ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు సత్వర పరిష్కారం కోసం వెంటనే చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించిన 55 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా డిఆర్ఓ వై. వి గణేష్, డిఆర్డిఓ శ్రీనివాస్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: