ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
కాంగ్రెస్ ఎన్నికల గ్యారంటి హామీల్లో భాగంగా ఈ రోజు హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో వరంగల్ పశ్చిమ ఎంఎల్ఏ నాయిని రాజేందర్ రెడ్డి ఆరోగ్య శ్రీ చేయూత పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ
రాష్ట్ర ప్రజలందరికి ప్రభుత్వమే వైద్యం అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరిస్తూ ఒకొక్క కుటుంబానికి ఏడాదికి 10 లక్షల పరిమితితో అందిస్తున్నాం
రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పోరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 10 లక్షలకు పెంచింది, ఈ పథకం ఈ నెల తొమ్మిది తేది నుండి అమలులోకి వచ్చిందని అన్నారు.
ఇప్పటిదాకా ఈ పథకం కింద ఒకొక్క కుటుంబానికి ఏడాదికి రూ. 5 లక్షల వరకు పరిమితి ఉండేదని, ఇప్పుడు దీన్ని రెట్టింపు చేసామని, ఇప్పుడు ఈ పథకం అన్ని ఆరోగ్య శ్రీ ఎం ప్యానల్ ఆసుపత్రుల్లో తక్షణమే అమల్లోకి వస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పీడి డిఆర్డిఏ శ్రీనివాస్ కుమార్, డిఎంఅండ్ హెచ్ ఓ సాంబశివరావు, కెఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ మహమ్మద్ అజీజ్ ఖాన్,కార్పొరేటర్ శ్రీమాన్ రెడ్ క్రాస్ రాష్ట్ర ఈసీ మెంబెర్ ఈవి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: