ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే మహాలక్ష్మి పథకాన్ని హనుమకొండ బస్టాండ్ లో సోమవారం ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ఈ పథకంతో మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించేందుకు వీలుంటుందన్నారు. ఈ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహాలక్ష్మి పథకాన్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆర్టీసీ బస్సు ముందు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆర్టీసీ బస్సు కండక్టర్ కు డబ్బులు చెల్లించి టికెట్ ను తీసుకొని ఆర్టీసీ బస్సులో ఎక్కి మహిళలతో కలిసి కొద్ది దూరం ప్రయాణించారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ శ్రీలత, డిప్యూటీ ఆర్ ఎం వో భాను కిరణ్ , డిప్యూటీ ఆర్ ఎం ఎం మాధవరావు, హనుమకొండ డిపో మేనేజర్ భూక్య ధరం సింగ్, వరంగల్ -2 డిపో మేనేజర్ సురేష్, ట్రాఫిక్ సూపర్వైజర్ నజియా సుల్తానా, మెకానికల్ సూపర్వైజర్ చంద్రశేఖర్, సజ్జన్ నాయక్, నేతలు ఎండి అజీజ్ ఖాన్, ఈ.వి. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: