ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అన్నారు.
గురువారం హనుమకొండ మండలం గుండ్ల సింగారంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో వయోవృద్ధుల సంక్షేమ సంస్థ విద్యారణ్యపురి ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా హాజరై మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఆరోగ్య సంరక్షణకు శ్రద్ధ తీసుకోవాలన్నారు. ముఖ్యంగా వయోవృద్ధులు మంచి ఆరోగ్యం కోసం మరింత శ్రద్ధ వహించడంతోపాటు ఆరోగ్య సంరక్షణకు జాగ్రత్తలు పాటించాలన్నారు.
ఈ ఉచిత వైద్య ఆరోగ్య శిబిరంలో వైద్యులు, సిబ్బంది స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ లావుడ్యా రవి నాయక్, జిల్లా సంక్షేమ అధికారి కె. మధురిమ, వయోవృద్ధుల సంక్షేమ సంస్థ విద్యారణపురి ప్రతినిధులు దామెర నర్సయ్య, మేకల వెంకటయ్య, తేరాల యుగేందర్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: