ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ
టీఎస్ ఎన్పీడీసీఎల్ సిఎండిగా నియమితులైన కె. వరుణ్ రెడ్డి శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. హనుమకొండలోని మున్సిపల్ కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి మొక్క ను అందజేశారు. ఈ సందర్భంగా సీఎండి వరుణ్ రెడ్డికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: