లక్షల 25వేల 520ల చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో హనుమకొండ, కాజీపేట మండలాల తహశీల్దార్లు విజయ్ కుమార్, భావ్ సింగ్, కార్పొరేటర్లు పోతుల శ్రీమన్నారాయణ(శ్రీమాన్), తోట వెంకటేశ్వర్లు, జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీ రజాలి, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ; 

హన్మకొండ  కలెక్టరేట్ లో కలెక్టర్ సిక్త  పట్నాయక్ ను మర్యాద పూర్వకంగా  వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయీని రాజేందర్ రెడ్డి కలిశారు. ఎమ్మెల్యే అయిన తరువాత కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను మొదటి సారి  కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. ఆర్డీఓ  రమేష్, కాజీపేట ఎంఆర్వో భావ్ సింగ్ రెడ్ క్రాస్ ఈసీ మెంబెర్ ఈవి  శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

టీడీపీ జాతీయ  అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం  ఎన్. చంద్రబాబు నాయుడు సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం  కె. చంద్రశేఖర్ రావును పరామర్శించారు.

 కేసీఆర్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న చంద్రబాబు నాయుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ;

 ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు సత్వర పరిష్కారం కోసం వెంటనే చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.

సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాలులో  నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించిన 55 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.

 ఈ సందర్భంగా  డిఆర్ఓ వై. వి గణేష్, డిఆర్డిఓ శ్రీనివాస్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ

 


హన్మకొండ ;

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.

ఆర్టీసీ బస్సుల్లో  మహిళలు ఉచితంగా ప్రయాణించే మహాలక్ష్మి పథకాన్ని హనుమకొండ బస్టాండ్ లో  సోమవారం ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై  ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లు  ఆర్టీసీ బస్సుల్లో  ఉచితంగా ప్రయాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ఈ పథకంతో మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించేందుకు వీలుంటుందన్నారు. ఈ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహాలక్ష్మి పథకాన్ని ఎమ్మెల్యే నాయిని  రాజేందర్ రెడ్డి  ఆర్టీసీ బస్సు ముందు  జెండా ఊపి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  ఆర్టీసీ బస్సు కండక్టర్ కు డబ్బులు చెల్లించి టికెట్ ను తీసుకొని ఆర్టీసీ బస్సులో ఎక్కి మహిళలతో కలిసి కొద్ది దూరం ప్రయాణించారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ శ్రీలత, డిప్యూటీ ఆర్ ఎం వో భాను కిరణ్ , డిప్యూటీ ఆర్ ఎం ఎం మాధవరావు, హనుమకొండ డిపో మేనేజర్ భూక్య ధరం సింగ్, వరంగల్ -2 డిపో మేనేజర్ సురేష్, ట్రాఫిక్ సూపర్వైజర్ నజియా సుల్తానా, మెకానికల్ సూపర్వైజర్ చంద్రశేఖర్, సజ్జన్ నాయక్, నేతలు ఎండి అజీజ్ ఖాన్, ఈ.వి. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

కాంగ్రెస్ ఎన్నికల గ్యారంటి హామీల్లో భాగంగా ఈ రోజు హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో వరంగల్  పశ్చిమ ఎంఎల్ఏ నాయిని రాజేందర్ రెడ్డి ఆరోగ్య శ్రీ చేయూత పథకాన్ని ప్రారంభించారు.

 ఈ సందర్భంగా నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ

రాష్ట్ర ప్రజలందరికి ప్రభుత్వమే వైద్యం అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరిస్తూ ఒకొక్క కుటుంబానికి ఏడాదికి 10 లక్షల పరిమితితో  అందిస్తున్నాం 

రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పోరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 10 లక్షలకు పెంచింది, ఈ పథకం ఈ నెల తొమ్మిది తేది నుండి అమలులోకి వచ్చిందని అన్నారు.

ఇప్పటిదాకా ఈ పథకం కింద ఒకొక్క కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల వరకు పరిమితి ఉండేదని, ఇప్పుడు దీన్ని రెట్టింపు చేసామని, ఇప్పుడు ఈ పథకం అన్ని ఆరోగ్య శ్రీ  ఎం ప్యానల్  ఆసుపత్రుల్లో తక్షణమే అమల్లోకి వస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పీడి డిఆర్డిఏ శ్రీనివాస్ కుమార్, డిఎంఅండ్ హెచ్ ఓ  సాంబశివరావు, కెఎంసీ  ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్,కార్పొరేటర్ శ్రీమాన్  రెడ్ క్రాస్ రాష్ట్ర ఈసీ మెంబెర్ ఈవి  శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడివరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

2024 ఫిబ్రవరిలో జరుగనున్న మేడారం జాతరను ఘనంగా నిర్వహించాలని, భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని  మంత్రివర్యులు సీతక్క అన్నారు. సోమవారం  హైదరాబాద్ లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రివర్యులు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. జాతరలో పారిశుధ్యం, రహదారులు, విద్యుత్తు, తాగునీటి లభ్యత, స్నానాల ఏర్పాట్లు, భక్తుల వసతులు తదితర అంశాలవారీగా సంబంధిత అధికారులతో చర్చించి తగు ఆదేశాలిచ్చారు.

ఇంత క్రితం జాతరకు రెండు నెలల ముందే జరిగిన కోయ గిరిజన ఇలవేల్పుల సమ్మేళనం ఈ సారి జాతర సమయంలోనే జరిగేటట్లు చూడాలని, తద్వారా భక్తులకు గిరిజన సాంస్కృతిక వైభవం గురించి బాగా తెలుస్తుందన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌరవ మంత్రివర్యులు కేంద్ర ప్రభుత్వానికి మరోసారి ప్రతిపాదనలు పంపి మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కోసం కృషి చేద్దామని, తద్వారా రాష్ట్ర బడ్జెట్ కు కేంద్ర నిధులు తోడై జాతరను మరింత ఘనంగా నిర్వహించుకుందామని అన్నారు. వచ్చే వారం ఏటూరునాగారంలోని ఐటీడీఏ అధికారులు అందరితో సమీక్ష నిర్వహించి జాతర పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ తన తల్లివంటిదని, ఈ శాఖ ఉద్యోగులు తనను సోదరిలా భావించి తమ సమస్యలను ఎప్పుడైనా చెప్పుకోవచ్చని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమాన్ని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్. చొంగ్తు సమన్వయం చేయగా శాఖ అదనపు సంచాలకులు శ్రీ విట్టా సర్వేశ్వర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ శ్రీ శంకర్, ట్రైకార్ జీఎం శ్రీ శంకర్, టీ ఆర్ ఐ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

రానున్న ఎన్నికలకు ఓటర్ల జాబితా సరిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. హైదరాబాదులోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పటిష్టమైన నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ మాట్లాడుతూ 2024 జనవరి 1వ తేదీ నాటికి ఓటర్ల జాబితాలో సవరణలు, కొత్త ఓటర్ల నమోదు, ఇతర మార్పు చేర్పులు తొలగింపుల ప్రక్రియ అనంతరం ఓటర్ల జాబితా అంత సిద్ధం చేసుకోవాలన్నారు. ఓటర్ల జాబితాను మరోసారి సమగ్రంగా పరిశీలించాలన్నారు. మృతిచెందిన ఓటర్ల వివరాలను నిర్ధారించుకున్న తర్వాతనే తొలగింపు చేయాలన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు ఇతర ఏ సమస్యలైనా ఉన్నట్లయితే ఆర్వోలు అదనపు ఆర్వోల ద్వారా వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హనుమకొండ జిల్లాలోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో ఉన్న పోలింగ్ కేంద్రాల వివరాలు, బిఎల్ఓ ల సమాచారం, ఓటరు సమాచార స్లిప్పులు, ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు, తదితర వివరాలను ఆర్డీవోలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో పాటు ట్రైనీ కలెక్టర్ శ్రద్ద శుక్ల, పరకాల, హనుమకొండ ఆర్డీవోలు శ్రీనివాస్, రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

పెద్దపల్లి.డిసెంబర్11మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్.జర్మనీలో నర్సింగ్ సిబ్బందిగా పని చేయడానికి ఆసక్తి,అర్హత గలవారు తమ రెజ్యూమ్ ను డిసెంబర్ 15 లోగా tomcom.germany@gmail.com మెయిల్ ఐడీకి పంపాలని జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతి రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్(TOMCOM)ద్వారా శిక్షణతో పాటు నియామకం కొరకు ప్రత్యేకకార్యక్రమం అమలు చేస్తున్నదని,జర్మనీలో ఆరోగ్య సంరక్షణ కార్మికులకు ముఖ్యంగా నర్సులకు అధిక డిమాండ్ ఉన్నందున,టామ్ కామ్ ఇప్పుడు జర్మనీలో చదువుకోవడానికి,నర్సింగ్ లో 3 సంవత్సరాల ఇంటర్నేషనల్ డిగ్రి పొందేందుకు అవకాశం కల్పించిందని,డిగ్రీ తరువాత నెలకు రెండు నుంచి మూడు లక్షల వరకు ఆకర్షణీయమైన జీతం ప్యాకేజీతో ఉద్యోగం హామీ లభిస్తుందని.3సంవత్సరాల పాటు నెలకు లక్ష రూపాయల స్టైఫండ్ లభిస్తుందని తెలిపారు.కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి18 నుంచి 28సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు అర్హులని,ఎంపిక చేయబడిన అభ్యర్థులకు జర్మనీ భాషపై హైదరాబాద్ లో రెసిడెన్షియల్ శిక్షణ6నెలల పాటు అందించబడుతుందని తెలిపారు.ఇతర వివరాలకొరకు సెల్ నెంబర్ 6302292450/7901290580 నందు సంప్రదించాలని,మరిన్ని వివరాల కోసం www.tomcom.telangana.gov.in సందర్శించాలని వై.తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు.


                                      

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ 





హన్మకొండ; 

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని పరకాల శాసనసభ సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి, రాజీవ్  ఆరోగ్య శ్రీ పథకాలను పరకాల లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా  ప్రభుత్వం పని చేస్తుందన్నారు.  ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించిన మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షలకు పెంచుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.

మహాలక్ష్మి పథకం లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో  ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో  మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం జీరో చార్జీ టికెట్ అందించడం జరుగుతుందని, ఇది మహిళా సాధికారతకు దోహదపడడంతో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్  సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చని వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ  ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలను అమలు చేస్తుందన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం   6 గ్యారంటీలలో భాగంగా   ప్రారంభించిన ఈ పథకాన్ని  మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.    మహిళలతో పాటు బాలికలు, విద్యార్థినులు, ట్రాన్స్ జెండర్ లు కూడా ఉచితంగా ప్రయాణించ వచ్చని పేర్కొన్నారు.

 ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింతగా బలోపేతం చేస్తూ  రూపాయలు ఐదు లక్షల నుంచి రూపాయలు 10 లక్షలకు పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు  అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఆర్టీసీ బస్సు ముందు ఎమ్మెల్యే పచ్చ జెండాను ఊపి  ఆర్టీసీ బస్సులో కొద్ది దూరం ప్రయాణించారు.

 ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డిఓ శ్రీనివాస్, పురపాలక కమిషనర్ శేషు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు, ఇతర అధికారులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.