ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;యువత అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ తెలిపారు. హనుమకొండ జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా యువజన ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా యువజన సంక్షేమ, క్రీడల శాఖ అధికారి గుగులోత్ అశోక్ కుమార్ వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అజీజ్ ఖాన్ హాజరై మాట్లాడుతూ భారతదేశం అత్యధిక యువ జనాభా కలిగిన దేశం అని అన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో యువత యొక్క పాత్ర అమోఘమైందని తెలంగాణ రాష్ట్ర సాధనలో యువతి యువకులు చేసిన పోరాట ఫలితమే ఈరోజు మనం స్వరాష్ట్రంలో జీవనాన్ని కొనసాగిస్తున్నామన్నారు. ముఖ్యంగా మన తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని వైభవాన్ని ప్రతి ఒక్కరు తప్పకుండా ఆచరిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువతలో ఉన్న శక్తిని వెలికి తీయడానికి ఇలాంటి యువజన ఉత్సవాలు చాలా ఉపయోగపడతాయి అన్నారు. మరొక ప్రత్యేక అతిథిగా హాజరైన జాతీయ యువజన అవార్డు గ్రహీత మండల పరశురాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఒక నూతన యువజనపాల్సిని మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ మరియు పట్టణ యువతీ యువకులను సాంస్కృతిక రంగాల్లో అలాగే క్రీడ రంగాల్లో రాణించడానికి ప్రత్యేకమైనటువంటి పాలసీని తీసుకువచ్చి వారిని అభివృద్ధి పరచాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో యువజన అవార్డు గ్రహీత గంగోజుల నరేష్ ,యువజన సంక్షేమ శాఖ సిబ్బంది నయుం , సుజన్ ,ఏవీ కళాశాల ఎన్ఎస్ఎస్ పోగ్రామ్ ఆఫీసర్ కోడిమాల శ్రీనివాస్ రావు, సిబ్బంది వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువతీ యువకులు పాల్గొన్నారు.
వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.
Post A Comment: