ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
రానున్న ఎన్నికలకు ఓటర్ల జాబితా సరిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. హైదరాబాదులోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పటిష్టమైన నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ మాట్లాడుతూ 2024 జనవరి 1వ తేదీ నాటికి ఓటర్ల జాబితాలో సవరణలు, కొత్త ఓటర్ల నమోదు, ఇతర మార్పు చేర్పులు తొలగింపుల ప్రక్రియ అనంతరం ఓటర్ల జాబితా అంత సిద్ధం చేసుకోవాలన్నారు. ఓటర్ల జాబితాను మరోసారి సమగ్రంగా పరిశీలించాలన్నారు. మృతిచెందిన ఓటర్ల వివరాలను నిర్ధారించుకున్న తర్వాతనే తొలగింపు చేయాలన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు ఇతర ఏ సమస్యలైనా ఉన్నట్లయితే ఆర్వోలు అదనపు ఆర్వోల ద్వారా వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హనుమకొండ జిల్లాలోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో ఉన్న పోలింగ్ కేంద్రాల వివరాలు, బిఎల్ఓ ల సమాచారం, ఓటరు సమాచార స్లిప్పులు, ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు, తదితర వివరాలను ఆర్డీవోలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో పాటు ట్రైనీ కలెక్టర్ శ్రద్ద శుక్ల, పరకాల, హనుమకొండ ఆర్డీవోలు శ్రీనివాస్, రమేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: